Type Here to Get Search Results !
🔥 Latest Jobs

సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రో వేవ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (సమీర్) లో ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులు

సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రో వేవ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (సమీర్) లో 147 ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులు



భారత ప్రభుత్వ రంగ సంస్థ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ముంబయిలోని సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ (సమీర్) ఒప్పంద ప్రాతిపదికన 147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 147

» పోస్టుల వివరాలు: ప్రాజెక్టు ఇంజనీర్-71, ప్రాజెక్టు అసోసియేట్-05, ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్-34, ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ (ఏ అండ్ బీ): 37.

» విభాగాలు: ఆర్ఎఫ్ అండ్ ఎండబ్ల్యూ, ఎలక్ట్రానిక్స్, సీఎస్/ఐటీ, సేఫ్టీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ హెచ్పీఏసీ, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, అట్మాస్ఫియరిక్ సైన్స్, మెడికల్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్ తదితరాలు.

» అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత ఉండాలి.

» వేతనం: నెలకు ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్టు అసోసియేట్ పోస్టులకు రూ.34,000; ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.23,500; ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ - ఏకు రూ.21,000; ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ ໖ 5.23,500.

» వయసు: ప్రాజెక్టు ఇంజనీర్, ప్రాజెక్టు అసోసియేట్ పోస్టులకు 28ఏళ్లు, ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్, ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ ఏకు 25ఏళ్లు, ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్కు 28 ఏళ్లు మించరాదు.

» ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాత పరీక్ష/స్కిల్/ఇంటర్వ్యూ తదితరాల ఆధారం గా ఎంపిక చేస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.01.2026

» వెబ్సైట్: https://recruitment.sameer.gov.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area