Type Here to Get Search Results !

పరీక్షల పోటీలో గెలుద్దాం ఇలా

 పరీక్షల పోటీలో గెలుద్దాం ఇలా


సత్తా ఉన్నా. సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం లేనందున యువత పోటీ పరీక్షా ఫలితాల్లో వెనుకబడుతోంది. ఇలాంటివారికి పోటీ పరీక్షల్లో సమస్యలు, పరిష్కారాలపై సంపూర్ణ అవగాహన అవసరం.

నిజాయతీగా ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి ప్రభుత్వ కొలువు అద్భుత అమాశు దీనికి తోడు సమాజంలో గుర్తింపు. గౌరవం ప్రభుత్వ అధికారికి లభిస్తాయి. ప్రభుత్వ కొలువు సాధనకు పటిష్ట ప్రణాళిక, వ్యూహం, పట్టుదల, కష్టపడే తత్వం అవసరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సివిల్స్ తో పాటుగా గ్రూప్-1 గ్రూప్- 2 ఉద్యోగాల కోసం లక్షల మంది అభ్యర్ధులు ఏళ్ల తరబడి శిక్షణ తీసుకుంటున్నారు. వివిధ మెటిరియల్స్ తోనో, ఆన్లైన్ ద్వారానో ప్రిపేర్ అవుతుంటే కొంతమంది హైదరాబాద్, విజయ వాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కోచింగ్ సెంటర్లకు వెళ్తూ కృషి కొనసాగిస్తున్నారు. గ్రూప్స్ పరీక్షల్లో వందల సంఖ్యలో ఉండే పోస్టుల కోసం లక్షల మంది పోటీ పడుతున్నారు. అంటే పోటీ ఎంత స్థాయిలో ఉంటుందో గ్రహించవచ్చు.

యజ్ఞంలా కొనసాగాలి.

• పోటీ పరీక్షల రాయాలనుకున్న అభ్యర్థులు నిరంతరాయంగా, ఒకే స్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించాలి. దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకొని సిలబస్ ను మూడు నాలుగు సార్లు చదవాలి. గతంలో జరిగిన వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను విశ్లేషించుకుని సన్నద్ధత మొదలు పెట్టాలి.

• పోటీ పరీక్షల్లో విజేతలతో పాటు పలుసార్లు విఫలమైన అభ్యర్థులను కూడా సంప్రదించి సూచనలూ, సలహాలు తీసుకోవడం మంచిది.

• గత పదేళ్లుగా ట్రాప్స్ పరీక్షల్లో గణనీయమైన మార్పులు బరు గుతున్నాయి. పూర్తి అవగాహనతో సబ్జెప్లైపై లోతైన విశ్లేషణ ఉంటేనే, పరీక్షల్లో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించ వచ్చు. అంతేగానీ బట్టి పట్టి మూస పద్ధతిలో బండగా గుర్తుం చుడనేవారికి కాలం చెల్లిందనే చెప్పాలి. మారుతున్న పరీక్షా విదానం, ప్రశ్నల ధోరణులకు అనుగుణంగా అభ్యర్థులు తమ ప్రిపరేషన్లో మార్పులు తీసుకురావాలి.

ఏయే సవాళ్లు?

1) సుదీర్ఘ ప్రిపరేషన్ అవసరం.

మిగతా పోటీ పరీక్షల్లా కాకుండా సివిల్స్, గ్రూప్స్ రాసే అభ్యర్థులు నిర్దిష్టమైన ప్రణాళికతో కనీసం రెండు మూడేళ్లు క్రమశిక్షణతో, పట్టుదలతో చదవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, మౌఖిక పరీక్షలో ఏ దశలో విఫలమైనా ప్రతిసారీ వైకుంఠపాళి ఆటలా, మళ్ళీ మొదటి నుంచే సన్నద్ధత కొనసాగించాలి. వీటితోపాటు సరైన సమయానికి ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడం, వివిధ కారణాలతో కోర్టు కేసులతో ఎక్కువ కాలం. నిరీక్షించాల్చివస్తుంది.

సుదీర్ఘ కాలం ప్రిపరేషన్ కొనసాగించడంలో చాలా మంది ఆర్థిక, మానసిక ఒత్తిళ్లకు లోనవడం. సహజం. కనీసం రెండు మూడేళ్లకు తగిన ఏర్పాట్లు చేసుకొన్న తర్వాతే నిరుద్యోగ యువత పోటీ పరీక్ష లకు సిద్ధం కావాలి.

