మన భవిత మన చేతుల్లోనే!
How to Get from Where You Are to Where You Want to Be
జాక్ క్యాన్ఫీల్డ్ రాసిన 'హౌ టు గెట్ ఫ్రమ్ వేర్ యూ ఆర్ టు వేర్ యూ వాంట్ టు బి' వ్యక్తిగత, వృత్తిపర మైన విజయాన్ని సాధించేందుకు మార్గదర్శకం. యువతకు ఎంతో ప్రేరణను అందిస్తుంది. ఈ పుస్తకం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు
మీ జీవితానికి 100% బాధ్యత:
మన విజయాన్నో, అపజయాన్నో ఇతరుల పై నెట్టివే యడం అభివృద్ధికి అడ్డుగోడ బాధ్యతను స్వీకరించడం వల్ల మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. మీ విద్యా ఫలితాలు ఆశించినట్టు లేకపోతే బోధన విధానాన్ని తప్పుపట్టకుండా, మీ చదువు అలవాట్లను మెరుగుపరిచే చర్యలు తీసుకోండి. కావాల్సిన ఉద్యోగాన్ని పొందలేక పోతే మార్కెట్ను తప్పుపట్టకుండా, మీ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు శ్రమించండి.
స్పష్టమైన విజన్:
మీరు ఏమి కావాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుసు కోవడం విజయానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. స్పష్టత లేకుంటే అవకాశాలు చేజారిపోతాయి. విద్యార్థిగా సాధించదలచుకున్న లక్ష్యాలను నిర్ధారించుకోండి- మంచి గ్రేడ్లు సాధించాలా? నచ్చిన ఆటలో రాణించాలా? అన్ని విషయాలపై సమానమైన ఆసక్తి ఉండాలా? తర్వాతి కాలంలో కెరియర్కు ఉపయోగపడే సబ్జెక్టు మీద మాత్రమే దృష్టి పెట్టాలా? కెరియర్ ప్రారంభదశలో ఉంటే- కార్పొరేట్ ఉద్యోగం పొందాలా? స్టార్ట్-అప్ ప్రారంభించాలా? మీరు ఏ రంగంలో స్థిరపడాలో స్పష్టంగా నిర్ణయించుకోండి.
SMART లక్ష్యాలు:
లక్ష్యాలు అనేవి స్పష్టంగా ఉండాలి. SMART (Specific - నిర్ధిష్ట. Measurable - కొలవదగిన, Achievable సాధించదగిన, Relevant - సంబంధిత, Time bound - నిర్ణీత సమయంలో పూర్తి చేయ దగిన) లక్ష్యాలను పెట్టుకుంటే స్పష్టత పెరుగుతుంది. నేను మంచి మార్కులు సాధించాలి' అనే సాధారణ లక్ష్యానికి బదులు 'రోజుకు రెండు గంటలు చదివి, ప్రతి వారంలో ఒకసారి ఆ పాఠాలను పునశ్చరణ చేస్తా' అనే విధంగా నిర్దేశించుకోండి. 'మంచి ఉద్యోగం పొందాలి' అనే సంకల్పానికి బదులు 'ప్రతి వారం కనీసం ఐదు ఉద్యోగాలకు దర ఖాస్తు చేసి, రెండు నెట్ వర్కింగ్ ఈవెంట్లలో పాల్గొంటా' అనే విధంగా ప్రణాళిక రూపొందించండి.
మీపై మీకు విశ్వాసం:
మీ సామర్ధ్యాలను నమ్మడం మీ ఎదుగుదలకు పునాది, ఏదైనా సాధించాలనుకుంటే, మీలో ఎలాంటి సందేహం ఉండకూడదు. ప్రతిరోజూ 'నేను సమర్థుడిని, విజయం సాధించగలను' అనే దృఢ సంకల్పంతో ఉండాలి. అనుకున్న విజయాన్ని సాధించేసినట్టుగా ఊహించుకోండి- (మీరు పట్టభద్రుడిగా డిగ్రీ అందుకుం టున్న దృశ్యం, మీరు కలలుగన్న ఉద్యోగం పొందిన
రోజూ కొత్త విషయం:
నిరంతర కృషి, చిన్నచిన్న చర్యల ద్వారానే పెద్ద మార్పులు సాధ్యమవుతాయి. ప్రతిరోజూ కనీసం ఓ కొత్త విషయం నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. ఉద్యోగా న్వేషణలో ఉంటే, రోజుకు కనీసం ఒక కొత్త నెట్వర్కింగ్ అవకాశం పొందేందుకు ప్రయత్నించండి.
భయం, అపజయాలు:
భయం మన విజయానికి అడ్డంకి. చాలా భయాలు మన ఊహా ప్రపంచంలో మాత్రమే ఉంటాయి. క్యాన్ఫీల్డ్ చెప్పే ప్రధాన సిద్ధాంతం- భయాన్ని ఎదుర్కొని ముందుకు సాగడమే. నలుగురిలో మాట్లాడాలంటే భయ ముంటే, మొదటగా స్నేహితుల ముందు ప్రాక్టీస్ చేయండి. ఏదైనా పనిలో తప్పినా, డీలా పడిపోకూడదు. మరింత మెరుగుపడాలని అనుకోవాలి. ప్రతి పరాజయం కొత్త అవకాశాలు నేర్పిస్తుంది.
సానుకూల వ్యక్తులు:
మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతారో వారి ప్రభావం మీపై ఉంటుంది. ప్రేరణను కలిగించే సాను కూల వ్యక్తులతో మెలగడం అభివృద్ధికి దారితీస్తుంది. సానుకూల దృక్పథం ఉన్న స్టడీ గ్రూపుల్లో చేరండి. ప్రతి కూల ఆలోచనలున్న వ్యక్తులను దూరంగా ఉంచండి.
అపజయం ఓ దశ:
అపజయాలను శాశ్వత ఓటమిగా భావించకుండా, పాఠాలుగా స్వీకరించండి. పరీక్షలో తక్కువ గ్రేడ్లు వస్తే, ఏం తప్పు చేశారో విశ్లేషించుకొని, కొత్త విధానాన్ని అవ లంబించండి. ఉద్యోగం రాకపోతే, ఫీడ్ బ్యాక్ తీసుకొని, మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి.
లక్ష్య సాధన దిశగా:
అదృష్టం కోసం వేచి ఉండకండి. కలలను నిజం చేసు కోవాలంటే, ఆచంచలంగా ముందుకు సాగాలి. లక్ష్యాల అమలుకు మరింత కృషి చేయండి. ప్రతికూల పరిస్థి తులు ఎదురైనా, ఆత్మనై ర్యంతో ముందుకు సాగండి.
ఈ పుస్తకం విద్యార్ధులకు, కెరియర్ తొలిదశలో ఉన్న యువతకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. బాధ్యత తీసుకోవడం, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవడం, ప్రతి రోజూ చర్యలు తీసుకోవడం, భయాన్ని అధిగమించడం వంటివి నెగ్గడానికి సహాయపడతాయి. ఈ పాఠాలను అనుసరించడం ద్వారా లక్ష్యాలను నిజం చేసుకోవచ్చు!