Type Here to Get Search Results !

కొత్త సంవత్సరంలో కొలువుల రైలు బండి

 కొత్త సంవత్సరంలో కొలువుల రైలు బండి



» 22 వేల గ్రూప్-డి పోస్ట్లకు ఆర్ఆర్ ప్రకటన

» ఈ నెల 21 నుంచి దరఖాస్తుల ప్రారంభం

» రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహణ

» పదో తరగతి, ఐటీఐతో దరఖాస్తుకు అవకాశం

» ప్రారంభంలో నెలకు రూ.25వేల వేతనం

ప్రభుత్వ కొలువుల అభ్యర్థుల కోసం కొత్త సంవత్సరం ఆరంభంలోనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(ఆర్ ఆర్ బీ) కొలు వుల నగరా మోగించింది. పదో తరగతి, ఐటీఐ అర్హతలతో నియామకాలు చేసే గ్రూప్-డి పోస్ట్లకు ప్రకటన విడుదల చేసింది. దాదాపు 22 వేల పోస్ట్లను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 21వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. ఆర్ఆర్ బీ గ్రూప్-డి నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, వేతనాలు, ప్రిపరేషన్ తదితర సమాచారం.

దాదాపు 22వేల పోస్ట్లు

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ తాజా నోటిఫికేషన్ ద్వారా.. పలు కేటగిరీల్లో దాదాపు 22,000 పోస్ట్ల ను భర్తీ చేయనుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచా రం ప్రకారం- కేటగిరీ వారీగా పోస్ట్ల వివరాలు.

ఆపరేషన్స్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్): 500 పోస్టులు, లోకో షెడ్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్): 200, టీ ఎల్ అండ్ ఏసీ అసిస్టెంట్: 500, టీఆర్తో అసి స్టెంట్: 800, బ్రిడ్జ్ అసిస్టెంట్: 600, పి-వే అసి స్టెంట్: 300, ట్రాక్ అసిస్టెంట్ (మెషీన్): 600, ట్రాక్ మెయింటెనర్: 1100, అసిస్టెంట్ సీ అండ్ డబ్ల్యూ: 1000, పాయింట్స్ మెన్ (బి): 5000, అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ): 1500 పోస్టులు ఉన్నాయి.

ఎసీసీఆర్లో 1,012 పోస్ట్లు

దక్షిణ మధ్య రైల్వే (ఎస్ సీఆర్) పరిధిలో 1, 012 పోస్ట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఆపరేషన్స్ అసిస్టెంట్(10), టీఎల్ అండ్ ఏసీ అసిస్టెంట్ (20), టీఆర్డి అసిస్టెంట్ (35), బ్రిడ్జ్ అసిస్టెంట్ (1), పీ-వే అసిస్టెంట్ (39), ట్రాక్ మెషిన్ అసిస్టెంట్ (29), ట్రాక్ మెయింటెనర్ (653), సీ అండ్ డబ్ల్యూ ఆసి స్టెంట్(22), పాయింట్స్ మెన్- బి (128), ఎస్ అండ్ టీ అసిస్టెంట్ (75) పోస్ట్లు భర్తీ చేయనున్నారు.

అర్హతలు: పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: జనవరి 1 నాటికి 18-33 సంవత్స రాలు (ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు అయిదేళ్లు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున సడలింపు) ఉండాలి.

రెండు దశల ఎంపిక

గ్రూప్-డి పోస్ట్లకు రెండు దశల్లో ఎంపిక ప్ర క్రియ నిర్వహిస్తారు. తొలుత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది.

వంద మార్కులకు రాత పరీక్ష

తొలి దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను 100 మార్కులకు నిర్వహిస్తారు. నాలుగు విభాగాల నుం చి ప్రశ్నలు అడుగుతారు. జనరల్ సైన్స్ (25 ప్రశ్న లు), మ్యాథమెటిక్స్ (25 ప్రశ్నలు), జనరల్ ఇంటె లిజెన్స్ అండ్ రీజనింగ్ (30 ప్రశ్నలు), జనరల్ అవే రెనెస్ అండ్ కరెంట్ అఫైర్స్ (20 ప్రశ్నలు) విభా గాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

రెండో దశ పీఈటీ

•తొలిదశ రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారం గా రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీ ఈటీ) నిర్వహిస్తారు.

• పురుష అభ్యర్థులు 35 కిలోల బరువు కలిగిన వస్తువును పట్టుకుని రెండు నిమిషాల్లో 100 మీటర్ల దూరం చేరుకోవాలి. అదే విధంగా 4 నిమిషాల 15 సెకన్ల వ్యవధిలో 1,000 మీటర్ల (ఒక కిలోమీటరు) దూరం చేరుకోవాలి.

• మహిళా అభ్యర్థులు 20 కిలోల బరువు కలిగిన వస్తువును పట్టుకుని రెండు నిమిషాల్లో 100 మీటర్ల దూరం చేరుకోవాలి. అదే విధంగా 5 నిమిషాల 40 సెకన్ల వ్యవధిలో 1,000 మీటర్ల( ఒక కిలోమీటరు) దూరం చేరుకోవాలి.

చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్

సీబీటీ, పీఈటీ రెండు దశల్లోనూ ప్రతిభ చూపి.. నిర్దిష్ట కటాఫ్ మేరకు తుది జాబితాలో నిలిచిన వారికి.. డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పిలుస్తారు. ఈ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుం టే నియామక పత్రం అందిస్తారు.

