Type Here to Get Search Results !

మేటి వర్సిటీల్లోకి... సీయూఈటీ దారి!

 మేటి వర్సిటీల్లోకి... సీయూఈటీ దారి!


దేశంలోని పేరున్న విద్యాసంస్థల్లో సెంట్రల్ యూనివర్సిటీలు ముఖ్యమైనవి. రాష్ట్ర స్థాయి సంస్థలతో పోలిస్తే ఇవెంతో మెరుగైనవి, విశిష్టమైనవి. చెప్పుకోదగ్గ సంఖ్యలో యూజీ కోర్సులూ అందిం చడం వీటి ప్రత్యేకత. దేశవ్యాప్తంగా ఉన్న 47 కేంద్రీయ విద్యా సంస్థల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ, ఇంటి గ్రేటెడ్ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, బీబీఏ, బీటెక్.. ఇలా ఎన్నో కోర్సులు ఇంటర్ విద్యార్హతతో అందిస్తున్నారు. వీటిలో ప్రవేశానికి ఎన్డీఏ నిర్వహించే సీయూఈటీ - యూజీ రాయాలి. ఇటీవలే ప్రకటన వెలువడింది.

కేంద్రియ విశ్వవిద్యాలయాలతోపాటు స్టేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ సంస్థలు, ప్రైవేటు యూనివర్సిటీలు, మరికొన్ని ప్రభుత్వ సంస్థలు అందించే.. యూజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఎన్టీఏ నిర్వహించే కామన్ యూనివర్సిటీ వర్సిటీ ఎంట్రన్స్ టెస్టు యూజీ (సీయూ ఈటీ) స్కోరు ఆధారం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఈఎస్ఎల్ యూనివర్సిటీ, జేఎన్ యూ, దిల్లీ యూనివర్సిటీ.. ఇలా మేటి సంస్థల్లో ప్రవేశాలకు ఈ స్కోరే ప్రామాణికం. సెంట్రల్ యూనివర్సిటీల్లో అవకాశమొచ్చినవా రికి మేటి బోధన, వసతి, ఇతర సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలూ, డీమ్డ్ సంస్థలూ ఈ స్కోరుతో సీట్లు కేటాయిస్తున్నాయి.

పరీక్ష ఇలా...

కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో వస్తాయి. తెలు గుతో సహా 13 భాషల్లో కోరిన మాధ్యమాన్నీ ఎంచుకోవచ్చు. 37 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహి స్తున్నారు. ఇందులో 13 లాంగ్వేజ్లు, 23 డొమైన్ స్పెసిఫిక్, ఒకటి జనరల్ ఆప్టిట్యూడ్ టెస్టు. వీటిలో అభ్యర్థులు గరిష్టంగా 5 టెస్టు పేపర్లు ఎంచుకోవచ్చు. ఏ కోర్సుల్లో చేరాలో నిర్ణయించుకుని, వాటికి సంబందించిన సబ్జె క్టుల్లో పరీక్ష రాయడమే మేలు.

సంస్థలు, కోర్సుల వారీ అర్హతలు, రాయాల్సిన పేపర్లు వెబ్సైట్లో ఉంచారు. ఇంటిగ్రే టెడ్ పీజీ ముఖ్యంగా సైన్స్ కోర్సుల కోసం నిర్దేశిత సబ్జెక్టుల నుంచి ఏవైనా 3 ఎంచుకో వాలి. ఏదో ఒక లాంగ్వేజ్ తప్పనిసరి. బీబీఏ, బీబీఎం లాంటి జనరల్ కోర్సులకు జనరల్ ఆప్టిట్యూడ్ టెస్టు రాస్తే సరిపోతుంది. ఇంగ్లిష్ లాంగ్వేజీలోనూ అర్హత పొందాలి. ఒక్కో టెస్టు పేపరూ 250 మార్కులకు ఉంటుంది. ప్రతి టెస్టు పేపర్ లోనూ 50 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన జవాబుకు 5 మార్కులు తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. ఒక్కో టెస్టు పేపర్ వ్యవధి గంట.

ప్రశ్నలు ఏ ఏ అంశాల్లో?

లాంగ్వేజ్లు: ఇందులో రీడింగ్ కాంప్ర హెన్షన్, లిటరరీ ఆప్టిట్యూడ్, ఒకాబ్యు లరీ ప్రశ్నలు ఉంటాయి. 

