Type Here to Get Search Results !

ఇటివల సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం ( CTBT ) నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన దేశం ఏది ?

ఇటివల సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం ( CTBT ) నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన దేశం ఏది ?



జవాబు: రష్యా

🔥వివరణ:

👉 సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం (సీఎన్టీబీటీ) నుంచి రష్యా వైదొలగింది. ఈ ఒప్పందం నుంచి రష్యా వైదొలగుతుందని తెలుపుతూ ప్రవేశపెట్టిన ఒక బిల్లుకు గత నెలలోనే ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తాజాగా 2/11/2023 (గురువారం) ఉదయం ఆ బిల్లుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేయడంతో అది చట్టంగా మారింది.

👉 దీంతో అధికారికంగా సీఎన్టీబీటీ నుంచి రష్యా వైదొలగినట్లు అయింది. గతంలోకి వెళితే. పుతిన్ అధ్యక్షుడైన ఆరు నెలల తర్వాత(2000 జూన్‌లో) సీఎన్టీబీటీ ఒప్పందంలోకి రష్యా చేరింది. మళ్లీ ఇప్పుడు పుతిన్ హయాంలోనే ఆ ఒప్పందం నుంచి రష్యా బయటికి రావడం గమనార్హం.

👉 ఈ ఒప్పందంపై అణుశక్తి కలిగిన దేశాలైన ఫ్రాన్స్, బ్రిటన్‌ సహా 178 దేశాలు సంతకం చేశాయి. అమెరికా, చైనా మాత్రం మొదటినుంచీ దీనిపై సంతకం చేసేందుకు ససేమిరా అంటున్నాయి.

👉 గతంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై వేసిన వాటి కంటే 24 రెట్లు పవర్ ఫుల్ అణుబాంబుల తయారీకి అమెరికా ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. ఈనేపథ్యంలో రష్యా కూడా తన అణుశక్తిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area