సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో కొలువులు - ప్రభుత్వ మినీరత్న సంస్థ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 153 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
ప్రభుత్వ మినీరత్న సంస్థ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 153 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగాన్ని అనుసరించి ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ, బీమ్, బీఏ, సీఏ, పీజీ పాసైనవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పోస్టును బట్టి ఆన్లైన్ టెస్టును వేర్వేరుగా నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నుంచి నాలుగో వంతు తగ్గిస్తారు.
మొత్తం 153 పోస్టుల్లో...
• అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) 18,
• ఆసి స్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-5,
• అకౌంటెంట్-24.
• సూపరింటెండెంట్ (జనరల్)-11,
• జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-81,
• సూపరింటెం డెంట్ (జనరల్)-ఎస్ఆర్డి (ఎన్ఎస్ఈ)-2,
• జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- ఎస్ఆర్డి (ఎ)-10,
• జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-ఎస్ఆర్ (లడఖ్ యూటీ)-2
అభ్యర్థుల వయసు 24.09.2023 నాటికి జేటీఏ పోస్టులకు 28 సంవత్సరాలు, మిగతా ఉద్యోగాలకు 30 ఏళ్లు మించకూడదు. గరిష్ట వయసులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్సీఎల్) లకు మూడేళ్లు, పీడబ్లూ డీలకు పదేళ్లు, ఎక్స్-సర్వీస్ మెను ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
అకౌంటెంట్ పోస్టుకు మాత్రం మూడేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. మిగతా వాటికి అవసరం లేదు. అన్ని పోస్టులకూ కంప్యూటర్ నాలెడ్జ్లను అద నపు అర్హతగా పరిగణిస్తారు. దరఖాస్తు ఫీజు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, పురుష అభ్యర్ధులకు రూ.1250, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీహెచ్, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ. 400.
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)/ (ఎలక్ట్రికల్): ఈ పోస్టుకు నిర్వహించే ఆన్లైన్ పరీక్షలో 145 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలకు 20 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు. డేటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్ ప్రెటేషన్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలకు 20 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 55 ప్రశ్నలకు 110 మార్కులు, పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది.
అకౌంటెంట్: ఆన్లైన్ పరీక్షలో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆస్టిట్యూడ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 35 ప్రశ్నలకు 35 మార్కులు, డేటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్ ప్రెటేషన్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలకు, 10 మార్కులు, జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలకు 20 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 65 ప్రశ్నలకు 65 మార్కులు. పరీక్ష వ్యవధి 3 గంటలు.
సూపరింటెండెంట్ (జనరల్): ఆన్లైన్ పరీక్షలో 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలకు 50 మార్కులు. డేటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్ ప్రెటేషన్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలకు 50 మార్కులు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. వ్యవధి రెండున్నర గంటలు.
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: ఆన్లైన్ పరీక్షలో 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 35 -ప్రశ్నలకు 35 మార్కులు. డేటా ఎనాలి సిస్ అండ్ ఇంటర్ ప్రెటేషన్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలకు 20 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 85 ప్రశ్నలకు 85 మార్కులు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు.
దరఖాస్తుకు చివరి తేదీ: 24-09-2023
వెబ్సైట్: http://www.cewacor.nic.in/