రేపటి ఇంజినీర్లకు ఏఐ రోడ్ మ్యాప్..!
చాలా మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఒక సబ్జెక్ట్ చూస్తారు. ఒక పేపర్ పూర్తయితే 'ఏఐ అయిపోయింది' అనుకుంటారు. కానీ పరిశ్రమ దృష్టిలో ఏఐ అంటే ఒక సామర్థ్యం. మనిషి ఆలోచించే విధానాన్ని వేగంగా, విస్తృతంగా, నిరంతరంగా అమలు చేయగల శక్తి. అందుకే సంస్థలు ఏనిలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి. విద్యార్థులు దీన్ని హైప్ కాకుండా, పరిశ్రమల్లో వ్యాపారానికి ఉపయోగపడే ఆలోచనా విధానంగా అర్థం చేసుకోవాలి.
కాలేజి తరగతి గదిలో ఏం అంటే నిర్వచనాలు, అల్గారిథమ్లు, పరీక్షలు. కానీ బోర్డు రూమ్లో ఏఐ అంటే నిర్ణయాలు, ప్రమాదాలు, బాధ్యత, ఉదాహరణకు మనం దైనందిన జీవితంలో విస్తృతంగా ఉపయోగిస్తోన్న గూగుల్ మ్యాప్స్ వారిని చూపే సాధనం కాదు. పరిస్థితులను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకునే ఒక తెలివైన వ్యవస్థ, గూగుల్ మ్యాప్స్ పరీక్షలు రాయడు, కానీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది ఎలా. సాధ్యమంటే.. గత డేటా నుంచి నేర్చుకోవడం, ప్రస్తుతం జరుగుతున్నదాన్ని గమనించడం, రాబోయేదాన్ని అంచనా వేయడం. ఇక్కడే తరగతి గది చదువుకు, పరిశ్రమలోని రియల్ టైమ్ ఉపయోగానికి మధ్య ఉన్న అసలు తేడా. కనిపిస్తుంది. ఉద్యోగ ఇంటర్వ్యూల్లో కూడా ఇదే గ్యాప్ బయటపడుతోంది. కాన్సెప్టు తెలుసు కానీ చాలా మంది ఇంజనీరింగ్ విద్యార్థులు వాటిని ఒక పూర్తి కథనంలా వివరించలేడు.
మైండ్ సెట్ ముఖ్యం
గణితంలో పట్టు లేకపోతే ఏఐలో రాణించలేమని అనుకోవద్దు. కోర్ ఏఐ పరిశోదన పాత్రలకు లోతైన గణితం అవసరం కానీ ఎక్కువ ఏఐ ఉద్యోగాలు అనువర్తిత స్వభావంలో ఉంటాయి. సమస్యను ఎలా నిర్వచిస్తున్నాం. తర్కబద్ధంగా ఎలా ఆలోచిస్తున్నాం. డేటాను ఎలా అర్థం చేసుకుంటున్నాం అన్నది ముఖ్యం. గణితం ఒక సాధనం మాత్రమే అసలు కీలకు మైండ్ సెట్, ఉద్యోగార్షిలో సంస్థలు గమనించేవి.. ఈ వ్యక్తి సరైన ప్రశ్నలు అడగగలడా? డేటాలో ఉన్న పరిమితులను గుర్తించగలడా? వ్యాపార సమస్యను సాంకేతిక సమస్యగా మార్చగలడా? ఇవే మీ ఉద్యోగాన్ని నిర్ణయిస్తాయి.
నిరంతర అధ్యయనంతోనే
ఏఐ నేర్చుకోవడం అంటే మారథాన్ లాంటిది. ఇంజినీరింగ్ విద్యార్థులు మొదటి సంవత్సరంలో కోడింగ్ లాజిక్, విశ్లేషణాత్మక ఆలోచన లాంటి లక్షణాలు పెంపొందించుకోవాలి. మధ్య సంవత్సరాల్లో ఏఐ కాన్సెప్టులపై అవగాహన తెచ్చుకోవాలి. చివరి సంవత్సరాల్లో ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్పుల ద్వారా రియల్ లైఫ్ సమస్యలపై పట్టు సాదించాలి. గూగుల్ మ్యాప్స్ ఒక్క రోజులో మేటి వేదికగా రూపొందలేదు. ఎన్నో ఏళ్లుగా నేర్చుకుంటూ, మారుతూ, ఎరుగుతూ వచ్చింది. ఇంజినీరింగ్ కెరియరూ అంతే.
