Type Here to Get Search Results !

డిగ్రీతో... అసిస్టెంట్ కమాండెంట్..!

 డిగ్రీతో... అసిస్టెంట్ కమాండెంట్..!



అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగానికి ఎంపి అకైనవారు. అంతర్గత భద్రత ప్రధాన లక్ష్యంగా సాయుధ బలగాలైన.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు (బీఎస్ఎఫ్). సెంట్రల్ రిజ ర్వ్డ్ పోలీస్ పోర్సు (సీఆర్పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు (ఐటీ బీపీ), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)లో విధులు నిర్వహిస్తారు. వీరికి గ్రూప్-ఎ గెజి టెడ్ ఆఫీసర్ హోదా దక్కుతుంది. పాతికేళ్ల లోపు వయసున్న గ్రాడ్యుయేట్లంతా పోటీపడ వచ్చు. మహిళలకు అవకాశం ఉంది.

లెవెల్-10 రూ.56,100 మూలవేతనం, డీఏ, హెచ్ఎన్ఏ, అలవెన్సులతో మొదటి నెల నుంచే రూ.లక్ష కంటే ఎక్కువ జీతం పొంద వచ్చు. పదోన్నతులతోపాటు పనిచేస్తున్న విభాగానికి ప్రధానాధికారీ కావచ్చు.

పరీక్ష ఎలా ఉంటుంది?

మొత్తం రెండు పేపర్లు. పేపర్-1కు 250 మార్కులు. వ్యవధి 2 గంటలు, జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ 125 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి జవా బుకూ మూడో వంతు మార్కులు తగ్గిస్తారు. పేపర్-2 డిస్క్రిప్టివ్. దీనికి 200 మార్కులు. వ్యవధి 3 గంటలు, ఇందులో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో అర్హత సాధిస్తేనే. పేపర్-2 మూల్యాంకనం చేస్తారు. పేపర్-2లో కనీసం 25 శాతం అంటే 50 మార్కులు పొందాలి. ఇలా అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం కొంత మందిని ఎంపిక చేసి, ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు.

ఫిజికల్ టెస్టులు

పురుషులకు.. 165 సెం.మీ. ఎత్తు, 50 కి.గ్రా. బరువు, 81 సెం.మీ. చాతీ విస్తీర్ణం ఉండాలి. ఊపిరి పీల్చిన తర్వాత 5 సెం.మీ. పెరగాలి. మహిళలు 157 సెం.మీ. ఎత్తు, 46 కి.గ్రా. బరువు తప్పనిసరి. వంద మీటర్ల దూరాన్ని పురుషులు 16, మహిళలు 18 సెకన్లలో పూర్తిచేయాలి. అనంతరం 800 మీటర్ల దూరాన్ని పురుషులు 3 నిమిషాల 45 సెకన్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకన్లలో చేరుకోవాలి.. లాంగ్ జంప్ లో.. మూడు ప్రయత్నాల్లో.. పురుషులు కనీసం ఒకసారి 3.5 మీటర్లు, మహిళలు 3 మీటర్లు దూరం దూకాలి. షాట్పుట్లో 7.26.గ్రా. దిమ్మను పురుషులు మూడు ప్రయత్నాల్లో ఒకసా రైనా 4.5 మీటర్ల దూరానికి విసరాలి. మహిళలకు దీన్ని మినహాయించారు. ఫిజికల్ టెస్టుల్లో అర్హత పొందితే చాలు. మార్కులు లేవు.

ఇంటర్వ్యూ

ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించినవారికి మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో విజయవంతమైతే మౌఖిక పరీక్ష ఉంటుంది. దీనికి 150 మార్కులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధిం చిన మార్కుల మెరిట్, రిజ ర్వేషన్లు అనుసరించి, తుది నియామకాలు ఉంటాయి. గత కటాప్ ప్రకారం పరీక్ష, ఇంటర్వ్యూల్లో 330 మార్కులు పొందిన జనరల్ అభ్యర్ధులు ఉద్యోగం పొందుతున్నారు.

ప్రశ్నలిలా...

