Type Here to Get Search Results !

కార్పొరేట్ స్కిల్స్ : ఉద్వేగ నియంత్రణ - ఉద్యోగ అధిరోహణ..!

కార్పొరేట్ స్కిల్స్ : ఉద్వేగ నియంత్రణ - ఉద్యోగ అధిరోహణ..!



ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెరుగైన నైపుణ్యాలు ఉన్నవారే కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగం పొందగలుగుతున్నారు. వీరికి విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం బాగానే ఉంటున్నాయి. కానీ యువ ఉద్యోగుల్లో కొందరే కొలువులో విజయం సాధించి ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. ఎక్కువ మంది ఉద్యోగ బాధ్యతల్లో ఒత్తిడికి గురై, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నారు. ఫలితంగా కెరియర్ అర్ధాంతరంగా ముగుస్తోంది. అందువల్ల యువ ఉద్యోగులు 'ఉద్వేగ ప్రజ్ఞ' (ఎమోషనల్ ఇంటెలిజెన్స్)పై దృష్టి సారించాలి.

భావోద్వేగ నియంత్రణ

కాలేజీ సింబస్లో, కార్పొరేట్ సంస్థల శిక్షణలో భావోద్వేగాలకు తక్కువ ప్రాధాన్యమే దక్కుతోంది. ఉద్యోగ విధుల్లో విమర్శలు ఎదురైనప్పుడు, సహోద్యోగులతో విభేదాలు తలెత్తినప్పుడు లేదా అశించిన గుర్తింపు రానప్పుడు యువ ఉద్యోగులు త్వరగా నిరాశకు లేదా ఆగ్రహానికి లోనవుతున్నారు. విధుల్లో ఒత్తిడి ఎదురైనప్పుడు ఆలోచనలపై నియంత్రణ కోల్పోయి భావోద్వేగాలకు లోనవుతుంటారు. ఎంపిక చేసుకున్న ఉద్యోగి కేవలం పనిలో సమర్థుడైతే సరిపోదని, వినియోగదారులు, సహోద్యోగులతో హుందాగా ప్రవర్తించాలని యాజమాన్యాలు కోరుకుంటాయి. బావోద్వేగాల పై నియంత్రణ లోపించిన ఉద్యోగులు వృత్తిలో ఎదగలేకపోతున్నారు.

నియంత్రణ లోపిస్తే...

ప్రవీణ్ ఒక ఐటీ సంస్థలో డేటా అనలిస్టుగా చేరాడు. తక్కువ కాలంలోనే మంచి నైపుణ్యాలున్న ఉద్యోగిగా గుర్తింపు పొందాడు. ఒక డేటా అనాలిసిస్ కు సంబంధించి టీమ్ లీడర్కు నివేదిక పంపాను. అందులో లోపాలు ఉన్నాయని, పనితీరు ఇలాగే, కొనసాగితే ఉద్యోగంలో ఎదుగుదల ఉండదని టీమ్ లీడర్ మెయిల్ ద్వారా అతడికి సూచించారు. అప్పటికే, వ్యక్తిగత కారణాలతో మానసిక ఒత్తిడిలో ఉన్న అతడు ఆ మెయిల్ను విమర్శగా భావించి, భావోద్వేగానికి లోనయ్యాడు. తన అనాలిసిసన్ను తప్పుపట్టాల్సిన అవసరం లేదని, టీమ్ లీడర్ స్థాయిలో ఇలాంటి మెయిల్స్ పంపవద్దని హెచ్చరికతో కూడిన రిఫై పంపాడు. ఈ సమాధానం ఊహించని టీమ్ లీడర్ ప్రవీణ్ను బావోద్వేగాలు నియంత్రించుకోలేని ఉద్యోగిగా మదింపు వేడి, అతడికి కొత్త ప్రాజెక్టులు అప్పగించలేదు. ఈ మార్పును గమనించినప్పటికీ, నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడంతో క్రమంగా సంస్థలో అతడి అవసరం తగ్గింది. బావోద్వేగాలను నియంత్రించుకోలేక చివరికి ఉద్యోగానికి రాజీనామా. చేయాల్సి వచ్చింది.

రోజువారీ పనిలో జరిగే చిన్నచిన్న పొరపాట్లకు ఎలా స్పందించాలో తెలుసుకోవడం ఎంతో అవసరం. సీనియర్లు ఇచ్చే క్యాట్ను వ్యక్తిగత విమర్శగా తీసుకోవద్దు. పనితీరు మెరుగు పరుచుకునే సూచనగా స్వీకరించాలి. ఇలా చేస్తేనే యువ ఉద్యోగులు కార్పొరేట్ సంస్థలలో దీర్ఘకాలం మనుగడ సాగించగలరు.

