Type Here to Get Search Results !

లెటర్ ఆఫ్ రికమండేషన్ - విదేశాల్లో చదువుకు కీలకం.

 లెటర్ ఆఫ్ రికమండేషన్ - విదేశాల్లో చదువుకు కీలకం.



మంచోడని మన గురించి నలుగురూ చెప్పు కోవాలని అనుకోవడం సర్వ సాధారణం. సగటు మానవుడి సాధారణ కోర్కెగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధిం చిన ఆధునిక రూపమే లెటర్ ఆఫ్ రికమెండే షన్(ఎల్డీఓఆర్), ఇక్కడ కాన్సెప్ట్ మంచోడని కాదు, విదేశీ విద్యా సంస్థలో సీటుకు అర్హుడు అని సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అది తను చదువుకున్న సంస్థకు చెందిన ప్రొఫెసర్ల వంటి వారు అన్నమాట. మరీ ముఖ్యంగా విదే శాల్లో చదువుకోవాంటే అవసరమైన పత్రాల్లో ఇది కీలకమైనది అని కూడా చెప్ప వచ్చు.

విదేశాల్లో చదవాలని భావించే అభ్యర్థి కేరెక్టర్. డెడికేషన్, అకడమిక్ ఆప్టిట్యూడికి సంబంధించి విలు వైన విషయాలను ఈ లెటర్ తెలియజేస్తుంది. కాలేజీ ప్రొఫెనర్లు, ఎంప్లాయర్లు మెంటార్లు, విభాగాధి పతులు ఇచ్చే ఈ బెటర్లతో అభ్యర్థి క్రెడిబిలిటీ పెరుగు తుంది, పోటీతత్వం కూడా తెలుస్తుంది. స్టక్చర్డ్ ఫార్మే టేకు తోడు సరైన ఉదాహరణలతో ఉండే లెటర్ ఒక వ్యక్తి స్థిరత్వం తదితరాలను తెలియజేస్తుంది. ఆకడ మిక్ కెరీర్లో అభ్యర్థి సాదించిన గ్రేడ్స్, క్రెడిట్కు మించిన విషయాలు ఈ లెటర్లోనే వెల్లడి అవుతా యని కూడా చెప్పవచ్చు. కోరుకున్న కోర్సులో సీటు లభించేందుకు తోడ్పడుతుంది. అభ్యర్థికి ఉన్న విశ్వసనీయత, పోటీతత్వాన్ని పెంచడం ద్వారా సీటు పొందడా నికి ఉన్న అవకాశాలు పెరుగుతాయి. పొందికగా తీర్చి దిద్దిన లెటర్ ఆఫ్ రికమండేషన్ నిజానికి విదేశాల్లో చదవాలని ఆకాంక్షించే అభ్యర్ధి లక్ష్యసాధనలో ఇతోది కంగా తోడ్పడుతుంది.

ఎవరితో... ఎందుకు:

లెటర్ ఆఫ్ రికమండేషన్ను ఎవరితో రాయించుకో వాలి అన్నది ఒక ప్రశ్న. వివిధ వర్గాల ద్వారా సమీక రించిన సమాచారాన్ని మదించుకుని మరీ ఆ వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి. అలా సిఫార్చు చేయించుకోదగ వ్యక్తుల్లో ప్రొఫెసర్ల నుంచి డిపార్ట్మెంట్ హెడ్ లేదా డీన్, ఉద్యోగం చేసి ఉంటే ఎంప్లాయర్, పరిశోధన, పర్యవేక్షకుల. వరకు అందమా వస్తారు. మెంటార్టు కోచ్లు, గైడెన్స్, కౌన్సెలర్లను కూడా పరిగణన లోకి తీసుకోవచ్చు. అభ్యర్థి నాయకత్వ పటిమ, టీమ్ వర్క్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్చనల్ డెవ లవ్ మెంట్స్ సంబందించిన విషయాలను విస్తారంగా, విపులంగా, వివరంగా వీరు మాత్రమే ప్రస్తావించగలుగుతారు.

అకడమిక్, నాన్ అకడమిక్ అంశాల సమ్మిళితంగా ఉన్న రికమండేషన్ లెటర్, అభ్యర్థికి ఉన్న సామర్ధ్యాలను సమగ్రంగా తెలియజేయగలుగుతుంది. రక మండ్ చేసే ప్రతి వ్యక్తి తనదైన కోణంలో అభ్యర్థి సదరు కోర్సు చేసేందుకు ఎలా, ఎందుకు అర్హుడో తెలి యజేస్తారు లెటర్ మాత్రం వ్యక్తిని ఉద్దేశించి అంటే పర్చనలైజ్డ్ వ్యవహారంగా ఉన్నప్పుడు మాత్రమే పోటీలో ఎల్కఆర్ యూనిక్గా కనిపిస్తుంది. చివరగా అది అభ్యర్థిత్వానికి ఒక విద్యాసంస్థ ఓకే చెప్పడానికి బలమైన ప్రాతిపదికగానూ మారుతుంది.

కరెక్ట్ ఫార్మేట్:

ఈ లెటర్ కు సంబంధించినంతవరకు కోర్ ఎలి మెంట్ అంతా ఒక్కటే ఒక అభ్యర్థి సీటు పొందేందుకు అవసరమైన సిఫార్పు అందులో ఉంటుంది. అయితే కోర్సును బట్టి చిన్నపాటి మార్పులు లెటర్ రాసే తీరులో ఉంటుందని గమనించాలి. ఫార్మేట్, సిఫార్సు చేసే వ్యక్తి అందుకునే వ్యక్తి కాంటాక్ట్ సమాచారం తదితరాలు యథాతథం. లెటర్ను ఉద్దేశించిన వ్యక్తిని గౌరవప్రదంగా సంబోధించడం సహా సాధారణ విష యాలకు తోడు అందులోని కంటెంట్ అభ్యర్థితో తనకు ఉన్న సంబంధాన్ని తెలియజేయాలి. తనకు ఎంత. కాలం నుంచి తెలుసు. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకరకంగా అభ్యర్థి వ్యక్తిగత విష యాలకు సంబంధించి తనది భరోసా అన్న విధంగా ఉండాలి.

