Type Here to Get Search Results !

విదేశీ విద్యకు.. స్కాలర్షిప్స్ ఊతం!

 విదేశీ విద్యకు.. స్కాలర్షిప్స్ ఊతం!


» ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్న ఉపకార వేతనాలు

» అకడమిక్ రికార్డ్, ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్స్

బీఏ, బీకాం మొదలు బీటెక్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల వరకూ.. నేడు ఎక్కువ మంది భారతీయ విద్యార్థుల లక్ష్యం.. విదేశాల్లో ఉన్నత విద్య! ఫారిన్ వర్సిటీల్లో చదువు పూర్తి చేసుకుని.. అంతర్జాతీయ అవకాశాలు అందుకోవాలనే అభి లాష!! కాని రూ. లక్షల్లో ఫీజులు, ఇతర భారీ వ్యయాల కారణంగా విదేశీ విద్య అవకాశాలు వచ్చినా ఎంతో మంది వదులుకుం టున్న వైనం. ఇలాంటి వారికి ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పిస్తున్నాయి. స్కాలర్షిప్స్! విదేశీ యూనివర్సి టీల్లో స్పైంగ్ సీజన్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసా గుతున్న నేపథ్యంలో.. స్టడీ అబ్రాడ్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన స్కాలర్షిప్ వివరాలు...


• ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్స్:

మన దేశ విద్యార్థులు తొలి గమ్యంగా భావించే అమెరికాలోని యూనివర్సిటీల్లో చేరే వారికి వులై ట్ స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఆర్ట్స్, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్/స్టడీ స్, హయ్యర్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ ఆఫైర్స్, ఇంటర్నేషనల్ లీగల్ స్టడీస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ హెల్త్, ఆర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్, ఉమెన్స్ స్టడీస్/జండర్ స్టడీస్ తదితర విభాగాల్లో పీజీ, ఆపై స్థాయి కోర్సుల్లో చేరిన వారు ఈ స్కాలర్షిప్సు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఎం పికైన వారికి కోర్సు వ్యవధిలో ఒకసారి స్వదేశానికి వచ్చి వెళ్లేందుకు విమాన ఛార్జీలు, నివాస ఖర్చులు, ట్యూషన్ ఫీజు ఫండింగ్ వంటివి లభిస్తాయి.

» వివరాలకు వెబ్సైట్: 

www.usief.org.in/Fullbright-Nehru-Fellowships.aspx


• క్వాడ్ ఫెలోషిప్ ఫర్ స్టెమ్ కోర్సెస్:

క్వాడ్ దేశాల కూటమి ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న స్కాలర్ షిప్ సదుపాయం ఇది. క్వాడ్ కూటమి లోని ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా దేశాల కు చెందిన వంద మంది విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్స్ అందిస్తారు. అమెరికాలోని యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్స్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాలకు సంబంధించి పీజీ కోర్సులు చేసే వారు ఈ క్వాడ్ ఫెలోషిపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ.50 వేల డాలర్ల ఏక మొత్తం ఆర్థిక సహాయం లభిస్తుం ది. నీద్ బేస్డ్ విధానంలో కోర్సులు పూర్తి చేసుకునేం దుకు ఆయ్యే వ్యయంలో భాగంగా మరో 25 వేల డాలర్లు అందిస్తారు. దీని కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

» వివరాలకు వెబ్సైట్: https://www.quadfellowship.org/


• నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్:

దేశంలో ఎస్సీ కేటగిరీలకు చెందిన ఆల్పాదాయ వర్గాల విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం.. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్, ఎస్సీ/ఎస్టీ, వ్యవసాయ కూలీ కుటుంబాలకు చెందిన విద్యార్థులు. డినోటిఫైడ్, సంచార, పాక్షిక సంచార జాతులు, సం పద్రాయ కళాకారుల కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ లేదా పీజీ 60 శాతం మార్కుల తో ఉత్తీర్ణత సాధించి, విదేశాల్లో పీజీ లేదా పీహెచ్ఎకి దరఖాస్తు చేసుకుని ఉండాలి. ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి 125 స్కాలర్షిప్స్ అం దుబాటులో ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు-115, సందార, పాక్షిక సంచార జాతుల వారికి-06, భూమిలేని వ్యవసాయ కూలీలకు, సంప్రదాయ కళాకారులకు-04 స్కాలర్షిప్షన్సు కేటాయిస్తారు. ఎంపికైన వారికి పీజీ కోర్సులో చేరితే మూడేళ్ల పాటు, పీహెచ్డీ చేసే వారికి నాలుగేళ్ల కాలానికి స్కాలర్షిప్స్ను మంజూరు చేస్తారు. బ్యూషన్ ఫీజు, మెయింటనెన్స్ అలవెన్స్. ఆత్యవసర ఖర్చు లు, వీసా ఫీజు, ఎక్విప్మెంట్ అలవెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం తదితర ఖర్చుల కోసం ఈ స్కాలర్షిప్ ద్వారా ఆర్థిక సహకారం అందిస్తారు.