పాజిటివ్ స్పందన

ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ట్రెయినీగా రవి వేరాడు. అతడు చేసిన ప్రజెంటేషన్లోని లోపాలపై టీమ్ లీడర్ అందరి సమక్షంలో విమర్శించారు. రవి విమర్శలను బావోద్వేగంతో కాకుండా, నిజాయతీగా విశ్లేషించుకున్నాడు. మీటింగ్ పూర్తయ్యాక టీమ్ లీడర్ను కలిసి, ఆ అభిప్రాయాలను సానుకూలంగా స్వీకరిస్తున్నానని చెప్పాడు. ఈ సూచనలు వృత్తిలో ఎదుగుదలకు దోహదపడతాయని తెలియజేసి, మరిన్ని సలహాలూ కోరాడు.

ఈ ఊహించని స్పందనతో అతడిపై టీమ్ లీడర్కు గౌరవం, అభిమానం పెరిగింది. మేనేజ్మెంట్ ముందు అతడిని భావోద్వేగాలు నియంత్రించుకుంటూ, విమర్శలను సానుకూలంగా తీసుకునే ఉద్యోగిగా ప్రాజెక్ట్ చేశారు. అదనంగా మెంటర్షిప్ అవకాశాలు కల్పించి, ఉన్నత స్థాయి శిక్షణకు సిఫారసు చేశారు. రవి బలమైన ఉద్యోగిగా ఎదిగి, తక్కువ వ్యవధిలోనే టీమ్ లీగర్ స్థాయికి చేరుకున్నాడు.

ఆవేశం అవరోధమే...

ప్రకాశ్ ఒక కార్పొరేట్ సంస్థలో మేనేజ్మెంట్ ట్రెయినీగా చేరాడు. టీమ్ లీడర్ అతడికి ఒక ప్రాజెక్ట్ అప్పగించారు. ప్రాజెక్ట్ విజయం సాదించాలంటే బృందంతో సమష్టిగా పని చేయాలి. కానీ విద్యార్థి దశలో ఒంటరిగా చదవడానికి అలవాటు పడ్డ ప్రకాశ్ సహోద్యోగుల సహాయం తీసుకోవడానికి సిద్ధపడలేదు. దీంతో ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన గడువు సమీపించే కొద్దీ, ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. ఒక సమావేశంలో అధికారులతో అగ్రహంగా మాట్లాడాడు. ఈ ప్రవర్తనను భావోద్వేగ నియంత్రణ లోపంగా పరిగణించి, యాజమాన్యానికి టీమ్ లీడర్ నివేదిక పంపారు. ఫలితంగా ప్రకాశు బృందం నుంచి తొలగించారు.

నాయకత్వానికి దారి

▪️లత ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసి, రసాయనాల తయారీ సంస్థలో నాణ్యత నియంత్రణ విభాగంలో ట్రెయినీగా చేరింది. మార్కెట్ నుంచి వచ్చిన సున్నితమైన పిర్యాదులను తక్కువ సమయంలో పరిష్కరించాల్సిన బాధ్యతను ఆమెకు టీమ్ లీడర్ అప్పగించారు. బృంద సభ్యులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ, వారి సహకారం లోపించినప్పటికీ, భావోద్వేగాలను ఆమె నియంత్రించుకుంది. సమస్యల పరిష్కారం పైనే దృష్టి సారించి, అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సామర్థ్యాన్ని గుర్తించిన టీమ్ లీడర్.. సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోగల ఉద్యోగిగా ఆమెను అభినందించారు. లత గురించి సానుకూల నివేదికను యాజమాన్యానికి పంపారు దీంతో తదుపరి ప్రాజెక్ట్కు ఆమెను టీమ్ లీడర్ గా నియమించారు.

▪️కార్పొరేట్ సంస్థలలో భావోద్వేగ పరిణతి చాలా ముఖ్యం. నైపుణ్యాల లోపంతో ఉద్యోగాలు కోల్పోయే వారికంటే, బావోద్వేగాలను నియంత్రించుకోలేని ఉద్యోగులు కెరియర్లో నష్టపోతున్నారు. పని ఒత్తిడిని భరించడం, విమర్శలను నిర్మాణాత్మకంగా స్వీకరించడం, అందరితో కలిసి పనిచేయడం లాంటి గుణాలను అలవర్చుకున్నప్పుడే యువ ఉద్యోగులు వృత్తిలో ఎదగగలరు. అందువల్ల కార్పొరేట్ సంస్థలలో కొలువు సంపాదించడమే. కాకుండా, అక్కడ ఎదగడానికి ఉద్వేగ ప్రజ్ఞను పెంపొందించుకోవడమూ ఎంతో ముఖ్యం.

- దొరైరాజ్.

సీనియర్ జనరల్ మేనేజర్, 

ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area