Type Here to Get Search Results !

కలినరీ ఆర్ట్స్ లో బీబీఏ, ఎంబీఏ

 కలినరీ ఆర్ట్స్ లో బీబీఏ, ఎంబీఏ



కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ (ఐసీఐ)- బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రా ములలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి అమర్ కంటక్లోని ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ సహకారం అందిస్తోంది. తిరుపతి, నోయిడా క్యాంపస్లు ఉన్నాయి. సీయూఈటీ(యూజీ/పీజీ) స్కోర్ లేదా సంస్థ నిర్వహించే ఎంట్రెన్స్ ఎగ్జామినే షన్ స్కోర్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. వయోపరిమితి నిబంధనలు లేవు. ఎంపికైన అభ్య ర్థులకు చెఫ్, కిచెన్ మేనేజ్మెంట్- కలినరీ స్పెషలిస్ట్లుగా రాణించేందుకు అవసర మైన స్కిల్స్ నేర్పిస్తారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లోని రెస్టారెంట్లలో ఆహారాన్ని తయారు చేసే పద్ధతులు, వాటి నిల్వ, ప్రమాణాలకు అనుగు ణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. ఆంగ్ల మాధ్య మంలో బోధన ఉంటుంది. వెజిటేరియన్ ప్రాక్టికల్ ఆప్షన్ కూడా ఉంది.

బీబీఎ (కలినరీ ఆర్ట్స్) :

ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు ఇందులో ఆరు సెమిస్టర్లు ఉంటాయి. తిరుపతి, నోయిడా క్యాంపస్లలో ఒక్కోదానిలో 120 సీట్లు ఉన్నాయి:

• కోర్సు వివరాలు: ఈ ప్రోగ్రామ్లో 61 మాడ్యూల్స్ ఉంటాయి. వీటికి మొత్తం 152 క్రెడిట్స్ నిర్దేశించారు. క్లాస్ రూం టీచింగ్, ప్రాక్టికల్ టీమింగ్ ఇంటర్న్షిప్ , వైనావోస్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ ఉంటాయి.

• అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 15 శాతం మార్కులతో ఇంటర్/పన్నెండోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసినవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. వీరు 2024 సెప్టెంబరు 30 నాటికి మార్కుల పత్రాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 

ఎంపిక: సీయూఈటీ(యూజీ) 2024 స్కోర్ లేదా సంస్థ నిర్వ హించే ఐజీఎన్టీయూ-ఐసీఐ జేఈఈ(యూజీ) 2024 స్కోర్, డాక్యుమెంట్స్ వెరి ఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎంబీఏ (కలినరీ ఆర్ట్స్):

ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. ఇందులో నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. తిరుపతి, నోయిడా క్యాంపస్ లలో ఒక్కోదానిలో 30 సీట్లు ఉన్నాయి.

• కోర్సు వివరాలు: ఇందులో 24 మాడ్యూల్స్ ఉంటాయి. వీటికి మొత్తం 82 క్రెడిట్స్ నిర్దేశించారు. థియరీ క్లాసెస్, ప్రాక్టికల్ క్లాసెస్, అసైన్మెంట్లు, ప్రజంటేషన్లు, ప్రాజెక్ట్ వర్క్స్ు, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఎక్స్టెర్నల్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ ఉంటాయి.

• అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి కనీసం 45 శాతం మార్కులతో ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దివ్యాంగులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్న ద్దమౌతున్నవారు కూడా అప్లయ్ చేసుకో వచ్చు.

• ఎంపిక: సీయూఈటీ (పీజీ) 2024 స్కోర్ లేదా సంస్థ నిర్వహించే ఐజీఎన్టీయూ ఐసీఐ జేఈఈ (పేజీ) 2024 స్కోర్, డాక్యుమెంట్స్ వెరిఫికే షన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఉద్యోగావకాశాలు:

ప్రముఖ హోటళ్లు, ఆతిథ్య రంగ సంస్థల్లో చెస్లుగా రాణించే వీలుంది ఫ్లయిట్ కిచె న్స్లో, ఇండియన్ నేవీ ఆతిథ్య విభాగాల్లో, పిప్పింగ్ క్రూయిజ్ సంస్థల్లో, రైల్వే కేట రింగ్ సర్వీస్లో, దేశ విదేశాల్లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కిచెన్ మేనేజ్మెంట్ ఎగ్జి క్యూటివ్లుగా పనిచేయవచ్చు. ఐసీఐ సహా హోటల్ మేనేజ్ మెంట్, ఫుడ్ క్రాఫ్ట్ సంస్థల్లో ప్యాకల్టీలుగా చేరవచ్చు. స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లు నిర్వహించే హోటళ్లు, గెస్ట్ హౌస్లలో కిచెన్ మేనేజ్మెంట్ బాధ్యతలు నిర్వహిం చవచ్చు. స్వయం ఉపాధి కింద సొంతంగా రాణించే అవకాశం ఉంటుంది. 155 బ్లాగర్, ఫుడ్ అనలిస్ట్లుగా రాణించవచ్చు. ఫుడ్ బేస్డ్ స్టార్టప్ కంపెనీలలో మేనేజ్ మెంట్ ట్రెయినీలుగా ఉద్యోగాలు పొందే వీలుంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area