Type Here to Get Search Results !

ఎమ్మెస్సీకి బెస్ట్ : నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్).

 ఎమ్మెస్సీకి బెస్ట్ : నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్). 



• నైసర్, సీఈబీఎస్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ

• నెస్ట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం ఖరారు 

• ఇంటర్మీడియెట్ అర్హతతోనే దరఖాస్తుకు అవకాశం

సైన్స్ సబ్జెక్ట్లతో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారా! సైన్స్ రంగంలో కెరీర్ కోరుకుంటున్నారా!! అందుకు చక్కటి మార్గం.. నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్). దేశంలో సైన్స్ విద్య, పరిశోధనలో ప్రత్యేక గుర్తింపు పొందిన నైసర్తో పాటు సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్లో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో నెస్ట్ స్కోర్తో ప్రవేశం పొందొచ్చు. ఆ తర్వాత పీహెచ్డీ దిశగా అడుగులు వేయొచ్చు! తాజాగా వెస్ట్-2024కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నెస్ట్-2024తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, ఈ టెస్ట్లో బెస్ట్ స్కోర్కు మార్గాలపై ప్రత్యేక కథనం...

సాధారణంగా ఎమ్మెస్సీలో చేరాలంటే... బీఎస్సీ క్ష పూర్తి చేయాలి. నెస్ట్ ద్వారా ఇంటర్మీడియెట్ అర్హత తోనే ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో చేరే అవకాశం ఉంది. అది కూడా దేశంలో సైన్స్ ఎడ్యుకేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (భువనేశ్వర్), అదే విధం గా భారత అణుశక్తి విభాగం నేతృత్వంలో ముంబై యూనివర్సిటీలో ప్రత్యేకంగా నెలకొల్పిన సెంటర్ ఫర్ ఎక్స్టెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్) లలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో అడుగు = పెట్టొచ్చు.

మొత్తం 257 సీట్లు:

నైసర్ భువనేశ్వర్లో 200 సీట్లు: సెంటర్ ఫర్ - ఎక్స్టెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (యూనివర్సిటీ అఫ్ ముంబై)లో 57 సీట్లు ఉన్నాయి. నైసర్లో ఒక మేజర్ సబ్జెక్ట్ తోపాటు బయలాజికల్ సైన్సెస్, కెమి కల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్లలో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సును అందిస్తున్నారు. విద్యార్థులు వీటిలో తమకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్ తోపాటు బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, లేదా ఫిజిక్స్ ఐ లను మైనర్ సబ్జెక్ట్ ఎంచుకునే అవకాశం ఉంది. అణుశక్తి శాఖ నేతృత్వంలోని సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్లో.. బయలాజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్ట్లలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సు అందుబాటులో ఉంది.

అర్హతలు:

సైన్స్ గ్రూప్తో 2022, 2023లో 60 శాతం మార్కులతో 10+2/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. 2024లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకోనున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఇంటర్లో 60 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది.

ప్రవేశ ప్రక్రియ:

నెస్ట్ స్కోర్ ఆధారంగా విద్యార్థులు రెండు ఇన్ స్టి ట్యూట్లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉం టుంది. వచ్చిన దరఖాస్తులు, అభ్యర్థులు పొందిన వెస్ట్ ర్యాంకు, రిజర్వేషన్ నిబంధనలను పరిగణన లోకి తీసుకొని అడ్మిషన్ ఖరారు చేస్తారు. కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత నైసర్లో సీటు పొందిన విద్యార్థులకు హోమిబాబా నేషనల్ ఇన్స్టిట్యూట్, సీరుబీఎస్లో చేరిన విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి సర్టిఫికెట్లు అందిస్తారు.