డొమైన్ సబ్జెక్టులు: ప్లస్/ఇంటర్లోని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. మ్యాథ్స్, పిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువా లజీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ. ఇలా 23 సబ్జెక్టులు ఉన్నాయి. వీటిలో అవసరమైనవి ఎంపిక చేసుకుని పరీక్ష రాసుకోవాలి. సబ్జెక్టు ప్రశ్నలన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే అడుగుతారు.

జనరల్ ఆప్టిట్యూడ్: జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబి లిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటీ టివ్ రీజనింగ్ (గణితంలోని ప్రాధమి కాంశాల అనువర్తనంపై ప్రశ్నలు ఆరిద్ మెటిక్/ ఆల్జీబ్రా/జామెట్రీ/ మెన్సురే షన్/ స్టాటిస్టిక్స్ విభాగాల్లో), లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ నుంచి అడుగుతారు.

సన్నద్ధత:

• సబ్జెక్టుల వారీ సిలబస్ వివరాలు వెబ్ సైట్లో పొందుపరిచారు. వాటిని గమనించాలి.

• సిలబస్లో పేర్కొన్న అంశాల ప్రకారం ఇంటర్మీడియట్/ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్త కాలు శ్రద్ధగా అధ్యయనం చేయాలి. పాఠాలు/ చాప్టర్ల వారీ చివరలో ఉన్న ముఖ్యాంశాలను బాగా చదవాలి.

• గతంలో నిర్వహించిన సీయూఈటీ-యూజీ ప్రశ్నపత్రాలన్నీ గమనించాలి. ప్రశ్నల తీరు, స్థాయి పరిశీలించాలి. ఏ అంశాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారో గ్రహించి, వాటిని బాగా చదవాలి.

• ప్రతి సబ్జెక్టులోనూ ఛాప్టర్ల వారీ వీలై నన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.

• పరీక్షకు ముందు కనీసం ఐదు నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేసి, ఫలితాలను విశ్లేషించుకుని, వెనుకబడిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.

• రుణాత్మక మార్కులు ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం తెలియని ప్రశ్నలను వదిలేయడమే మేలు.

తెలుగు రాష్ట్రాల్లో...

ఇంటిగ్రేటెడ్ విధానంలో ఐదేళ్ల ఎంఏ, ఎమ్మెస్సీ కోర్సులను పలు విభాగాల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అందిస్తున్నారు.

ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు: మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, అప్లయిడ్ జియాలజీ

ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు (హ్యుమానిటీస్): తెలుగు, హిందీ, లాంగ్వేజ్ సైన్సెస్, ఉర్దూ.

ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్పులు (సోషల్ సైన్సెస్): ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ.

• సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో బీఏ ఇంగ్లిష్, బీఏ ఎకనామిక్స్ చదువుకోవచ్చు.

• ఏపీ ట్రైబల్ యూనివర్సిటీలో బీఎస్సీ, బీబీఏ, బీకాం కోర్సులు అందిస్తున్నారు. 

• ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో బీఏ, బీఎస్సీ, బీకాంతోపాటు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సూ ఉంది.

• ఈఎఫ్ఎల్ యూనివర్సిటీలో బీఏ ఇంగ్లిష్, డిజిటల్ కమ్యూ నికేషన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, హిందీ, అర బిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, పర్షియన్, రష్యన్, స్పానిస్ కోర్సులు అందిస్తున్నారు.

ముఖ్య వివరాలు:

అర్హత: ఇంటర్మీడియట్/ప్లస్ 2. (సంస్థలు, కోర్సుల ప్రకారం.. ఇంటర్ గ్రూపు, మార్కులు శాతంలో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి) 

ఆన్లైన్ దరఖాస్తు గడువు: మార్చి 22. పరీక్షలు: మే 8 నుంచి జూన్ 1 వరకు దరఖాస్తు 

ఫీజు: జనరల్ (యూఆర్) 3 సబ్జెక్టులకు రూ. 1000, అదనంగా ఒక్కో పేపర్ కూ రూ.400, ఓబీసీ ఎన్ సీఎల్, ఈడబ్ల్యుఎస్ 3 సబ్జెక్టులకు రూ. 900, ఒక్కో అదనపు పేపరకూ రూ.375, ఎస్సీ, ఎస్టీ, దివ్యాం గులు, థర్డ్ జండర్ 3 సబ్జెక్టులకు రూ.800, అదనంగా ఒక్కో పేపరకూ రూ.350. 

వెబ్ సైట్: https://cuet.nta.nic.in/

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area