ఒక ఆర్ఆర్ఆ్బకే అవకాశం

దేశ వ్యాప్తంగా మొత్తం 17 ఆర్ఆర్బీల పరిధిలో పోస్టను పేర్కొన్నారు. అయితే అభ్యర్థులు మాత్రం తమకు ఆసక్తి ఉన్న ఆర్జర్బేకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఆర్జర్బై పరిధిలో పలు పోస్ట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఒకటే పరీక్ష నిర్వహిస్తారు. తదుపరి దశలో పీఈటీ కూడా సదరు ఆర్౦ పరిధిలో పేర్కొన్న ప్రాంతంలోనే ఉంటుంది.

వేతనం నెలకు రూ.25 వేలు

ఆర్ఆర్బై గ్రూప్-డి పోస్ట్లను పే లెవల్-1 గా పేర్కొనడంతో... ప్రారంభంలోనే నెలకు రూ.25 వేల వరకు వేతనం పొందొచ్చు. మూల వేతనం రూ.18 వేలుగా ఉంటుంది. దీంతోపాటు డీఏ, హెచ్ఎరి, టీఏ వంటి ఇతర భత్యాలు లభిస్తాయి.

క్షేత్ర స్థాయి నిర్వహణ

గ్రూప్-డి పోస్ట్లకు ఎంపికైన వారు.. తమ విభాగాల్లో క్షేత్ర స్థాయి నిర్వహణ బాధ్యతలు చేప ట్టాల్సి ఉంటుంది. ట్రాక్ మెయింటనెన్స్, రైళ్లలో ఎలక్ట్రికల్ పరికరాల నిర్వహణ తదితర బాధ్యతలు ఉంటాయి.

సూపరింటెండెంట్ స్థాయికి

గ్రూప్-డి పోస్ట్లకు ఎంపికైన అభ్యర్థులు భవి ష్యత్తులో సెక్షన్ ఇంజనీర్ లేదా సూపరింటెండెంట్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ప్రతి మూడేళ్ల తర్వాత డిపార్ట్మెంట్ పరీక్షలకు అర్హత లభిస్తుంది. వాటిలో ఉత్తీర్ణత పొందితే మరింత త్వరగా పదో న్నతి పొందొచ్చు.

రాత పరీక్షలో రాణించేలా

జనరల్ సైన్స్

యూనిట్స్, ఫోర్స్, ప్రెజర్, మెకానిక్స్, సౌండ్, హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజం, మోడర్న్ ఫి జిక్స్ తదితర అంశాల్లోని బేసిక్ కాన్సెప్టులు, సూత్రా లపై అవగాహన పెంపొందించుకోవాలి. కెమిస్ట్రీలో ఆటమ్స్, మాలిక్యూల్స్, యాసిడ్స్, బేసెస్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ కాంపౌండ్స్, మెటలర్జీ తదితర అంశాలపై పట్టు సాదించాలి. అదే విధంగా లైఫ్ సైన్సెస్కు సంబంధించి హ్యూమన్ బాడీ, విట మిన్లు, న్యూట్రిషన్, నెర్వస్ సిస్టమ్, హార్మోన్లు, ఎం జైమ్లు, సూక్ష్మజీవులు, వ్యాధులు, టీకాలు, పర్యా వరణం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

మ్యాథమెటిక్స్

నంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్ష న్స్, ఎల్సీఎం, హెచ్సీఎఫ్, రేషియో అండ్ ప్రపో ర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, ఇంట్రస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, అల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, కామెట్రీ, కేలండర్ అండ్ క్లాక్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటి కోసం తొలుత పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమిక భావనలపై అవగాహన పెంపొందించు కోవాలి. ఆ తర్వాత అభ్యాసాల్లోని సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా బ్యాంకు, ఎస్ఎ సిసీ, రైల్వే పరీక్షలకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది.

జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్

అనాలజీస్, అల్ఫాబెటికల్, నంబర్ సిరీస్, కోడింగ్ -డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రమ్, డేటా ఇం టర్ప్రైటేషన్, డేటా సఫీషియెన్సీ, కన్ క్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్ తది తర అంశాలపై దృష్టి సారించాలి.

జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్

• కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేష నల్ ఇంపార్టెన్స్, గేమ్స్- స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, లైఫ్ సైన్స్(పదో తరగతి స్థాయి), హిస్టరీ ఆఫ్ ఇండియా. ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కానిస్టిట్యూషన్, పాలిటికల్ సిస్టమ్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నలాజికల్ డవలప్మెంట్స్, స్పేస్ సైన్స్, భారత అణు కార్యక్రమం, ఐక్యరాజ్యసమితి, ఇతర ముఖ్య మైన అంతర్జాతీయ సంస్థలు, పద్యావరణ ఆం కాలు, కంప్యూటర్ ప్రాథమిక అంశాలు, దేశంలో రవాణా వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ పధకాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

• మెంటల్ ఎబిలిటీలో అనాలజీస్, నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, రిలేషన్షిప్స్, సిలాజిజమ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రమ్స్, డేటా ఇంటర్ప్రైటే షన్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్స్-ఆర్యు మెంట్పై దృష్టి సారించాలి.

ముఖ్య సమాచారం

• దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

• ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 2026 జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 వరకు

• పరీక్ష తేదీ: జూన్ లో నిర్వహించే అవకాశం

• పూర్తి వివరాలకు వెబ్సైట్: www.rrbsecunderabad.gov.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area