స్కాలర్షిప్ సదుపాయం

నెస్ట్ స్కోర్ ఆధారంగా నైసర్, సీఈబీఎస్లలో ప్రవేశం ఖరారు చేసుకున్న విద్యార్థులకు స్కాలర్ షిప్ పేరిట ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అమలు చేస్తున్న దిశ ప్రోగామ్ ద్వారా... ఏటా రూ.60 వేల స్కాలర్షిప్ లభిస్తుంది. దీంతోపాటు సమ్మర్ ఇంటర్న్షిప్ చేసేందుకు వీలుగా ప్రతి ఏటా రూ.20 వేల గ్రాంట్ కూడా అందిస్తారు.

రీసెర్చ్ కి కేరాఫ్:

ఈ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్పు వ్యవధి ఐదేళ్లు, పది సెమిస్టర్లుగా ఉంటుంది. విద్యార్థులు చివరి ఆరు సెమిస్టర్లలో సదరు క్యాంపస్ ఫ్యాకల్టీ సభ్యులు చేస్తున్న రీసెర్చ్లో లో తప్పనిసరిగా పాల్గొ నాల్సి ఉంటుంది. దీని ఆధారంగానూ అభ్యర్థులకు మార్కులు, క్రెడిట్స్ కేటాయిస్తారు. ఫలితంగా విద్యార్థులకు పీజీ స్థాయిలోనే పరిశోధనలపై ఆసక్తి, అవగాహన కలుగుతాయి.

బార్క్ లో పి హెచ్ డి:

నెస్ట్ స్కోర్తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో చేరిన విద్యార్థులు భవిష్యత్లో ప్రతిష్టాత్మక పరిశోధన కేం ద్రం బాబా అటామిక్ రీసెర్చ్(బార్క్) సెంటర్ ట్రైనింగ్ స్కూల్లో నేరుగా పీహెచ్ డీలో చేరే అవ కాశం ఉంది. ఇందుకోసం అభ్యర్థులు ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో నిర్దిష్ట మార్కులతో ఉత్తీర్ణత సాధిం చాల్సి ఉంటుంది. ఈ మార్కులను ప్రతి ఏటా బార్క్ నిర్దేశిస్తుంది. వీరికి ఇంటర్వ్యూ ద్వారా పీహె చ్డీలో అడ్మిషన్ కల్పిస్తారు..

పరీక్ష ఇలా...

నెస్ట్ను పూర్తిగా ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నిర్వహిస్తారు. రెండు సెషన్లుగా పరీక్ష ఉంటుంది. అభ్యర్ధులు ఏదో ఒక సెషన్కు హాజరు కావచ్చు. పరీక్షను నాలుగు సెక్షన్లుగా 280 మార్కు లకు నిర్వహిస్తున్నారు. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాచ్ల మెటిక్స్, ఫిజిక్స్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉం టాయి. ప్రతి విభాగం/సబ్జెక్ట్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు చొప్పున ప్రతి సెక్షన్ 60 మార్కులకు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. మొత్తం నాలుగు సెక్షన్లలో కలిపి 240 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెస్ట్ ప్రతి సెక్షన్లోనూ అభ్యర్థులు కనీస అర్హత మార్కులు పొందాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎక్కువ మార్కులు పొందిన మూడు సెక్షన్లనే పరిగణనలోకి తీసుకుని 180 మార్కుల ప్రాతిపదికగా మూల్యాంకన చేస్తారు.

ఫైనల్ కటాఫ్ నిబంధన:

నెస్ట్లో సెక్షన్ వారీ కటాఫ్ తోపాటు.. మినిమమ్ అడ్మిషబుల్ పర్సంటైల్ పేరుతో ఓవరాల్ కటాఫ్ను కూడా నిర్దేశిస్తున్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 95 పర్సంటైల్, ఓబీసీ అభ్యర్థులు 90 పర్సంటైల్. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులు 75 పర్సంటైల్ సాదించాల్సి ఉంటుంది.

ముఖ్య సమాచారం:

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, మే 31

అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: 2024, జూన్ 15 

నెస్ట్ తేదీ: 2024 జూన్ 30

పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nestexam.in


DOWNLOAD INFORMATION BROCHURE

HOW TO APPLY

ONLINE REGISTRATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area