‘పది’తో తెలంగాణ జిల్లా కోర్టుల్లో 1,226 ఉద్యోగాలు
NOTIFICATION No.06/2023, DATED 02-01-2023
FOR DIRECT RECRUITMENT TO THE POSTS OF OFFICE SUBORDINATE IN THE TELANGANA JUDICIAL MINISTERIAL AND SUBORDINATE SERVICE.
పదో తరగతి అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పలు జిల్లాల కోర్టుల్లో మొత్తంగా 1226 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు హైకోర్టు తెలిపింది.
తెలంగాణలోని జిల్లాల కోర్టుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో మొత్తం 1,226 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు జనవరి 11 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లను ఫిబ్రవరి 15 నుంచి డౌన్‌లోడ్ చేసుకొనేందుకు వీలుంటుందని తెలిపారు. పరీక్షను మార్చి నెలలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
అభ్యర్థులు ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉంటే ఈ పరీక్షకు అనర్హులని నోటిఫికేషన్‌లో స్పష్టంచేశారు. 2022 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొంది. ఈ ఉద్యోగంలో నెలకు వేతనం రూ.19వేలు నుంచి రూ.58,850వరకు చెల్లించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వూ తదితర అంశాల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.