ఏపీ ఈఏపీ సెట్-2025 : ఈఏపీసెట్ తో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా
» ఆంధ్రప్రదేశ్లో ఈఏపీ సెట్- 2025 నోటిఫికేషన్ విడుదల
» ఇంజనీరింగ్, అగ్రీకల్చరల్, ఫార్మసీ కోర్సులకూ ఈ పరీక్ష ర్యాంకే ఆధారం
» మే 19 నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు
బీటెక్, ఇంటర్మీడియెట్ ఎంపీసీ విద్యార్థుల తొలి ప్రాధాన్యం! బైపీసీ విద్యార్థులు నైతం మెడిసిన్ కు ప్రత్యామ్నాయ కోర్సుల గురించి అన్వేషిస్తున్న పరిస్థితి. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎంట్రన్స్లలపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నారు. ఇలాంటి వారికి చక్కటి మార్గంగా నిలుస్తోంది.. ఈపన్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మన్) సెట్! ఇందులో విజయం సాధిస్తే.. ఇంజనీరింగ్ ఫార్మసీ, అగ్రికల్చరల్ అను బంధ కోర్సుల్లో అడ్మిషన్ లభిస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఈఏపీ సెట్- 2025 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఏపీ-ఈఏపీసెట్ 2025తో ప్రవే శం కల్పించే కోర్సులు, దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలు.
ఈ కోర్సుల్లో ప్రవేశం:
ఏపీ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్, బయోటెక్నా లజీ, బీటెక్(డైరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇం జనీరింగ్), బీటెక్(వుర్ సైన్స్ అండ్ టెక్నాలజీ). బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బండ్రీ. బ్యాచిటర్ ఫిషరీస్ సైన్స్, బీఫార్మసీ, పార్మాడీ = కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ఈఏపీ సెట్లో పాం దిన ర్యాంకు ఆధారంగా ఆన్లైన్ కౌన్సెలింగ్ సర్వ హించి సీట్లు కేటాయిస్తారు.
అర్హత:
ఇంజనీరింగ్ స్ట్రీమ్ కు.. ఎంపీసీ గ్రూప్తో ఇంట ర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. మూడేళ్ల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులు కూడా దరఖాస్తుకు అర్హులే. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులు ఇంటర్మీడి యెట్ బైపీసీ గ్రూప్లో ఉత్తీర్ణత సాధించాలి. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు సైతం ఈఏపీసెట్కు దర ఖాస్తు చేసుకోవచ్చు.
160 మార్కులకు పరీక్ష:
ఏదీ ఈఏపీసెట్ పరీక్ష మూడు విభాగాల్లో 160 మార్కులకు జరుగుతుంది. ఈ సెట్ను ఇంజనీరిం గ్ స్ట్రీమ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ లుగా వేర్వే రుగా నిర్వహిస్తారు.
ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష:
ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్ నుం చి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఉం బాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతుంది.
అగ్రికల్టర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్:
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలుంటాయి. బయాలజీ (బో టనీ, జువాలజీ) నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు అడుగు తారు, బయాలజీలో బోటనీ, జువాలజీ నుంచి 40 ప్రశ్నలు చొప్పున ఉంటాయి.
పరీక్షలో రాణించేలా
మ్యాథమెటిక్స్:
ఈఏపీ సెట్లో 50 శాతం వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సిల బస్ అంశాల్లోని ప్రాథమిక సూత్రాలపై పట్టుసాధిం చాలి. దీంతోపాటు వేగం, కచ్చితత్వంపై దృష్టిసా రించాలి. ఇంటర్ మ్యార్స్ సిలబస్ను ఆల్జీబ్రా. కాల్కులస్, జామెట్రీ, వెక్టార్ ఆల్జీబ్రా, ట్రిగనోమె ట్రీగా విభజించొచ్చు. జామెట్రీకి వెయిటేజీ కొంత ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో 2డీ, 3డీ జామెట్రీ, లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, స్టైట్ లైన్స్, సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారా బోలా, ఎల్లిప్స్, డైరక్షన్ కొసైన్స్, డైరక్షన్ రేషి యోస్, ప్లేన్ తదితరాలు కీలక అంశాలుగా ఉం. టాయి. అదే విధంగా ఆల్జీబ్రా విభాగంలో వం క్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిసెస్, కాం ప్లెక్స్ సుబర్న్, డిమోయర్స్ వీరమ్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థీరమ్ తదితరా లపై పట్టు సాధించాలి. ట్రిగ్నోమెట్రీలో ట్రిగ్నోమె ట్రిక్ రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ ఈర్వేషన్స్. ప్రాప ర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ తదితర అంశాలను సమగ్రం గా ప్రిపర్కావాలి. వెక్టర్ అల్ జీబ్రా నుంచి అయిదు లేదా ఆరు ప్రశ్నలు వస్తున్నాయి.
