Type Here to Get Search Results !

క్రెడిట్ ఆఫీసర్... కొలువు అందుకుంటారా..!

 క్రెడిట్ ఆఫీసర్... కొలువు అందుకుంటారా..!



» బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు

» మూడు కేటగిరీల్లో 514 పోస్ట్లకు నోటిఫికేషన్ విడుదల

» రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా నియామకం

» భవిష్యత్తులో జీఎం, సీజీఎం స్థాయికి చేరుకునే అవకాశం

» డిగ్రీ, ఎంబీఏ అర్హతతో పోటీ పడే అవకాశం

పీఓ, క్లర్క్ పోస్ట్లను ఐబీపీఎస్ కామన్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇం డియా.. కొన్ని స్పెషలిస్ట్ కేటగిరీలకు సంబంధించి మాత్రం సొంతంగా నియామక ప్రక్రియ చేపడు తోంది. తాజాగా క్రెడిట్ ఆఫీసర్స్ పోస్ట్లకు నోటిఫి కేషన్ విడుదల చేసింది.

మొత్తం 514 పోస్ట్లు

బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నోటిఫికేషన్ ప్రకా రం-మూడు కేటగిరీల్లో 514 క్రెడిట్ ఆఫీసర్స్ పోస్ట్ లకు దరఖాస్తులు కోరుతోంది. అవి.. క్రెడిట్ ఆఫీ సర్ (ఎస్ఎంజీఎస్- 4)-36, క్రెడిట్ ఆఫీసర్ (ఎం ఎంజీఎస్-3)-60, క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్-2)-418 2,

అర్హతలు

క్రెడిట్ ఆఫీసర్-ఎంఎంజీఎస్-2,3: ప్రధమ శ్రేణిలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. బ్యాంకిం గ్/ఫైనాన్స్/బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనుబంధ విభాగాల్లో పీజీడీబీ/పీజీడీబీఎం లేదా సీఏ/సీఎఫ్ ఏ/ఐసీడబ్ల్యుఏ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది. దీంతోపాటు అయిదేళ్ల అనుభవం ఉండాలి.

క్రెడిట్ ఆఫీసర్(ఎస్ఎంజీఎస్-4): బ్యాచిలర్ డిగ్రీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత ఉండాలి. దీంతో పాటు ఎంబీఏ/పీజీడీఎం/ సీఏ/ సీఎంఏ/ సీఎఫ్ఎ /ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి. వీటితోపాటు బ్యాం కింగ్ రంగంలో ఎనిమిదేళ్ల అనుభవం తప్పనిసరి.

వయసు

2025, నవంబర్ 1 నాటికి ఎస్ఎంజీఎస్-3 పోస్టులకు 30-40 ఏళ్లు, ఎంఎంజీఎస్- 3 పోస్టు లకు 28-38 ఏళ్లు, ఎంఎంజీఎస్-2 పోస్టులకు 25 -35 ఏళ్లు ఉండాలి..

రెండు దశల ఎంపిక ప్రక్రియ

క్రెడిట్ ఆఫీసర్ పోస్ట్ల భర్తీ కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా రాత పరీక్ష, ఇంటర్వ్యూ పేరుతో రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది.

రాత పరీక్ష 150 మార్కులు

ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షను 4 విభాగాల్లో 150 మార్కులకు నిర్వహిస్తారు.

ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు-25 మార్కు లు), రీజనింగ్(25 ప్రశ్నలు-25 మార్కులు), క్వాం టిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు-25 మార్కు లు), ప్రొఫెషనల్ నాలెడ్జ్ (75 ప్రశ్నలు-75 మార్కు లు) విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షకు ఆం దుబాటులో ఉండే సమయం రెండు గంటలు,

మలి దశ ఇంటర్వ్యూ

రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. మలి దశలో 100 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వ హిస్తారు. రిజర్వేషన్లు, ఇతర ప్రామాణికాలను పరిగ ణనలోకి తీసుకుని ఒక్కో పోస్ట్కు నలుగురిని చొప్పున (1:4 నిష్పత్తిలో) పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూలో క్రెడిట్ ఆఫీసర్ హోదా లో విధుల నిర్వహణకు ఉన్న పరిజ్ఞానం, అప్పటి వరకు నిర్వర్తించిన విధులు, సాధించిన విజయాలు, బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలపై అవగా హనను పరిశీలించి.. అభ్యర్థులు ఇచ్చిన సమాధాన లకు అనుగుణంగా మార్కులు కేటాయిస్తారు.

