SBI ఫెలోషిప్ ప్రోగ్రామ్.
డిగ్రీ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్.ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 12వ బ్యాచ్ యూత్ ఫర్ ఇండియ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు బ్యాంకు రూ.70 వేల వరకు అందిస్తుంది. అయితే ఈ ప్రోగ్రామ్ కోసం ఆసక్తి గల అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, వయసు పరిమితి ఎంత వంటి వివరాలను ఇక్కడ చూద్దాం.
గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత: దీని కోసం అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయే షన్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో అర్హత ఉన్న అభ్యర్థులకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. వీటి కోసం ఆన్ లైన్ లో అధికారిక వెబ్సైట్ https://www.youthforindia.org.
ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలిచి ఫైనల్ చేస్తారు. ఆ క్రమంలో అభ్యర్థులు తర్వాత ఆఫర్ లెటర్ ను అందుకుంటారు. ఆ తర్వాత ఫెలోషిప్ కార్యక్రమం ప్రారంభమవుతుంది.