Type Here to Get Search Results !

ఏపీ పాలిసెట్ 2025 - సత్వర ఉపాధికి పాలిటెక్నిక్ డిప్లొమా

 ఏపీ పాలిసెట్ 2025 - సత్వర ఉపాధికి పాలిటెక్నిక్ డిప్లొమా


» ఏపీ పాలిసెట్-2025 నోటిఫికేషన్ విడుదల

» పాలిసెట్ ర్యాంకుతో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం

» తక్షణమే ఉపాధి, ఉన్నత విద్య అవకాశాలకు మార్గం

పదో తరగతి నుంచే ఇంజనీరింగ్ కోర్సుల వైపు అడుగుపెట్టాలనుకునే వారికి సరైన వేదికలుగా పాలిటెక్నిక్స్ ను పేర్కొనొచ్చు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకుంటే.. ఉద్యోగ అవకాశాల తోపాటు ఈసెట్ ద్వారా నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. పాలిసెట్ (పాలిటెక్నిక్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)లో ర్యాంకు ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఏపీ పాలిసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. పాలిసెట్ పరీక్ష, అందుబాటులో ఉన్న కోర్సులు, ఈ డిప్లొమా కోర్సులతో ఉన్నత విద్య, ఉపాధి మార్గాలపై ప్రత్యేక కథనం.

ఏపీలో 279 పాలిటెక్నిక్స్

ఏపీ పాలిసెట్ ద్వారా ఏపీ సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలోని 88 ప్రభుత్వ, 191 ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో 30 బ్రాంచ్లలో డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. వీటిలో ప్రభుత్వ పాలిటెక్నిక్స్లో 18,141 సీట్లు, ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో దాదాపు 70 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిటెక్నిక్స్ లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి పాలిటెక్నిక్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను నిర్వహిస్తారు.

అర్హతలు

పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. 2025 లో పదోతరగతి పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

120 మార్కులకు పరీక్ష

ఏపీ పాలిసెట్ను మూడు సబ్జెక్ట్లలో 120 మా ర్కులకు ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తారు. మ్యాథ మెటిక్స్ (50 ప్రశ్నలు-50 మార్కులు), ఫిజిక్స్ (40 ప్రశ్నలు-40 మార్కులు), కెమిస్ట్రీ (30 ప్రశ్నలు-30 మార్కులు) నుంచి ప్రశ్నలు అడుగుతాడు. మొత్తం 120 ప్రశ్నలతో రెండు గంటల వ్యవ రిలో పరీక్ష జరుగుతుంది.

ఉమ్మడి కౌన్సెలింగ్ సీట్లు భర్తీ

పాలిసెట్ లో అర్హత ఆధారంగా ఉమ్మడి కౌన్సె లింగ్ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. సీట్ అలాట్ మెంట్ పొందిన విద్యార్థులు సంబంధిత పాలిటె క్నిక్ కళాశాలలో నిర్దేశిత తేదీలోగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

డిప్లొమా కోర్సులు ఇవే

సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రా నిక్స్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఇండస్ట్రీ ఇంటిగ్రేటె డ్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. 3-డి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, ఆపరెల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇంజనీరింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరం గ్, కెమికల్ ఇంజనీరింగ్ (ఆయిల్ టెక్నాలజీ), కెమి కల్ ఇంజనీరింగ్ (పెట్రో కెమికల్స్), కెమికల్ ఇంజ సీరింగ్ (ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్), కెమికల్ ఇంజి సిరింగ్ (షుగర్ టెక్నాలజీ), సెరామిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, లెదర్ ఆం డ్ గూడ్స్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెం టీషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూ రిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, ప్రిటింగ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, మైనింగ్ ఇంజనీరింగ్ తది తర కోర్సులు అందుబటులో ఉన్నాయి..

స్కాలర్షిప్ సదుపాయం

» పాలిసెట్ ర్యాంకుతో డిప్లొమా కోర్సుల్లో చేరిన వారికి స్కాలర్షిప్ సదుపాయం కూడా అందు బాటులో ఉంది.