పేపర్ 1: ఆరు అంశాల్లో అభ్యర్థి సమర్థ తను పరీక్షిస్తారు. మెంటల్ ఎబిలిటీలో.. రీజ నింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (న్యూమరి కల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్) ప్రశ్నలు వస్తాయి. జనరల్ సైన్స్ .. దైనందిన జీవి తంతో ముడిపడే ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఐటీ, బయోటెక్నాలజీ, పర్యావరణం అంశాలకు ప్రాధాన్యం. వర్తమాన సంఘట నలు విభాగంలో.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న వివిధ అంశాలను చదవాలి. నాగరికత, కళలు, సాహిత్యం, క్రీడలు, పాలనా విభాగాలు, వర్తకం, పరిశ్రమలు, ప్రపంచీకరణ మొదలైన వాటికి ప్రాధాన్యం. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీలో.. దేశ రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, సామాజిక వ్యవస్థ, ప్రజా పరిపా లన భారత ఆర్ధిక పురోగతి, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా సమస్యలు; మానవ హక్కులు, వాటి సూచికలు మొదలైన వాటిపై ప్రశ్నలు వస్తాయి. భారత దేశ చరిత్ర విభాగం నుంచి, సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాలతో ముడిపడే అంశాలను ప్రశ్నిస్తారు. అలాగే జాతీయవాదం, స్వాతంత్ర్యోద్యమం సంఘటలకు సంబంధించిన ప్రశ్నలూ అడుగు తారు, భూగోళశాస్త్రంలో.. భౌతిక, సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన జాతీయ, ప్రపంచ సంఘటనలకు ప్రాధాన్యముంది.

పేపర్ 2: ఇందులో రెండు భాగాలు. పార్ట్-ఏలో వ్యాసాలపై ప్రశ్నలు వస్తాయి. వీటికి 80 మార్కులు, ఇంగ్లిష్ లేదా హిందీలో సమాధానం రాయాలి. ఇందులో భాగంగా ఆధునిక భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్యోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, భద్రత, మానవ హక్కుల సంఘటనలు, అన లిటికల్ ఎబిలిటీ మొదలైన ప్రశ్నలు వస్తాయి. పార్ట్-బీలో అభ్యర్థి ఆంగ్ల నైపుణ్యా లను పరీక్షిస్తారు. కాంప్రహెన్షన్, ప్రెస్సీ లాంగ్వేజ్ స్కిల్స్ నుంచి 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఆంగ్లంలోనే జవాబులు రాయాలి.

సన్నద్ధత మెలకువలు

• సిలబస్ వివరాలు సమగ్రంగా పరిశీ లించి, ఆ అంశాలనే బాగా అధ్యయనం చేయాలి. 

• ప్రాథమికాంశాలతో అధ్య యనం ప్రారంభించాలి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ కోసం ఎన్సీఈఆర్ టీ 8 నుంచి 12 తరగతుల్లోని ముఖ్యాంశాలను బాగా చదవాలి. 

• సీఏ పీఎస్(ఏసీ) పాత ప్రశ్నపత్రాలు యూపీ ఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని శ్రద్ధగా పరిశీలించాలి. ప్రశ్నల స్థాయి, అంశాలవారీ పరీక్షలో దక్కుతోన్న ప్రాధాన్యం గమనించి, అందుకు అనుగుణంగా సన్నద్ధతను మల చుకోవాలి. 

• వర్తమానాంశాల్లో అధిక మార్కులకు, పత్రికలు చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. గత ఏడాది ఆగస్టు నుంచి పరీక్ష ముందు వరకు జరిగిన ముఖ్య పరిణామాలపై దృష్టి సారించాలి. అవార్డులు, నియామకాలు, నివేదికలు, రచనలు, సంఘటనలు, వార్తల్లో వ్యక్తులు, భద్రతపరమైన అంశా లను బాగా చదవాలి. 

• జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ పేపర్ పూర్తిగా డిస్క్రిప్టివ్, అందువల్ల రాయడాన్ని ఆల వాటు చేసుకోవాలి. అలాగే బాగా రాయ డానికి సమకాలీన అంశాలపై పట్టు పెంచుకోవడం ముఖ్యం. ఈ విభాగంలోని పలు ప్రశ్నలు తాజా పరిణామాల ఆధా రంగా వస్తున్నాయి. అందువల్ల పత్రికల్లో వచ్చిన నిపుణుల అభిప్రాయాలు, గుర్తింపు పొందిన సంస్థల నివేదికలు బాగా చద వాలి. 

• సివిల్స్ ప్రిలిమ్స్, సీడీఎస్ఈ గత ప్రశ్నపత్రాలూ అధ్యయనంలో ఉప యోగపడతాయి. 

• పరీక్షకు ముందు కనీసం పది మాక్ టెస్టులు రాయాలి. వాటి ఫలితాలను సమీక్షించుకుని, సన్నద్ధతను మెరుగుపరచుకోవాలి. 

• పరుగు, లాంగ్ జంప్, షాట్పుట్ ల్లో అర్హత పొంద దానికి రోజూ కొద్ది సమయం సాధన చేస్తే సరిపోతుంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area