సీఐఎస్ఎఫ్ పోలీస్ అవుతారా...?
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూ రిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)... 1161 కానిస్టేబుల్/ ట్రేడ్స్ మెన్ పోస్టులను భర్తీచేయనుంది. తాత్కాలిక ప్రాతిపదికన ఎంపిక చేసినప్పటికీ శాశ్వత విధులకూ అవకాశం ఉంటుంది.
మొత్తం ఉద్యోగాల్లో పురుషులకు 945, మహిళలకు 103, మాజీ సైనికోద్యోగులకు 113 కేటాయించారు.
ఖాళీలు: కానిస్టేబుల్/కుక్-493, కోబ్లర్-9, టైలర్-23, బార్బర్-199, వాషర్ మ్యాన్-262, స్వీపర్-152, పెయింటర్-2, కార్పెంటర్-9, ఎలక్ట్రిషియన్-4, మాలి-4, వెల్డర్-1, ఛార్జ్ మెకానిక్-1, ఎంపీ అటెండెంట్-2 ఉన్నాయి.
అర్హతలు: స్కిల్డ్ కేటగిరీకి చెందిన పోస్టులకు (బార్బర్, బూట్మేకర్, కోబ్లర్, టైలర్, కుక్, కార్పెం టర్, మాలి, పెయింటర్, ఛార్జ్ మెకానిక్, వాషర్ మ్యాన్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, మోటర్ పంప్ అటెండెంట్)
మెట్రిక్యులేషన్/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఐఐటీ శిక్షణ పొందినవారికి ప్రాధాన్యమిస్తారు.
◾అనస్కిల్డ్ కేటగిరీకి చెందిన స్వీపర్ పోస్టుకు మెట్రిక్యులేషన్ పాసవ్వాలి.
ఫిజికల్ స్టాండర్డ్స్: అర్రిజర్వుడ్, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలకు చెందిన పురుష అభ్య ర్థుల ఎత్తు 170 సెం.మీ. ఉండాలి. ఛాతీ 80-85 నెం.మీ. (గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి).
◾ఎస్టీ పురుషుల ఎత్తు 162.5 సెం.మీ. ఛాతీ 76-81 సెం.మీ. (గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి).
మహిళలు: జనరల్ కేటగిరీకి చెందినవారు 157 సెం.మీ., ఎస్టీ మహిళలు 150 సెం.మీ. ఎత్తు ఉండాలి.
◾పురుషులు, మహిళలు వయసు, ఎత్తులకు తగిన బరువు ఉండాలి.
వయసు: 01.08.2025 నాటికి 23 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్ల సడ లింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు.
ఎంపిక:
ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్టి)/ పిజికల్ ఎఫిషి యెన్సీ టెస్ట్ (పీఈటీ)/ ద్రువపత్రాల పరిశీలన, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
◾రాత పరీక్షను ఏ విధానంలో నిర్వహించేదీ (ఓఎంఆర్/ సీబీటీ) తర్వాత తెలియజేస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది.
◾రాత పరీక్షలో జనరల్ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీలు 33 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్లో సాధించిన మార్కుల ఆధారంగా వైద్య పరీక్షకు ఎంపిక చేస్తారు.
వేతన శ్రేణి: 21,700-69,100.
◾ఒకరు ఒక్క దరఖాస్తు మాత్రమే పంపాలి. ఒకటికంటే ఎక్కువ పంపితే మొదటి దాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
◾విద్యార్హతలు, అనుభవాలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను పీఈటీ/ పీఎస్టి, ధ్రువపత్రాల పరిశీలన, ట్రేడ్ టెస్ట్ సమయంలో తీసుకెళ్లాలి. లేకపోతే తదుపరి దశకు ఎంపిక చేయరు.
◾పది శాతం ఖాళీలను మహిళా అభ్యర్థులతో భర్తీ చేయడానికి ప్రాధాన్యమిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.04.2025
వెబ్ సైట్: https://cisfrectt.cisf.gov.in
👁️🗨️ DOWNLOAD NOTIFICATION