» ఏఐసీటీఈ-ప్రగతి స్కాలర్షిప్ పేరుతో.. దేశ వ్యాప్తంగా అయిదు వేల మంది మహిళా విద్యా ర్థులకు సంవత్సరానికి రూ.50 వేలు చొప్పున, స్కాలర్షిప్ను అందిస్తారు.

» అదే విధంగా సాక్షమ్ స్కాలర్షిప్ పేరుతో దివ్యాంగ విద్యార్థులకు సంవత్సరానికి రూ.50 వేల స్కాలర్షిప్ లభిస్తుంది.

ఎంట్రెన్స్ టెస్ట్లో రాణించేలా

మ్యాథమెటిక్స్

» పదో తరగతి పాఠ్య పుస్తకాల్లోని ప్రతి చాప్టర్ను అధ్యయనం చేసి.. వాటికి సంబంధించిన ప్రాబ్ల మ్స్ ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యా వ్యవస్థ, బీజగ ణితం, నిరూపక రేఖాగణితం, పేపర్-2లో రేఖాగణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సంబా వ్యత, సాంఖ్యక శాస్త్రంపై పట్టు సాధించడం ఎం తో మేలు చేస్తుంది. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే రివి జన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది.

» పాఠ్యపుస్తకంలో ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. గ్రాప్లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధా నాలు కనుగొనేందుకు ప్రాక్టీస్కు ఎక్కువ ప్రాదాన్యం ఇవ్వాలి. వాస్తవ సంఖ్యలు, సమి తులు, బహుపదులు, రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అధ్యాయాలలోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు, సంభావ్యత, సాం ఖ్యక శాస్త్రం, త్రికోణమితి, క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలపై పట్టు సాధించాలి.

ఫిజిక్స్

ఈ సబ్జెక్ట్కు సంబంధించి ప్రయోగాలు-క్షేత్ర పర్యటనలు, సమాచార నైపుణ్యాలు -ప్రాజెక్ట్ పనులు, పటాలు-వాటి ద్వారా భావ ప్రసారం వంటి వాటిపైనా కృషి చేయాలి. కాంతి పరావ ర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్ సమ్మేళనాలపై కొంత ఎక్కువ శ్రద్ధతో చదవాలి. అదే విధంగా మూలకాల ధర్మాలు-వర్గీకరణ, రసాయన సమీకరణాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.

కెమిస్ట్రీ

అమ్లాలు-క్షారాలు, లవణాలు, పరమాణు నిర్మాణం, పి-బ్లాక్ ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్, మూలకాల వర్గీకరణ, అయోనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రోనెగెటివిటీ, మెటాలిక్, నాన్-మెటా లీక్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్, ప్రిన్సిపుల్స్ ఆఫ్ మెటలర్జీ, కార్బన్ కాంపౌండ్స్ తదితర ముఖ్యమైన యూనిట్లలోని అన్ని అంశాలను అధ్యయనం చేయాలి..

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2025, ১৩ 15

» పాలిసెట్ పరీక్ష తేదీ: 2025, ఏప్రిల్ 30 (ఉదయం 11 నుంచి 1 వరకు)

» ఫలితాల వెల్లడి: 2025, మే 10

» పూర్తి వివరాలకు వెబ్సైట్: https://polycetap.nic.in/BROCHURE.pdf

తెలంగాణ పాలిసెట్ - 2025

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ఇంజనీరిం గ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అందించే డిప్లొమా కోర్సులు, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అందించే డిప్లొమా కోర్సులు, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ అందించే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది.

» అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. 2025లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యా ర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దర ఖాస్తు చేసుకోవాలి.

» ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.04.2025.

» రూ.100 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది21.04.2025.

» రూ.300 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 23.04.2025.

» ప్రవేశ పరీక్ష తేది: 13.05,2025.

» వెబ్ సైట్: https://polycet.sbtet.telangana.gov.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area