ఎస్సీ ఫైనాన్స్ & డెవలప్మెంట్ కార్పొరేషన్లో మేనేజర్లు
నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 4 భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
• అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 01
• అసిస్టెంట్ మేనేజర్: 01
• జూనియర్ ఎగ్జిక్యూటివ్: 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏతో పాటు పని అనుభవం.
వయసు: 13-04-2025 తేదీ నాటికి అసిస్టెంట్ జనరల్ మేనేజరు 42 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజరు 30 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్కు రూ.70,000 రూ.2,00,000 అసిస్టెంట్ మేనేజర్కు రూ.30,000 రూ.1,20,000 జూనియర్ ఎగ్జిక్యూటివ్కు రూ.26,000 - రూ.99,000.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-04-2025.
వెబ్ సైట్: https://nsfdc.nic.in/en/careers