ఫిజిక్స్:
ఇందులో హీట్ అండ్ ధర్మోడైనమిక్స్ నుంచి దాదాపు వది ప్రశ్నలు అడిగే అవకాశు ఉంది. ఆ తర్వాత వర్క్ ఎనర్జీ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నటిజం చాప్టర్ల నుంచి అయిదు లేదా ఆరు ప్రశ్నలు వస్తాయి. గ్రావిటేషన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆసిలేషన్స్, వేవ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అం డ్ కెపాసిటెన్స్ చాప్టర్ల నుంచి నాలుగు ప్రశ్నల చొప్పున వస్తాయి. పరీక్షలో అత్యధిక వెయిటేజీ ఉం టున్న మెకానికై ఫై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ, మోడ్రన్ ఫిజిక్స్ పాఠ్యాంశా లకు ప్రాధాన్యం ఇవ్వాలి.
కెమిస్ట్రీ:
కెమిస్ట్రీని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ లుగా విభజించుకొని చదవాలి. ఇనార్గానిక్ కెమి స్త్రీలో పట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇనార్గానిక్ తర్వాత వెయిటేజీ పరంగా వరుసగా ఆర్గానిక్, ఫిజి కల్ కెమిస్ట్రీలు నిలుస్తాయి. కెమిస్ట్రీ అంటే సహజంగా చాలా మందికి తెలియని భయం ఉంటుంది. కాబట్టి ఆ భావనను వక్కనబెట్టి ప్రిపేరయితే కెమి స్టీలోనూ మంచి మార్కులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఫిజికల్ కెమిస్ట్రీలో సాల్యూ షన్స్ చాప్టర్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. గ్రూప్ మూలకాలు, బాయిలింగ్, మెల్టింగ్ పాయిం ట్లు, ఎలక్ట్రో పాజిటివిటీ, ఎలక్ట్రో నెగెటివిటీ, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, టైమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్, స్టాండర్డ్ రిడక్షన్, పాటన్షియల్ వాల్యూమ్ బాపిక్పైనా దృ పెట్టాలి. వీటితోపాటు డి. ఎఫ్-బ్లాక్ ఎలిమెం ట్లు, స్టాండర్డ్ రిడక్షన్ పాటెన్షియల్ వాల్యూ, వెస్పర్ థియరీ తదితరాలపై ఫోకస్ పెట్టాలి. ఆర్గానిక్ కెమి స్ట్రీని జనరల్, హైడ్రోకార్బన్లు, హాలో కాంపౌండ్లుగా విభజించుకొని చదవాలి.
బోటనీ:
డైవర్సిటీ ఇన్ ది లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనై జేషన్స్ ఇన్ ప్లాంట్స్ (మార్పాలజీ), రీ ప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ సిస్టమాటిక్స్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ప్లాం ట్స్. ప్లాంట్ ఎకాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, మైక్రో బయాలజీ (బ్యాక్టీరియా, వైరస్), జెనిటిక్స్, మాలి క్యులర్ బయాలజీ, బయో టెక్నాలజీ, ప్లాంట్స్, మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ అంశాలపై అవ గాహన పెంచుకోవాలి.
జువాలజీ:
జువాలజీ నుంచి డ్రైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ యానిమల్ డైవర్సిటీ, లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రొటొజోవా, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, స్టడీ ఆఫ్ పెరిప్లెనేటా అమెరికానా, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజి యాలజీ, హ్యూమన్ రీప్రొడక్షన్, జెనిటిక్స్, ఆర్గా నిక్ ఎవల్యూషన్, ఆప్లయిడ్ బయాలజీ అంశాలపై దృష్టి పెట్టాలి.
ప్రాక్టీసు ప్రాధాన్యం:
ఈఏపీసెట్ ప్రిపరేషన్లో అభ్యర్థులు ప్రాక్టీస్కు ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా షార్ట్ నోట్స్ రూ పొందించుకోవాలి. ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు. దానికి సంబంధించిన సూత్రం. సిద్ధాంతంపై అవ గాహన పెంచుకోవాలి. ఒక కాన్సెప్ట్కు చెందిన ప్రశ్నను భిన్న కోణాల్లో సాధించేందుకు కృషి చేయా లి. ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్కు సమయం కేటాయిం చాలి. ప్రతి చాప్టర్లోని సినాప్సిస్ పై పట్టు సాధిం చాలి, పరీక్ష తేదీకి కనీసం నెల రోజుల ముందు నుంచి వూర్తిగా వునశ్చరణకే ప్రాధాన్యం ఇవ్వాలి.
ముఖ్య సమాచారం:
» దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
» ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2025, ఏప్రిల్ 24
» హాల్ టికెట్ డౌన్లోడ్: 2025, మే 12
» ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష తేదీలు: మే 21 నుంచి 27 వరకు
» అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ తేదీలు: 19, 20
» పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తుకు వెబ్సైట్: https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx