తెలంగాణ జెన్కోలో 60 కెమిస్ట్ పోస్టులు
హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహ ణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం కెమిస్ట్ పోస్టులను భర్తీ చేయ నుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 60 (లిమిటెడ్ రిక్రూ ట్మెంట్-03, జనరల్ రిక్రూట్మెంట్-57).
అర్హత: బీఎస్సీ(కెమిస్ట్రీ), మొదటి శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ఎన్విరాన్మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.65,600 నుంచి 1,31,220.
ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్ల వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.10.2023
రాతపరీక్ష తేది: 03.12.2023.
వెబ్సైట్: www.tsgenco.co.in