2) పోటీ సుడిగుండంలో చిక్కుకుపోవడం

సివిల్స్/ గ్రూప్స్ పరీక్షల మోజులో చాలామంది యువత తన కెరియర్లూ జీవితా లను పణంగా పెడుతున్నారు. పోటీ పరీక్షల్లో నెగ్గితేనే జీవితం' అనే ధోరణి వారి ఉని దీని ప్రమాదంలో పడేస్తోంది. ఏరు నుంచి పది సంవత్సరాల వరకు ప్రిపరేషన్ కొనసా గిస్తూ నష్టపోతున్నారు. చదివిన డిగ్రీ, పీజీ సబ్జెక్టుల పై నైపుణ్యం కోల్పోలు, పోటీ పరీక్షల్లో నెగ్గక, ఏ ఉద్యోగానికి పనికిరాక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందుకని పోటీ పరీక్షలకు సన్నద్దం కావాలని నిర్ణయించుకున్న యువత నిర్దిష్ట కాలపరిమిత (రెండు లేదా మూడు సంవత్సరాలు) ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగించడం ఉత్తమం. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే మంచిదే. కానీ నిర్ణీత కాలంలో ఏ ఉద్యోగమూ సాదిం చకపోతే విద్యార్హతలను బట్టి ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగానికి ప్రకుత్నించడం అవసరం. ఇంకా చెప్పాలంటే- ఒక ఉద్యోగం సాధించాక జీవితంలో నిర్ణీత వయసులో పెళ్లి వంటి దశలు ముగిశాక మళ్లీ పోటీ పరీక్షలకు సమాయత్తమవడం మంచిది. ఆ విధంగా పోటీ పరీక్షల్లో విజయం సాదించినవారు చాలామంది ఉన్నారు.

3) ఆర్థికంగా చితికిపోవడం 

పోటీ పరీక్షల పేరుతో ముఖ్యంగా పేద, మధ్య తరగతి యువతీ యువకులు కోచింగ్ల కోసం ముఖ్య పట్టణాలకు తరలి వెళ్తున్నారు. అక్కడ అద్దెకు గదులను తీసుకుంటూ భోజనా వికి కూడా అప్పులు చేసి మణి ఉద్యోగ ప్రయ త్నాలు చేస్తున్నారు. అది నిర్దిష్ట కాలపరిమితి వరకూ ఫరవాలేదు. కానీ చాలామంది ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తూ అప్పులపాలవు తున్నారు. ఆశావహ పలితాలు రాక ఆర్థిక సమస్యల భట్రంలో చిక్కుకుపోతున్నారు. ఉద్యోగ ప్రయత్నానికి ముందుగానే ఒక ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం చాలా ఆవసరం విజేత అవనప్పుడు ఏదో ఒక చిరుద్యోగాన్ని సాధించి, ఆపై ప్రణాళిక, క్రమశిక్షణలతో సన్నద్ధత కొన సాగించడం మేలు.

4) మానసిక సైద్దాం కోల్పోవడం

నిరుద్యోగ యువత పోటీ పరీక్షల్లో పలుసార్లు వైఫల్యానికి గురైనప్పుడు మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. వివిధ కారణాల వల్ల పరీక్షలు సమయానికి జరగ కపోవడం, జరిగినా ఫలితాలు ఎప్పుడు వస్తాయో అని నిరీక్షిం చడం తప్పటంలేదు. అవాంత కాటు వచ్చినపుడు ఎప్పటిక ప్పుడు విజేతల స్ఫూర్తి కథనాలను చదువుతూ, వీలైతే వారిలో కొందరిని కలవడం ద్వారా మానసిక ధైర్యాన్ని సమకూర్చుకోవాలి.

అంతేకాక తల్లిదండ్రులు తమ పిల్లలు త్వరితగతిన ఉద్యోగాల్ని సంపాదించి.. పెళ్లి తరితర ముఖ్య ఘట్టాలను పూర్తి చేయాలని ఆశిస్తుంటారు. వారి స్నేహి తులతో, బందు వర్గంలోని పిల్లలతో పోల్చే ప్రయత్నం చేస్తుంచారు. ఇటు వంటి ఒత్తిడిని అభ్యర్ధులు తట్టుకుని తల్లిదండ్రులకు తాము చేస్తున్న ప్రపరేష న్పై, పోటీ పరీక్షలపై అవగాహన కల్పిం చాలి తల్లిదండ్రులు కూడా అభ్యర్థులు నిజాయతీగా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ముందుకు వెళ్ళున్నప్పుడు పిల్లలపై ఒత్తిడి చేయకుండా ప్రోత్సహించాలి.

ఒకసారి పోటీ పరీక్షలకు సమాయత్తం కావాలని నిర్ల యించుకున్న తర్వాత అభ్యర్థులు దృఢ చిత్తంతో వ్యవహ రించాలి. కృపీతో నాస్తి దుర్భిక్షం' అని గుర్తుంచుకుని యజ్ఞంలా సన్నద్ధత కొనసాగించాలి. ఎటువంటి ఆసక్తి, పకడ్బందీ ప్రణాళిక లేకండా పోటీ పరీక్షలకు సమాయత్తం కావడం వృథా. అవాంతరాలు, అడ్డంకులూ వస్తూనే ఉంటాయి. వాటిని దాటుకొని, నిరంతరం శ్రమిస్తూ వ్యూహాత్మకంగా, క్రమశిక్షణతో సాధన చేస్తే విజయం తథ్యం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area