అందరికీ అవకాశం
ఎక్కువ మంది ఏఐ కెరియర్ అంటే కోడింగ్ మాత్రమే అనుకుంటారు. లేదా కంప్యూటర్ సైన్స్ వాళ్లకే అవకాశం ఉందని భావిస్తారు. ఇది పూర్తిగా అపోహే. ఏఐ పరిసర వ్యవస్థ చాలా విస్తృతమైంది. డేటా ఇంజినీర్లు, మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్లు మాత్రమే కాదు.. ఏఐ విశ్లేషకులు, డొమైన్ నిపుణులు, కన్సల్టెంట్లు, సిస్టమ్ ఇంటిగ్రేటర్లు కూడా అవసరం. మెకానికల్, ఈసీఈ, సివిల్ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లూ ఏఐలో మంచి విజయాలు సాధిస్తున్నారు. చేస్తోన్న రంగానికి తెలివిని ఎలా జోడించాలో అర్ధం చేసుకుంటే చాలు, పరిశ్రమకు కావాల్సింది శుద్ధమైన కోడ్ కాదు. డొమైన్ పరిజ్ఞానం. ఏఐల కలయిక. పైతాన్, బూల్స్, ఫ్రేమ్ వర్కులు ఇవన్నీ ప్రవేశ ద్వారాలే.
ఆలోచన మీదైతేనే
ఈతరం విద్యార్థులకు జనరేటివ్ ఏఐ సాధనాలు నేర్చుకునే విధానాన్నే మార్చేశాయి. ఇవి ఒకవైపు అవకాశాలు, మరోవైపు ప్రమాదాలు సరైన విధంగా వాడితే ఇవి వ్యక్తిగత గురువుల్లా పనిచేస్తాయి. తప్పుగా ఉపయోగిస్తే మౌలిక అవగాహన బలహీనపడుతుంది. కాలిక్యులేటర్ ఉపయోగించడం వచ్చినప్పటికీ గణితం నేర్చుకోవాల్సిం కదా, అలాగే ఏఐ సాధనాలు వాడినా ఆలోచన మనదే ఉండాలి. అసైన్మెంట్లు కాపీ చేయడం కాదు. అవగాహన పెంచుకోవడం లక్ష్యం కావాలి. ఏఐపై అతిగా ఆధారపడటమూ. ప్రమాదమే, కానీ పరిష్కారం మాత్రం. ఏజని దూరం పెట్టడం కాదు. ఏఐతో బాధ్యతను పెంపొందించుకోవడం.
కొత్త కెరియర్లు
ఇప్పుడు మనం ఏఐ పరిణామంలో తర్వాతి దశ అయిన ఏజెంటిక్ ఏఐలోకి ప్రవేశిస్తున్నాం. ఒక లక్ష్యం ఇస్తే, దాన్ని సాధించడానికి అవసరమైన దశలను అదే నిర్ణయించుకుని చర్యలు తీసుకునే వ్యవస్థలు ఇవి, సంప్రదాయ ఆటోమేషన్ నియమాలను అనుసరిస్తే. ఏజెంటిక్ ఏఐ పరిస్థితిని అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటుంది. మనం ఇదే చూస్తున్నాం. ట్రాఫిక్ని గుర్తించడం, మార్గం మార్చడం, చేరుకునే సమయాన్ని నిరంతరం నవీకరించడం. భవిష్యత్తులో దీనివల్ల ఏఐ అర్కెస్టేషన్ పాత్రలు, ఏఐ సూపర్వైజర్లు, మనిషి- ఏఐ పరస్పర చర్య రూపకర్తల లాంటి కొత్త కెరియర్లు ఏర్పడతాయి.
కొలువులు పోవు
ఏఐ ఉద్యోగాలను తీసేస్తుందా? గూగుల్ మ్యాప్స్ డ్రైవర్లను తొలగించలేదు, దారి చూపే తెలివిని మెరుగుపరిచింది. అలాగే ఉద్యోగాలు మాయం కావు, మార్పు చెందుతాయి. భవిష్యత్తు ఇంజినీర్లు ఏఐతో కలిసి పనిచేసే వృత్తి నిపుణులుగా మారాలి. ఈ రోజు మీరు గూగుల్ మ్యాప్లను అనుసరిస్తున్నారు. రేపు ఇలాంటి మరెన్నో ఇంటెలిజెంట్ వేదికలని మీరు రూపకల్పన చేసే అవకాశం ఉందని కలలు కనండి కలలతోనే బాధ్యతలు మొదలవుతాయి. రోడ్లపై మొదలైన ఏఐ ప్రయాణం ఇప్పుడు. తరగతి గదులు, కోểస్లు, కెరియర్లలోకి ప్రవేశిస్తోంది. ఏఐ ప్రమాదం కాదు. అది ఒక అవకాశం. అయితే సర్వదా సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే అని గ్రహించాలి. ఏఐ యుగంలో భవిష్యత్తుకు సిద్ధమైన విద్యార్థులంతా చైనందిన జీవితంలో జిజ్ఞాస, ప్రశ్నించడం, నిరంతర అభ్యాసాన్ని భాగం చేసుకోవాలి. అదే నిజమైన రోడ్ మ్యాప్,
శ్రీనివాస రావు పేర్ల
డైరెక్టర్- టెక్నికల్ ట్రెయినింగ్
సైయంట్ లిమిటెడ్
.jpeg)