ఏకాగ్రతకు ఇదీ దారి !
చదివేటప్పుడు ఎంత ఏకాగ్రత పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం. లేదంటే ఎంత సమయం పుస్తకం ముందు కూర్చున్నా చదివేదేదీ పూర్తిస్థాయిలో గుర్తుండదు. అన్నీ తెలిసినట్టే ఉంటుంది కానీ అను కున్న సమయానికి పేపర్ మీద పెట్టలేము. మరి పూర్తి ఫోకస్తో చదివేందుకు పాటించాల్సిన మెలకువలు ఏమిటో చూద్దామా !
• పొమడారో: ఇదొక చక్కని టైమ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చిట్కా చదువుతు న్నప్పుడు ప్రతి 25 నిమిషాలకు ఒక 5 నిమిషాలు విరామం తీసుకోవడం ఇందులో ప్రధానాంశం. దీని ద్వారా మెదడు శక్తి తగ్గిపోకుండా శ్రద్ధ పెడుతూ చదువుకునే వీలుంటుంది. ఒత్తిడి లేకుండా ఆలోచన తాజాగా ఉంటూ ఎక్కువ సేపు చదువుకునేలా చేస్తుంది. అలసటను తగ్గించగలదు.
• అంతరాయం రాకుండా: ఏ విధమైన అంతరాయాలూ, పరధ్యానాలకు ఆస్కారం లేకుండా ఉండే చోటును చదువుకునేందుకు ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ సెల్ఫోన్లూ, ల్యాప్టాప్లూ లాంటివి ఉంచకూడదు. ఒకవేళ ఉంచాల్సి వచ్చినా సోషల్ మీడియా నోటిఫికేషన్స్ వంటివి మ్యూట్ చేసి ఉంచుకోవాలి.
• ధ్యానం: అనుకున్న పనులను ప్రశాంతంగా నిర్వర్తించడంలో ధ్యానం ఎంతగానో సహకరిస్తుంది. రోజూ 5 నుంచి 10 నిమిషాల పాటు ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సై జులు చేయడం ద్వారా ఆలోచన లను ఒకేచోట కేంద్రీకరించడం అలవాటవుతుంది.
• చిన్న లక్ష్యాలు: ఒకేసారి పెద్దవైన, కష్ట సాధ్యమైన అధ్యాయాలు చదవాలని కాకుండా వాటిని చిన్న చిన్నవిగా విభజిం చుకోవాలి. అలాంటి చిన్న టాస్కులను సాధించడం ద్వారా విషయ అవగాహన సులువు అవుతుంది. మనపై మనకు విశ్వాసం పెరుగుతుంది. తద్వారా మరింత ఏకాగ్రతతో ముందుకు వెళ్లగలం.
• మైండ్ మ్యాప్స్: సమాచారాన్ని మనసులో ఊహించుకోవడం, ఒకదానితో ఒకటి లింక్ చేసుకోవడం ద్వారా ఎక్కువగా అర్ధం చేసుకునే వీలుంటుంది. ఏకాగ్రతతో గుర్తుంచుకోగలం. మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్ తయారు చేసుకుంటే ఐడియాలను ఒకదానికి ఒకటి ఎలా అనుసంధానించాలో తెలుస్తుంది. ఈ వ్యూహం మెదడులో సృజనాత్మకత, లాజికల్ విభాగాలను ఒకదానితో ఒకటి కలిసి పనిచేసేలా చేస్తుంది. తద్వారా క్లిష్టమైన పనుల మీద సులభంగా ఏకాగ్రత చూపగలం.
• వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శారీరకంగా ఉత్సా హంగా ఉండటం కాగ్నిటివ్ పనితీరును యాక్టివ్గా ఉంచుతుంది. చదువు బ్రేక్లో చేసే చిన్న చిన్న వ్యాయామాలైన నడక, స్ట్రెచింగ్ వంటివి సానుకూల ప్రభావం చూపగలవు. నెమ్మదిగా పోకస్ పెరుగేం దుకు శారీరక కసరత్తు చక్కని మార్గం.
• సంగీతం: ప్రశాంతమైన, మంద్రమైన సంగీతం వినడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. సాహిత్యం లేకుండా వినే సంగీతం బ్రెయిను ఉత్తేజపరచడంలో తోడ్పడుతుంది. అందుకే అప్పుడ ప్పుడూ ఇలా వినొచ్చు.
• ఆహారం: సరైన పోషకాహారం సమయానుకూలంగా తినడం, శరీరానికి సరి పడా నీరు తీసుకోవడం కూడా ముఖ్యమే. అందులోనూ పరీక్షల సమయాల్లో ఆహారం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి.