Type Here to Get Search Results !

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ



స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

ఖాళీలు: 2273 (సర్కిల్ బేస్డ్ ఆఫీసర్). హైదరాబాద్ పరిధిలో 80 ఖాళీలు ఉన్నాయి.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా ఇం టిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గు ర్తించిన ఏదైనా సమానమైన అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 29

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

లాస్ట్ డేట్ : ఫిబ్రవరి 18.

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ ఎగ్జామినేషన్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వెబ్ సైట్: sbi.bank.in/web/careers/current-openings

ఆన్ లైన్ ఎగ్జామినేషన్: డిస్క్రిప్టివ్ రూపంలో ఆన్లైన్ ఎగ్జామ్లో ప్రశ్నలకు సమాధానాలు మల్టిపుల్ చాయిస్ రాయాల్సి ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ప్రశ్న లు 120 ఇస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్న లు, బ్యాంకింగ్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్/ఎకానమీ 30 ప్రశ్నలు, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు ఇస్తారు. డిస్క్రిప్టివ్ పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్ & ఎస్సే రాయాల్సి ఉంటుంది.

ఫైనల్ సెలెక్షన్: తుది మెరిట్ జాబితాను 75:25 వెయిటేజీతో తయారు చేస్తారు. ఆన్లైన్ టెస్టులో అభ్యర్థులు సాధించిన 170 మార్కులను 75 మా ర్కులకు, ఇంటర్వ్యూ స్కోర్ను 50 మార్కులను 25 మార్కులుగా మారుస్తారు.

👁️‍🗨️ DOWNLOAD ADVERTISEMENT

🔗 APPLY ONLINE

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area