ఇండియన్ నేవీలో ఎస్ఎస్సీ ఆఫీసర్స్
ఇండియన్ నేవల్ అకాడమీ(కేరళ రాష్ట్రం - ఎజిమల) 260 షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ ఎస్సీ) ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అవివాహితులైన మహిళలు, పురుషులు అర్హులు. ఎంపికైన వారికి 2027 జనవరి నుంచి శిక్షణ ఆరంభమవుతుంది.
పోస్టులు:
• ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్(జీఎస్(ఎక్స్)/ హైడ్రో కేడర్)-76,
• పైలట్ -25,
• నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్( అబ్జర్వర్స్) -20,
• ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ - 18,
• లాజి స్టిక్స్ - 10,
• ఎడ్యుకేషన్ - 15,
• ఇంజనీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) - 42,
• సబ్మెరైన్ టెక్ ఇంజనీరింగ్ - 08,
• ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) - 38,
• సబ్మెరైన్ టెక్ ఎలక్ట్రికల్ - 08
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత
ఎంపిక: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 24
వెబ్ సైట్: www.joinindiannavy.gov.in/
