Type Here to Get Search Results !

ఐబీపీఎస్‌లో 1,402 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

ఐబీపీఎస్‌లో 1,402 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు



ఐటీ ఆఫీసర్, వ్యవసాయ క్షేత్ర అధికారి, రాజభాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ అధికారి త‌దిత‌ర స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 

ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి బీఈ, బీటెక్‌, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఎంఎస్‌, ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం క‌లిగి ఉండాలి. 

ఈ నోటిఫికేష‌న్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), కెనరా బ్యాంక్(Canara Bank), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ త‌దిత‌ర బ్యాంకుల‌లో 1,402 పోస్టుల‌ను భ‌ర్తీ చేయనున్నారు. 

ప్రిలిమ్స్ టెస్ట్, మెయిన్ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామ్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు: 1,402

పోస్టులు: ఐటీ ఆఫీసర్, వ్యవసాయ క్షేత్ర అధికారి, రాజభాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్.

అర్హ‌త‌లు: పోస్టుల‌ను బ‌ట్టి బీఈ, బీటెక్‌, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఎంఎస్‌, ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం క‌లిగి ఉండాలి.

వ‌య‌స్సు: 20-30 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక: ప్రిలిమ్స్ టెస్ట్, మెయిన్ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామ్‌, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.

పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ త‌దిత‌రాలు.

దరఖాస్తు రుసుము: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్.

దరఖాస్తుకు చివరితేది: ఆగ‌ష్టు 21

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: డిసెంబ‌ర్ 2023

వెబ్‌సైట్: https://www.ibps.in/ 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area