Type Here to Get Search Results !

ఉపాధి పథం - చమురు క్షేత్రాలు కొలువుల నిక్షేపాలు

ఉపాధి పథం - చమురు క్షేత్రాలు కొలువుల నిక్షేపాలు



అగాధమౌ జలనిధిలోన ఆణిము త్యమున్నటులే...' అంటూ ఓ సినీ కవి ఆశావాద గీతాన్ని రాశారు. అలాగే అపారమైన జలరాశి దిగువన చమురు, సహజవాయు వులకు కొదవ లేదని వివిధ సర్వేలు వెల్లడించాయి. కావల సిందల్లా వాటిని వెలికి తీసే అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానం, దాన్ని వినియోగించి ఫలితాలు రాబట్టగల నిపుణులు.

భారత్లో ముడిచమురును శుద్ధి చేసే సామర్థ్యం గత పదేళ్లలో 215 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 258.8 మెట్రిక్ టన్ను లకు పెరగడం విశేషం, మనకున్న చమురు, సహజవాయువు నిక్షేపాలను వెలికితీస్తే శుద్ధి చేసి పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చే చమురు శుద్ధి కర్మాగారాలు (రిఫైనరీలు) ఉన్నాయి. ఇక టెక్నాలజీ, నైపుణ్యాలున్న సిబ్బంది ఉంటే మన దిగుమతులను మరింత తగ్గించి విదేశీ మారకద్రవ్యాన్ని మిగ ల్చగలం. అందుకే ఈ పరిశ్రమలోని ప్రభు త్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్స హిస్తోంది.

ప్రవేశించేదెలా...?

చమురు, సహజవాయువు పరిశ్రమలో ప్రవేశానికి చమురు అన్వేషణ (రిగ్గింగ్) నుంచి పెట్రోలియం ఉత్పత్తులను మార్కె ట్లో విక్రయించేంత వరకు ప్రతి దశలో చక్కటి అవకాశాలున్నాయి. ఆసక్తిగలవారు అర్హతలు, నైపుణ్యాలు మెరుగుపరచుకోవటమే కర్తవ్యం, ఆయిల్- గ్యాస్ రిఫైనరీలు, చమురు బావుల క్షేత్రాల నిర్వహణ సంస్థలు, ఎనర్జీ ఉత్పత్తిదారులు, వ్యర్థపదార్ధాల నిర్వ హణ సంస్థలు, పెయింట్, డయిస్ కంపె నీలు, ఆయిల్, గ్యాస్ కన్సల్టెన్సీలు ప్రస్తుతం నిపుణులైన ఉద్యోగుల కొరతను ఎదుర్కొం టున్నాయని గమనించాలి.

కనీస విద్యార్హతల సాధన:

చమురు, సహజవాయువు ఉత్పత్తి, శుద్ధి కార్యకలాపాల్లో ఉన్న కంపెనీల అవసరాలను తెలుసుకోవాలి. ఆ కంపెనీల్లో టెక్నికల్, జన రల్ పోస్టుల్లో నియామకానికి అభ్యర్ధుల నుంచి కనీసం విద్యార్హతలు ఏమేం ఆశిస్తు న్నారో గ్రహించాలి.

💥 టెక్నికల్ పోస్టులకు- అంటే నేరుగా రిగ్స్, రిఫైనరీల్లో పనిచేయాల్సిన పోస్టు లకు ఇంటర్మీడియట్తో పాటు ఏదైనా స్వల్పకాల సాంకేతికతలో ప్రాక్టికల్ శిక్షణ పొందినవారికి లేదా ఐ.టి.ఐ. కోర్సు ప్రత్యేక ట్రేడ్ చేసినవారికి అవకాశాలుంటాయి.

💥 టెక్నికల్ విభాగంలో ఉన్నత శ్రేణి ఉద్యోగాలు ఆశిస్తున్నవారు విధిగా టెక్ని కల్ డిగ్రీ చేయాలి. పెట్రోలియం ఇంజినీ రింగ్, కెమికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన యువతను. అయిల్, గ్యాస్ కంపెనీలు ట్రెయినీ ఎగ్జిక్యూటివ్ుగా నియమించు కుంటున్నాయి.

💥 చమురు అన్వేషణ, తవ్వకాల కంపెనీల్లో కొన్ని అరుదైన పోస్టులుంటాయి. జియో: సైంటిస్టుగా ఉద్యోగం కావాలంటే జియో సైన్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లాంటి కోర్సులు చదవాలి.

