రిమోట్ సెన్సింగ్ సెంటర్లో ఉద్యోగ అవకాశాలు
తాత్కాలిక ప్రాతిపదికన 71 రిసెర్చ్ సిబ్బంది నియామకానికి ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్) దరఖాస్తులు కోరుతోంది.
రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులను తాత్కాలిక ప్రాతిపదికన ఏడాది కాలానికి ఎంపిక చేసి ప్పటికీ ప్రాజెక్టు అవసరాలు, అభ్యర్థుల పనితీరు ఆధారంగా పొడి గించే అవకాశం ఉంటుంది.
1. రిసెర్చ్ సైంటిస్ట్ - 20: ఈ పోస్టులు వివిధ విభాగాల్లో ఉన్నాయి. గరిష్ట వయసు 28 ఏళ్లు ఎమ్మెస్సీ ఇన్ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ తత్సమాన కోర్సు పూర్తిచేయాలి. ఫిజిక్స్/ మేథమెటిక్స్/ జియాలజీ తప్పనిసరి సబ్జె క్టులుగా బీఎస్సీ ఉత్తీర్ణత అవసరం. ఎంఈ/ ఎంటెక్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్/ జియోఇ న్ఫర్మాటిక్స్ చేయాలి. ఏదైనా బ్రాంచ్ తో బీఈ/ బీటెక్ పాసవ్వాలి.
2. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 - 6: ఎంఈ/ఎంటెక్ ఇన్ అండ్ జీఐఎస్/ జియో ఇన్ఫర్మాటిక్స్/ తత్సమాన కోర్సు. బీఈ/బీటెక్ ఇన్ కంప్యూ టర్ సైన్స్ ఇంజినీరింగ్/ జియోఇన్ఫర్మాటిక్స్ పాసవ్వాలి. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు,
3. ప్రాజెక్ట్ సైంటిస్ట్-బి - 4: బీఈ/బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ తత్సమాన కోర్సు పూర్తిచేయాలి. గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు.
4. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 - 2: ఎమ్మెస్సీ ఇన్ రిమోట్ సెన్సింగ్/ జీఐఎస్, బీఎస్సీ పూర్తిచేయాలి.
5. ప్రాజెక్ట్ అసోసియేట్ 2 - 12: ఎంఈ/ ఎంటెక్ ఇన్ జియోఇన్స ర్మాటిక్స్/ తత్సమాన కోర్సు బీఈ/ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ జియోఇన్ఫర్మాటిక్స్ పాసవ్వాలి. ఇండస్ట్రియల్ అండ్ అకడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో రెండేళ్ల అను భవం ఉండాలి.
6. జూనియర్ రిసెర్చ్ ఫెలో - 27: వివిధ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. సబ్జెక్టుల స్పెషలైజేషన్లో తేడాలు ఉంటాయి. గరిష్ఠ వయసు 28 సంవత్సరాలు. వాటర్ రిసోర్సెస్ స్పెషలైజేషన్తో ఎంఈ/ ఎంటెక్ (సివిల్ ఇంజినీరింగ్).. బీఈ/బీటెక్ ఇన్ సివిల్ ఇంజినీరింగ్/ అగ్రికల్చర్ ఇంజినీ రింగ్ ఉత్తీర్ణులవ్వాలి. ఎంఈ/ఎంటెక్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్/ జియోఇ న్ఫర్మాటిక్స్/తత్సమాన కోర్సు, బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ పాసవ్వాలి.
◾ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసినవారు దరఖాస్తుకు అనర్హులు. పోస్టులను బట్టి గరిష్ట వయసులో తేడాలు ఉంటాయి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక: విద్యార్హతల ఆధారంగా దరఖాస్తుల స్క్రీనింగ్ నిర్వహించి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తే హైదరాబాద్లో రాత పరీక్ష నిర్వహించి షార్ట్స్టింగ్ చేస్తారు. ఈ పరీక్షను అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్ కోసమే నిర్వహిస్తారు. దీంట్లో సాధించిన మార్కు లను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ సమాచారాన్ని అభ్యర్థుల ఈమెయిల్కు తెలియజేస్తారు.
గమనించాల్సినవి:
తాత్కాలిక ప్రాతిపదికన ఏడాది కాలానికి ఉద్యోగంలోకి తీసుకుం టారు. అభ్యర్థి పనితీరు, ప్రాజెక్టు అవసరాల నిమిత్తం దీన్ని పొడిగించే అవకాశం ఉంటుంది.
విదేశీ యూనివర్సిటీల్లో డిగ్రీలు పూర్తిచేసిన అభ్యర్థులు అసోసియే షన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ జారీచేసిన ఈక్వివలెన్సీ సర్టిఫికెట్ను దరఖాస్తు లేదా ఇంటర్వ్యూ సమయంలో సమర్పిం
ఒకటికంటే ఎక్కువ పోస్టులకు అర్హతలు ఉన్న అభ్యర్ధులు కావాలనుకుంటే పోస్టుల వారీ విడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారిని షాద్నగర్ (రంగారెడ్డి), జీడిమెట్ల, బాలానగర్ (హైదరాబాద్)లోని ఎన్ఆర్ఎస్సీ క్యాంపస్లలో, నాగ్పుర, న్యూదిల్లీ, కోల్కతా, జోధ్పుర్, బెంగళూరులోని రిమోట్ సెన్సింగ్ సెంటర్లలో నియమిస్తారు.
ఎంపికైన అభ్యర్ధులకు ఆకర్షణీయమైన వేతనంతోపాటు, అదనపు ప్రోత్సాహకాలూ ఉంటాయి. జూనియర్ రిసెర్చ్ ఫెలోగా ఎంపికైనవారు ఆసక్తి ఉంటే పీహెచ్ కూడా చేసుకోవచ్చు. అంతర్జాతీయ జర్నల్స్ అందుబాటులో ఉండే గ్రంథాలయ సదుపాయాన్ని వినియో గించుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: 08.04,202
వెబ్ సైట్: www.nsc.gov.in