Type Here to Get Search Results !

పీజీఐఎంఈఆర్ లో బీఎస్సీ నర్సింగ్

 పీజీఐఎంఈఆర్ లో బీఎస్సీ నర్సింగ్



చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐ ఎంఈఆర్) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ (ఎన్ఐఎస్ఈ)-బీ ఎస్సీ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్) ప్రోగ్రామ్లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ ఎంట్రెన్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.

బీఎస్సీ నర్సింగ్ :

ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. దీనికి మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్లో 33 సీట్లు ఉన్నాయి. జనరల్ అభ్యర్థులకు 47, ఓబీసీ అభ్యర్థులకు 25, ఎస్సీలకు 14, ఎస్టీలకు 7 సీట్లు ప్రత్యేకించారు. ప్రవేశం పొందిన అభ్యర్థులకు కోర్సు పూర్తయ్యేవరకూ నెలకు రూ.500 స్టయి సెండ్ చెల్లి స్తారు.

గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా. ఇంటర్/పన్నెండోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. వీరు ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీకి పది రోజుల ముందు మార్కుల పత్రాలు సబ్మిట్ చేయాలి. అభ్యర్థుల వయసు సెప్టెం బరు 1 నాటికి 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్) :

ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. దీనికి పురుషులు, మహిళ లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్లో మొత్తం 62 సీట్లు ఉన్నాయి. జనరల్ అభ్యర్థులకు 22, ఓబీసీ 14, ఎస్సీలకు 7, ఎస్టీలకు 4 సీట్లు నిర్దేశించారు. అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/తత మాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు ద్వితీయ శ్రేణి మార్కు. లతో జనరల్ అండ్ మిడ్వైఫరీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి నర్సు/ మిడ్ వైఫ్గా గుర్తింపు పొంది ఉండాలి. పురుషులు సంబంధిత గుర్తింపుతోపాటు నర్సింగ్లో ప్రత్యేక శిక్షణ పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు సెప్టెం బరు 1 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

ఎంట్రెన్స్ టెస్ట్ వివరాలు :

• ఇందులో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్న లు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100, తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. ప్రశ్న పత్రాన్ని ఆంగ్ల మాధ్యమంలో ఇస్తారు. పరీక్ష సమయం గంటన్నర. ఈ టెస్ట్లో అర్హత పొందాలంటే కనీసం 50 శాతం మార్కులు రావాలి. ఓబీసీ, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్ధులకు 45 శాతం మార్కులు చాలు.

• బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి నిర్వ హించే ఎగ్జామ్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ సబ్జె క్టుల నుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు: ఇంగ్లీష్ నుంచి 15 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలన్నీ ఇంటర్/పన్నె డోతరగతి స్థాయిలోనే ఉంటాయి.

• బీఎస్సీ నర్సింగ్(పోస్ట్ బేసిక్) ప్రోగ్రామ్లో ప్రవేశా నికి నిర్వహించే ఎగ్జామ్లో సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఆప్ష యిడ్ ఇన్ నర్సింగ్, ప్రాక్టీస్ అండ్ ట్రెండ్స్ ఇన్ నర్సింగ్ నుంచి 10, మెడికల్ సర్జికల్ నర్సింగ్ అనా టమీ, ఫిజియాలజీ: సహా) నుంచి 20, చైల్డ్ హెల్త్ నర్సింగ్ నుంచి 15, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ (న్యూట్రిషన్ సహా) నుంచి 15, అప్సెట్రిక్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ నుంచి 15, మెంటల్ హెల్త్ నర్సింగ్. నుంచి 15, జనరల్ నాలెడ్జ్ నుంచి 10 ప్రశ్నలు అడు గుతారు. ప్రశ్నలను డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ సిలబస్ ఆధారంగా ఇస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1200

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30

కంప్యూటర్ బేస్ డ్ ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: ఆగస్టు 4

ఫలితాలు విడుదల: ఆగస్టు 12 

డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ : ఆగస్టు 21, 22

కౌన్సెలింగ్: ఆగస్టు 29

ప్రోగ్రామ్లు ప్రారంభం: సెప్టెంబరు 1

వెబ్సైట్: www.pgimer.edu.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area