సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్(ఎస్ఆర్ఎఫ్ఐ) లో పీజీ కోర్సులు
సినిమాలో విద్యకు సంబంధించి దేశంలోనే రెండో ప్రముఖ విద్యాసంస్థ సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్(ఎస్ఆర్ఎఫ్ఐ). 1995 ఏర్పాటైన ఈ సంస్థకు స్వతంత్రప్రతిపత్తి ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ పీజీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
▪️మూడేళ్ళ కాలవ్యవధి(ఒక ఏడాది బ్రిడ్జ్ ప్రోగ్రామ్తో కలిసి) కలిగిన మాస్టర్స్ట్ సినిమా కోర్సులో ఆరు స్పెషలై జేషన్లు - డైరెక్షన్ అండ్ స్క్రీన్ప్లే రైటింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్ రికార్డింగ్ అండ్ డిజైన్, ప్రొడ్యూసింగ్ ఫర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్, యానిమే షన్ సినిమా ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్లో 12 సీట్లు ఉన్నాయి.
▪️రెండేళ్ళ కాలవ్యవధి కలిగిన ఎలక్ట్రానిక్ అండ్ డిజి టల్ మీడియా(ఈడీఎం) మాస్టర్ఫ్ కోర్సులు కూడా ఆరు స్పెషైజేషన్లు- మేనేజ్మెంట్, రైటింగ్, డైరక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్లో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్లో 7 సీట్లు ఉన్నాయి.
ఇటానగర్ క్యాంపస్ లో కోర్సులు: దీని ప్రాస్పెక్టస్ వేరుగా విడుదలైంది. ఇక్కడ అందించే రెండేళ్ళ పీజీ డిప్లొమా కోర్సులు - స్క్రీన్ యాక్టింగ్(20 సీట్లు), స్క్రీన్రైటింగ్(20 సీట్లు), డాక్యుమెంటరీ సినిమా(10 సీట్లు) ఉన్నాయి.
ఎంపిక: మొదటి దశలో 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. జనరల్ అప్టిట్యూడ్, కామన్ సబ్జెక్ట్ ఏరియా నుంచి చెరి 50 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. రెండో దశలో 100 మార్కులకు అసెస్మెంట్- రాత/ ప్రాక్టికల్/ ఇంటరాక్షన్ టెస్ట్ ఉంటుంది. రాత, ప్రాక్టికల్ రెండూ కూడా ఉండొచ్చు.
అర్హత: ఏదైనా డిసిప్లిన్లో డిగ్రీ ఉత్తీర్ణత
రాత పరీక్ష: ఫిబ్రవరి 22(హైదరాబాద్ సహా దేశవ్యా ప్తంగా పలు నగరాల్లో జరుగుతుంది)
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 4
వెబ్ సైట్:
.jpeg)