వెయిటేజీ విధానం

క్రెడిట్ ఆఫీసర్స్ పోస్ట్లకు తుది నియామకాలను ఖరారు చేసే క్రమంలో.. రాత పరీక్ష, పర్సనల్ ఇం టర్వ్యూ మార్కులకు వెయిటేజీ కల్పిస్తారు. రాత పరీక్ష మార్కులకు 70 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూ మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇస్తారు. అభ్య ర్థులు ఈ రెండింటిలో పొందిన మార్కులను వెయి టీజీకి అనుగుణంగా క్రోడీకరించి.. తుది జాబితా రూపొందిస్తారు. అందులో చోటు సాధించిన వారికి నియామకాలు ఖరారు చేస్తారు.

కీలక విధులు ఇవే

క్రెడిట్ ఆఫీసర్లుగా నియమితులైన వారు బ్యాం కులో కీలక విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. క్రెడిట్ ప్రపోజల్స్ పరిశీలన, పర్యవేక్షణ, క్రెడిట్ రిస్క్ అసెస్మెంట్, వాల్యుయేషన్ రిపోర్ట్స్, లీగల్ రిపోర్ట్స్ వెరిఫికేషన్, క్యాష్ ఫ్లో అనాలిసిస్, క్రెడిట్ ఆడిట్ రిపోర్ట్స్ పరిశీలన వంటివి చేయాల్సి ఉంటుంది.

జీఎం స్థాయికి చేరుకునే అవకాశం

క్రెడిట్ ఆఫీసర్లుగా ఎస్ఎంజీఎస్-4, ఎంఎంజీఎ స్-2, 3లుగా నియమితులైన వారు భవిష్యత్తులో పదోన్నతుల ద్వారా జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ప్రతి హోదాలో కనీసం అయిదేళ్లు పని చేసిన తర్వాత సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతికి అర్హత లభి స్తుంది. స్కేల్-2లో మేనేజర్గా, స్కేల్-3లో సీని యర్ మేనేజర్, స్కేల్-4లో చీఫ్ మేనేజర్, స్కేల్ -5 ఏజీఎం, స్కేల్-6 డీజీఎం, స్కేల్-7 జీఎం హోదాలు లభిస్తాయి.

విజయం సాధించాలంటే

ఇంగ్లీష్ లాంగ్వేజ్

ఈ విభాగంలో రాణించాలంటే.. బేసిక్ గ్రామ ర్తో మొదలుపెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిష న్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

రీజనింగ్

రీజనింగ్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్ధులు పక డ్బందీగా వ్యవహరించాలి. సిరీస్, అనాలజీ, కోడిం గ్-డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకిం గ్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, సిలాజిజమ్స్పై పట్టు సాధించాలి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ద్

ఈ విభాగానికి సంబంధించి అర్థమెటిక్పై పట్టు సాధించాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సం టేజెస్, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్. ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్న లను ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు నంబర్ సిరీస్, డేటా అనాలిసిస్ విభాగాలను కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.

ప్రొఫెషనల్ నాలెడ్జ్

ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే.. అభ్యర్ధులు బ్యాచి లర్, పీజీ స్థాయిలోని పుస్తకాలను చదవాలి. ముఖ్య మైన కాన్సెప్ట్ ను అప్లికేషన్ అప్రోచ్ అధ్య యనం చేయాలి. ఆయా విభాగాలకు సంబంధించి గత ప్రశ్న పత్రాలు, ఇతర పోటీ పరీక్షల ప్రశ్న పత్రా లను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉం టుంది.

వెబ్ సైట్ :

https://bankofindia.bank.in/career/recruitment-notice

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area