భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) లో 37 మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
జార్ఖండ్లోని కోల్ ఇండియా లిమిటెడ్ కు చెందిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్(బీసీసీఎల్) మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 37
» విభాగాలు: సర్జన్, జనరల్ ఫిజిషియన్, గైనకాల జిస్ట్ అండ్ అబ్ స్ట్రెటీషియన్, ఆర్థోపెడిషియన్, పీడియాట్రిషియన్, సైకియాట్రిస్ట్, పాథాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, పల్మాలజిస్ట్ / చెస్ట్ స్పెషలిస్ట్, ఆప్తా ల్మాలజిస్ట్, ఎమర్జెన్సీ మెడిసిన్, రేడియాలజిస్ట్,
» అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు 42 ఏళ్లు, మెడికల్ స్పెషలిస్ట్/సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
» వేతనం:
• సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టుకు రూ. 70,000 రూ. 2,00,000,
• మెడికల్ స్పెషలిస్ట్/సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు రూ. 60,000 నుంచి రూ. 1,80,000
» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జీఎం/హెచ్ వోడీ (ఈఈ), భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర, కోయలా భవన్, కోయలా నగర్, ధన్బాద్, జార్ఖండ్ చిరు నామకు పంపించాలి.
» చివరి తేదీ: 11.04.2024.
» వెబ్ సైట్: www.bcclweb.in