ఏ విద్యార్హత... ఏం చేయాలి...?

చమురు నిక్షేపాలను వెలికితీసే క్షేత్రాల్లో పనిచేసే వారు డ్రిల్లింగ్ యంత్రాలు, పంపులు, హౌజులు వంటి వాటి పై విధులు నిర్వర్తించాలి. వీరిని ఇండస్ట్రియల్ టెక్నాలజిస్టులంటారు.

💥 వివిధ రకాల సాదనాలు (టూల్స్) రూపకల్పనకు డిజైన్స్ టూల్స్ తయారుచేయడం, చమురు, సహజ వాయువు వెలికితీసే ప్రక్రియలో ఎదురయ్యే సాంకే తిర సమస్యలకు పరిష్కారం కనుగొనడం.. ఇంజినీ రింగ్ చేసినవారి విధులు.

💥 లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ విషయంలో పనిచేసేవారు చమురు, సహజవాయువు, ప్యాకేజింగ్ నుంచి సురక్షితంగా, వీలైనంత తక్కువ వ్యయంతో రవాణా చేసే కార్యకలాపాల్లో పాల్గొనాల్సివుంటుంది.

💥 భద్రతా ప్రమాణాల పర్యవేక్షణ విభాగంలో సువి శాల ఆయిల్ నిక్షేపాల క్షేత్రాల్లో పనిచేసే కార్మి కులూ, ఉద్యోగులూ కంపెనీ నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అని నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. కార్మికులకు అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాల్సి వుంటుంది.

💥 చమురు వెలికితీత కార్యక్షేత్రం, పాలనా కార్యాల యాల్లో సిబ్బందికి తోడ్పాటు అందించేందుకు సాఫ్ట్ వేర్లు తయారుచేసి నిర్వహించాలి. విస్తృతమైన వెలికితీత కార్యకలాపాలను సులభతరం చేసేం దుకూ, వెలికితీత ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకూ ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్లు రూపొందించాల్సిందే.

💥 చమురు, సహజవాయువు వెలికితీత ఒక మహా యజ్ఞం లాంటిది. ఈ ప్రక్రియలో వేల మంది కార్మి కులు, ఉద్యోగులు, అధికారులు పాలుపంచుకుం టారు. వీరందరినీ సమన్వయం చేయడం, సుహృ ద్భావ, సహకార పని సంస్కృతిని తీసుకురావడం మానవ వనరుల నిర్వహణ (హెచ్.ఆర్.) విభాగం బాధ్యత. ఇందుకు తగ్గ కార్యకలాపాలను రూపొం. దించాల్సింది ఈ నిపుణులే...

ఆసక్తి - నైపుణ్యాలు:

చమురు, సహజవాయువు కంపెనీల్లో వివిధ రకాల ఉద్యోగా వకాశాలుంటాయి. ఒక్కో ఉద్యోగ స్వరూపం ఒక్కోలా ఉంటుంది. కొన్ని రకాల పోస్టుల్లో భారీ యంత్రాల నిర్వహణ, బాగా శారీరక శ్రమతో కూడిన బాధ్యతలు నిర్వర్తించాలి. మరికొన్ని విభాగాల్లో చమురు, సహజవాయువు ఉత్పత్తిలో, మానవ వనరుల నిర్వహణలో విధులు ఉంటాయి. ఐ.టి. విభాగంలోనూ తగిన పొజిషన్లుంటాయి. ఉత్పత్తిని గమ్యస్థా నాలకు చేర్చడం, అమ్మకాలు, ప్రమోషన్, ఆదాయాలను పెంచేందుకు మార్కెటింగ్ సిద్ధం చేయాలి. ఏ విభాగానికి ఆ విభాగంలో పొజిషన్ కావాలంటే నేర్చుకోవాల్సిన నైపుణ్యాలపై దృష్టిపెట్టాలి.

ఆసక్తిగల రంగంలో ఏ పని చేయడానికి ఉత్సాహం ఉరకలు వేస్తోందో గమనించడం ముఖ్యం తనలో ఉన్న ఆసక్తిని గుర్తించడం ఉద్యోగార్థి విజయానికి మొదటి మెట్టు. దీన్ని దిగ్వి జయంగా అధిరోహిస్తే నైపు ణ్యాల పదును, కోర్సుల ఎంపికల తదుపరి దశకు చేరుకున్నట్టే!

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area