Type Here to Get Search Results !

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలు



భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికే షన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గలఅభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించ దానికి చివరి తేదీ మార్చి 07.

ఖాళీలు: 120.

విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (డీఆర్) టెలికాం స్ట్రీమ్ 95, సీనియర్ ఎగ్జిక్యూటి వ్ ట్రైనీ (డీఆర్) ఫైనాన్స్ స్ట్రీమ్ 25,

ఎలిజిబిలిటీ

టెలికాం స్ట్రీమ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ లేదా సమాన ఇంజినీరింగ్ అర్హత కలిగి ఉండాలి.

ఫైనాన్స్ స్ట్రీమ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ పూర్తిచేసి ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా,

అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 05.

అప్లికేషన్ ఫీజు: అర్రిజర్వ్ / ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1250

లాస్ట్ డేట్: మార్చి 07,

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 వెబ్ సైట్: https://bsnl.co.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area