లెటర్ బాడీలో అభ్యర్తి అర్హతలు, సాధించిన విజయాలు, సంబం ఛీత అనుభవం, కోర్సులో చేర్చుకునేందుకు అర్హుడు. అంటూ తెలియజేసే ఉదా హరణలు ఉండాలి. ఇదంతా చదివితే అభ్య కి ఉన్న బలాలు, నైపు ణ్యాలు, కేరక్టర్ తెలియ డమే కాదు. ఎంపిక చేసేందుకు దోహదప డాలి. అభ్యర్థి విశ్వసనీయ తను పెంచాలి. అలాగే లెటర్ చివరి పేరాలో ముందు చెప్పిన అంశాలను క్రోడీకరించాలి. ఇంకేమైనా సమాచారం అవసరమైతే అది కూడా అందిం చేందుకు తాను సిద్ధమని కూడా తెలియజేయాలి.. లెటర్ రాసిన వ్యక్తి సంతకం, కాంటాక్ట్ సమాచారం చివర్లో ఉండాలి. ప్రొఫెషనల్ సైన్-త్తో మొత్తం పద్ధతిగా ఉండాలి.

ఈ ఆరూ ముఖ్యం:

• లెటర్ ఆఫ్ రికమండేషన్స్ ఎన్ని సమర్పించిన ప్పటికీ అవి అభ్యర్థిలో ఉండే వివిధ కోణాలను చెప్పగలగాలి. విజయాలు, సర్సనాలిటీఆరథమిక్ లేదా ఎక్స్ ట్రా కరెడ్యుల్ సక్సెస్ను తెలియజేయగలగాలి ఉదాహరణకు పరిశోధన వైపుణ్యాలు ఒక లెటర్ ఉంటే మరొక దానిలో తరగతి గదిలో అభ్యర్థి కనబరిచిన సామర్థ్యాలను తెలియజేయాలి.

• రికమండ్ చేసే వ్యక్తికి మీరు తెలిసినప్పటికి సంబంధిత బేసిక్ సమాచారాన్ని అభ్యర్ధి అందించాలి. దీనీ అకడమిక్ జీపీఎలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, లెటర్ సబ్మిషన్ కు డెడ్ లైన్ తదితరాలు తెలియజేయాలి. అప్పుడే సదరు రికమెండర్ తన సిపార్సును చక్కగా డ్రాఫ్ట్ చేయగలరు

• ఆ లెటర్ ప్రత్యేకించి కొన్ని సందర్భాలు, ఉపాఖ్యానాలు కూడా ఉండాలి. అభ్యర్థి లక్షణాలకు తెలియజేసే విధంగా అవి ఉండాలి. లక్షణాలు, వైపుణ్యాలు తదితరాలను కేవలం ధ్రువీకరణలతో సరిపెట్టకూడదు. వాటికి సరైన ఉదాహరణలనూ జోడించాలి రీసెర్చ్ ప్రాజెక్టుల్లో అనుభవాలు లేదంటే చోటుచేసుకున్న దర్శలను కూడా కలిపితే అభ్యర్థి క్రెడిబిలిటీ పెరుగుతుంది..

• ఈ లెటర్లో అభ్యర్థికి సంబంధించిన బలాలకు తోడు అకడమిక్ ప్రోగ్రెస్, డెవలప్ మెంట్ తగు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ అంశాల్లో, ఖచ్చితత్వాన్ని అడ్మిషన్ కమిటీ ఎవాల్యుయేట్ చేస్తుంది. బలహీనతలను ఎలా అధిగమిస్తారన్నది కూడా చూస్తుంది.

• లెటర్ డ్రాఫ్టింగ్లో సమతుల్యత పాటించాలి. అస్సలు ఏమీ లేకపోవడం లేదంటే పెద్ద ఎత్తున విషయాలను కుమ్మరించడం. రెండూ పనికిరావు ప్రొఫెథనల్ అయినప్పటికీ పర్సనలైజ్డ్ సిపార్డులకు అడ్మిషన్ కమిటీ ప్రాదాన్యం ఇస్తుంది. అందుకని ప్రతి లెటర్ దేనికది యూనిక్ గా ఉండాలి. బేసిక్ ఫార్మాట్ నుంచి ఎపుడు తప్పకుండానే కుబెంట్ తదితర విషయాల్లో తగు జాగురూకత పాఠించాలి . మొత్తమ్మీద బ్యాలెన్స్ తప్పకుండాచూసుకోవాలి.

• ప్లగారిజాన్ని తప్పించాలి. మరొక లెటర్కు కాపీ కారాదు. ఒరిజినల్ అనిపించాలి. కాపీని సులువుగా పట్టేస్తారు. ముందునుంచీ చెబుతున్నట్లు లెటర్ ఒరిజినల్గా ఉండేలా రూపొందాలి. అభ్యర్థిని తీసుకునేలా ఉండాలే తప్ప ఒక డూప్లికేట్ మాదిరిగా అనిపించి అసలుకే మోసం తెచ్చేలా ఉండకూడదు. అంటే కాపీ, ఫేస్ట్ పని మంచిది కాదని గుర్తించాలి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area