Type Here to Get Search Results !
🔥 Latest Jobs

ఎన్.జీ రంగా వర్సిటీలో ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు

 ఎన్.జీ రంగా వర్సిటీలో ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు



గుంటూరులోని ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఏఎన్ జీఆర్ఎయూ) ఆధ్వర్యం లోని ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్ ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఒక్కో కోర్చు వ్యవధి ఎనిమిది వారాలు( రెండు నెలలు). వీటిని తెలుగు మాధ్యమంలో నిర్వ హిస్తారు. కోర్సులు ఏప్రిల్ నెలలో ప్రారంభమౌ తాయి. కోర్సులో భాగంగా వారానికి ఒకటి చొప్పున ఏడు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. క్లాస్ వ్యవధి రెండు గంటలు. ప్రతి క్లాస్ క్విజ్లు, ఆసైన్మెం ట్లు ఉంటాయి. అటెండెన్స్ తప్పనిసరి. కోర్సుకు సంబందించిన పాఠ్య పుస్తకాలు ఇస్తారు. చివరి వారంలో ఎగ్జామ్ ఉంటుంది. కనీసం 50 శాతం మార్కులు వస్తేనే సర్టిఫికెట్లు ఇస్తారు. ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయినవారికి/ హాజరు కానివారికి నెలలోపు మరల పరీక్ష ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకుని నింపి దరఖాస్తు ఫీజు డీడీ/మనియార్డర్ జతచేసి కింది చిరునామాకు పంపాలి.

కోర్సులు:

• సేంద్రీయ వ్యవసాయం

• పుట్టగొడుగుల పెంపకం

అర్హత: తెలుగులో చదవడం, రాయడం తెలిసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయో పరిమితి నిబంధనలు లేవు. అభ్యర్ధులకు కంప్యూటర్/ఆండ్రాయిడ్ ఫోన్, ఆన్లైన్ సదుపాయం ఉండాలి.

కోర్సు ఫీజు: రూ.1500

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 25

చిరునామా: 

ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్, 

డీన్ కార్యాలయం, పరిపాలనా భవనం, 

ఆచార్య ఎన్.జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం,

 గుంటూరు-522034

వెబ్ సైట్: www.angrau.ac.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area