» వివరాలకు వెబ్సైట్: https://nosmsje.gov.in


• ఏడీబీ జపాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్:

జపాన్లోని యూనివర్సిటీల్లో ప్రవేశం ఖరారు చేసు కున్న భారతీయ విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ పథకం.. ఏషియన్ డెవలప్మెం ట్ బ్యాంక్-జపాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఎకనా మిక్స్, మేనేజ్ మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇతర అభివృద్ధి సంబంధిత విభాగాల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విద్యనభ్యసించే విద్యార్థులకు ఇవి లభిస్తాయి. ఎంపికైన వారికి పూర్తి స్థాయి ట్యూషన్ ఫీజు, హౌసింగ్ అలవెన్స్ బుక్స్ అలవెన్స్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అందుతాయి. అభ్యర్థులు తాము ప్రవేశం ఖరారు చేసుకున్న యూనివర్సిటీలో అడ్మిష న్ తేదీ ప్రారంభానికి కనీసం ఆరు నెలల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 » వివరాలకు వెబ్సైట్: www.adb.org


• టోఫెల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్:

ప్రముఖ లాంగ్వేజ్ టెస్టింగ్ ఏజెన్సీ ఈటీఎస్ టోఫె ల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అందిస్తోంది. ఏ దేశంలో ప్రవేశం ఖరారు చేసుకున్నా.. ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్గా 80 శాతం పైగా మార్కులు, టోఫెల్లో సదరు యూనివర్సిటీ పేర్కొన్న స్కోర్ సాధించిన విద్యార్థులు అర్హులు.

» వివరాలకు వెబ్సైట్: https://www.ets.orgfoes/grants/


• బ్రిటిష్ కౌన్సిల్ ఐఈఎల్ఎఎస్ అవార్డ్స్:

బ్రిటిష్ కౌన్సిల్.. ఐఈఎల్డీఎస్ స్కోర్ ఆధారంగా అందిస్తున్న స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇది. ఐఈఎల్బీఎన్ జాయింట్ ఫండెడ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ పేరుతో అందిస్తున్న ఈ స్కాలర్షిప్స్ను బ్రిటిష్ కౌన్సిల్, ఐడీపీ, ఐఈఎల్ఎన్ ఆస్ట్రేలియా సహకారం అందిస్తాయి. ఈ స్కాలర్షిప్ల్నేకు ఎం పికైన వారికి ట్యూషన్ ఫీజు నిమిత్తం రూ.మూడు లక్షల స్కాలర్షిప్ లభిస్తుంది.

» వివరాలకు వెబ్సైట్: https://www.ielts.org/for-researchers/grants-and-awards


• ఛార్లెస్ వాలెస్ ఇండియా ట్రస్ట్ స్కాలర్షిప్స్:

యూకేలో పీజీ, ఆపై స్థాయి కోర్సుల అభ్యర్ధులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ ఇది. విద్యార్థులకు ఎంపిక చేసుకున్న కోర్సు మేరకు ఏదా. దికి గరిష్టంగా 1400 పౌండ్ల స్కాలర్షిప్ లభిస్తుంది.

» వివరాలకు వెబ్సైట్: https://www.studyuk/scholarships/charleswallace-india-trust-scholarships


• డీఏఏడీ స్కాలర్షిప్స్:

జర్మనీలో ఇంజనీరింగ్, సైన్స్ రంగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టోరల్, పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ అభ్యర్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ పథకం ఇది. దీన్ని జర్మన్ అకడమిక్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మేరకు అందిస్తారు. ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చుల మొత్తానికి స్కాలర్షిప్ లభిస్తుంది.

» వివరాలకు వెబ్సైట్: https://www.daad.in/en/


• ఎరాస్మస్ ముండస్:

యూరోపియన్ యూనియన్ దేశాల్లో పీజీ, పీహెచ్ఎలో చేరాలనుకునే వారికి అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ ప్రోగ్రామ్.. ఎదాస్మస్ ముండస్, ఎంపికైన వారికి ట్యూషన్ ఫీజు, నివాస వసతి, మెడికల్ అలవెన్స్, ఇన్సూరెన్స్ తదితర ఖర్చుల మొత్తానికి సరిపడే విధంగా ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తుంది.

వివరాలకు వెబ్సైట్: eacea.europa.eu/erasmus_mundus/funding/


• కామన్వెల్త్ స్కాలర్షిప్స్- యూకే:

కేంద్ర ప్రభుత్వ పరిధిలో అందుబాటులో ఉన్న స్కాలర్షిప్ పథకం ఇది. కామన్వెల్త్ సభ్య దేశాల్లో చదవాలనుకునే వారు ఈ స్కాలర్ షిప్నకు దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్టర్స్ స్థాయిలో ఒక ఏదాది, పీహెచ్ స్థాయిలో మూడేళ్లు స్కాలర్షిప్ లభిస్తుంది. అర్హులైన అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు, నివాన వ్యయాలకు సరిపడ మొత్తంలో ఆర్థిక తోడ్పాటు లభిస్తుంది.

» వివరాలకు వెబ్సైట్: mhrd.gov.in/scholarships


స్టడీ అబ్రాడ్ స్కాలర్షిప్ - నిబంధనలు:

» అకడమిక్ అర్హతల సర్టిఫికెట్లు తప్పనిసరి... అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ ఉండాలి.

» అధికారిక టెస్ట్(టోఫెల్, జీఆర్తో, ఐఈఎల్డీ ఎస్. జీమ్యాట్, శాట్ తదితర) స్కోర్లు,

» అడ్మిషన్ పొందిన యూనివర్సిటీ నుంచి రిఫరెన్స్ లెటర్.

» స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్.

» యూనివర్సిటీలు అందించే స్కాలర్షిప్లకైతే ప్రతి సెమిస్టర్ లో నిర్దిష్ట జీపీఏ లేదా పర్సం టేజ్లో ఉత్తీర్ణత తప్పనిసరి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area