ఒత్తిడి వేధిస్తోందా...?
ఒత్తిడికి ప్రత్యేకించి ఒక్క కారణమేనంటూ ఉండదు. చదవాల్సిన పాఠాలు, చేయాల్సిన పనులు, కట్టాల్సిన ఫీజులు, రాయాల్సిన పరీక్షలు.. చేరాల్సిన కోర్సు.. ఇలా ప్రతి విషయమూ ఎంతో కొంత ఒత్తిడికి గురిచేస్తూనే ఉంటుంది. దీంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు విద్యార్థులు. దీన్నుంచి బయటపడాలంటే...
ముఖ్యంగా మార్కుల విష యంలో తోటి విద్యార్థులతో పోల్చుకోవడం వల్ల ఎక్కు వగా ఒత్తిడికి గురవుతుం టారు. దీనికి బదులుగా గత ఏడాదికంటే మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం మేలు.
• పూర్తిచేయాల్సిన పనులు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ ఒత్తిడిగా అనిపిస్తుంది. అందుకే చేయాల్సిన పనులన్నింటినీ ఒక చోట రాసుకోవాలి. వాటిలో నుంచి అత్యవ సరంగా పూర్తిచేయాల్సిన వాటిని ముందుగా ఎంచుకోవాలి. దాన్ని నిర్ణీత సమ యంలోగా చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుని.. ఆ గడువులోగానే ముగించాలి. ఆ తర్వాత అంతగా అత్యవసరంకాని పనులను చేసుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత చేసినా ఇబ్బందిలేదనిపించే వాటిని వాయిదా వేయొచ్చు.
• ప్రణాళిక లేకపోతే మనసంతా గందరగో ళంగా ఉంటుంది. అందుకే ప్రతి సబ్జెక్టుకూ నిర్ణీత సమయాన్ని కేటాయించుకుని టైమ్స్ బుల్ వేసుకోవాలి. దాన్ని కచ్చితంగా అమలుచే యడానికి ప్రయత్నించాలి.
• ఒత్తిడి నియంత్రణకు ఉచితంగా సూచ నలు, సలహాలు ఇచ్చే స్వచ్చంద సంస్థలు ఉన్నాయి. అవసరమైనప్పుడు వారి సేవలను వినియోగించుకోవచ్చు.
ఒత్తిడికి గురిచేస్తున్న సమస్య గురించి స్నేహి తులు, కుటుంబ సభ్యులు, అధ్యాపకులతో చెప్పుకో వచ్చు. దాంతో భారం తగ్గి మనసు తేలికపడుతుంది. వాళ్లు సూచించిన పరిష్కా రాల్లో ఆమోదయోగ్యమైన వాటిని పాటించవచ్చు.
• ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మన శరీరం కూడా మనకు తోడ్పడుతుంది. అదెలాగంటే... వ్యాయామం చేయడం వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఆందోళనను తగ్గించి మానసికానందాన్ని కలిగిస్తాయి.
• పోషకాహారం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పాలు, అరటి పండు, నిమ్మజాతి పండ్లు, ఆకుకూరలు, బాదం, వాల్నట్స్, డార్క్ చాక్లెట్లు.. తరచూ తీసుకుంటే ఆందోళన తగ్గుతుంది.
• ఎన్నో అడ్డంకులను, అవరోధాలను అధిగమించిన వ్యక్తుల విజయ గాథలను విన్నా.. చదివినా ప్రేరణ పొందొచ్చు. సాధారణంగా చిన్న విషయాలకే మనం ఆందోళన పడుతుంటాం. మనకంటే క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటకు వచ్చి కూడా కొందరు లక్ష్యాన్ని సాధిస్తారు. అలాంటివారి గురించి తెలుసుకుంటే లక్ష్యం ముందు ఇతర సమస్యలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి.