సైంటిస్ట్ లకు ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్) స్వాగతం : మొత్తం 368 సైంటిస్ట్స్ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
ఐసీఏఆర్ - ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్! దేశవ్యాప్తంగా పలు పరిశోధన శాలలు ఉన్న ఐసీఏఆర్ పీ హెచ్ డీ ఉత్తీర్ణులకు స్వాగతం పలుకుతోంది. మొత్తం 368 సైంటిస్ట్స్ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెం ట్ బోర్డ్(ఏఎస్ఆర్డీ) ఆధ్వర్యంలో.. నియామకాలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఏఎస్ఆర్టీ నోటిఫికేషన్ వివరాలు, పోస్ట్లు, ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు.
ఎకానమీ, బిజినెస్ పాలసీ, హ్యూమన్ రిసోర్సెస్ వంటి స్పెషలైజేషన్లలోనూ ఈ పోస్ట్ల నియామకం చేపట్టనున్నారు.
పీ హెచ్ డీ అర్హతగా:
ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ రెండు పోస్ట్లకు పీహెచీని అర్హతగా నిర్దేశించారు. అభ్య ర్థులు తాము దరఖాస్తు చేసుకుంటున్న స్పెషలైజేష న్లో పీహెచ్ పూర్తి చేసి ఉండాలి. తమ అర్హతలకు సరితూగే అన్ని పోస్ట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఆయా పోస్ట్లకు సంబంధిం చి ప్రాథమ్యత క్రమాన్ని పేర్కొనాల్సి ఉంటుంది.
అనుభవం తప్పనిసరి:
• ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్ట్లకు దరఖాస్తు చేసుకునే వారికి పని అనుభవం తప్ప నిసరి.
• ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్ట్లకు సంబం ధిత విభాగంలో పీహెచ్ తర్వాత పదేళ్ల అను భవం ఉండాలి.
• సీనియర్ సైంటిస్ట్ పోస్ట్లకు సంబంధిత విభాగం లో ఎనిమిదేళ్ల పని అనుభవం తప్పనిసరి.
వయసు:
• ప్రిన్సిపల్ సైంటిస్ట్కు గరిష్టంగా 52 ఏళ్లు, సీని యర్ సైంటిస్ట్కు గరిష్టంగా 47 ఏళ్లు ఉండాలి.
వేతన శ్రేణి:
• ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్ట్లకు వేతన శ్రేణి కూడా భారీగా ఉంటోంది.
• ప్రిన్సిపల్ సైంటిస్ట్లు వేతన శ్రేణి రూ.1,44,200 -రూ.2,18,200, సీనియర్ సైంటిస్ట్లకు వేతన శ్రేణి రూ.1,31,400-2,17,100గా పేర్కొన్నారు.
ఇంటర్వ్యూలో ప్రతిభ:
ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్ట్లకు పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా నియా మకాలు ఖరారు చేస్తారు. ఆయా స్పెషలైజేషన్లలో వచ్చిన దరఖాస్తులు, పోస్ట్ల సంఖ్య, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ జాబితాలో నిలిచిన వారికి పర్సనల్ ఇం టర్వ్యూ నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 8, 2023
ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: https://asrb.org.in/noticeboard