మారిటైమ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా, డిగ్రీ
పుణెలోని తొలాని మారిటైమ్ ఇన్స్టిట్యూట్ (టీఎంఐ)- డిగ్రీ, డిప్లొమా ప్రోగ్రామ్ లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్, బీఎస్సీ నాటికల్ సైన్స్, డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ఐఎంయూ సెట్ 2024 అర్హత తప్పనిసరి. అలాగే సంస్థ నిర్వ హించే సైన్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (టీఎంఐఎస్ఐటీ) రాయాల్సి ఉంటుంది. డిప్లొ మాలో ప్రవేశానికి ఈ టెస్ట్ రాయనవసరం లేదు. డిగ్రీ ప్రోగ్రామ్లకు అవివాహి తులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మహిళలకు ట్యూషన్ ఫీజులో 50 శాతం రాయితీ వర్తిస్తుంది. అడ్మిషన్ నాటికి అభ్యర్థులకు పాస్పోర్ట్ ఉండాలి.
బీటెక్ మెరైన్ ఇంజన్లింగ్:
ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. ఇందులో ఎనిమిది సెమి స్టర్లు ఉంటాయి. థియరిటికల్, ప్రాక్టికల్, వర్క్షాప్ ట్రెయినింగ్లు ఉంటాయి. ఇంజనీరింగ్ సైన్సెస్ సబ్జె కులు, షిప్ బోర్డ్ మెషినరీకి సంబంధించి మెరైన్, మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఉంటాయి. చివరి సంవత్సరంలో ఇంటర్న్షిప్ ఉంటుంది.
బీఎస్సీ నాటికల్ సైన్స్:
ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. ఇందులో ఆరు సెమి స్టర్లు ఉంటాయి. ఇంజనీరింగ్ మేథమెటిక్స్, ఫిజిక్స్, నాటికల్ టెక్నాలజీ, నేవిగేషన్, కార్లో ఆపరేషన్స్, షిప్ మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ సంబంధిత సబ్జె క్తులు ఉంటాయి. ప్రోగ్రామ్ చివరలో షిప్ బోర్డ్ టూల్స్, ప్రాక్టికల్ సీమన్ షిప్, సెయిలింగ్, బోట్ హ్యాండిలింగ్లపై వర్క్ షాప్ ట్రెయినింగ్ ఉంటుంది.
డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్:
ఇది ఏడాది వ్యవధి గల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఇందులో 120 సీట్లు ఉన్నాయి. ఇది ఫ్రీ సీ డెక్ క్యాడెట్ కోర్సు. ఇది పూర్తయిన తరవాత ఏడాదిన్నర వ్యవధిగల అఫ్ బోర్డ్ షిప్ ట్రెయినింగ్ ఉంటుంది. దీనిని పూర్తిచేసి నవారికి అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ (ఏడీఎ న్ఎస్)ను ప్రదానం చేస్తారు. తరవాత షిప్పింగ్ కంపె స్రీలు ఆఫర్ చేసే ఆన్ బోర్డ్ ట్రెయినింగ్ కూడా చేస్తే బీఎస్సీ అప్లయిడ్ నాటికల్ సైన్స్) డిగ్రీని ఇస్తుంది.
అర్హత వివరాలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసేవారు కూడా ఆప్లయ్ చేసుకో వచ్చు. గ్రూప్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. పదోతరగతి/ ఇంటర్ స్థాయిలో ఇంగ్లీష్లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.
వయసు: డిగ్రీ ప్రోగ్రామ్లకు పురుషులు 2003 సెప్టెంబరు 1 తరవాత, మహి ళలు 2001 సెప్టెంబరు 1 తరవాత జన్మించి ఉండాలి. డిప్లొమాకు 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్ స్థాయిలో గ్రూప్ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులు, ఐఎంయూ సెట్ 2024 ర్యాంక్ ఆధారంగా షార్ట్స్ట్ చేసిన అభ్యర్థులకు సైన్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఎ సిఏటీ) నిర్వహిస్తారు. ఇందులో సాధించిన మెరిట్ ప్రకారం పర్సనల్ ఇంట ర్వ్యూలు, మెడికల్ టెస్ట్లు నిర్వహించి ఆర్హులకు అడ్మిషన్స్ ఇస్తారు.
టీఎంఐ ఎస్ఏటీ వివరాలు: ఇది ఆన్లైన్ ఎగ్జామ్. ఇందులో భాగంగా మొదట మెయిన్ టెస్ట్ ఉంటుంది. ఇందులో మేథమెటిక్స్ పిజిక్స్, జనరల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అంశాల నుంచి 80 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతాడు. ప్రశ్నలన్నీ ఇంటర్ స్థాయిలోనే ఉంటాయి పరీక్ష సమయం గంటన్నర. తరవాత బిహేవియరల్ అసెస్మెంట్ ఉంటుంది. దీనికి అర్థగంట సమయం కేటాయిం చారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి ఆలోచన విధానం, పరిపక్వత స్థాయి, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, రీజనింగ్ సామర్థ్యం తదితరాలు పరీక్షిస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: డీఎన్ఎస్ ప్రోగ్రామ్నకు ఏప్రిల్ 30, మిగిలిన ప్రోగ్రామ్లకు మే 31
వెబ్ సైట్: tmi.tolani.edu