నాబార్డ్‌లో 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్.
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. నాబార్డ్‌లో 159 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ల ఖాళీలు ఉన్నాయి. వీరిని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో నియమిస్తారు. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ల (హిందీ) కోసం మూడు ఖాళీలు ఉన్నాయి. మెుత్తం 162 పోస్టులు. ఈ నియామకాలు స్పెషలైజేషన్ ఆధారంగా ఉంటాయి. ఈ నియామకం గ్రూప్ బీ స్థాయిలో ఉంటుంది. ఎంపికైన యువతకు గ్రామీణ భారతదేశ అభివృద్ధికి, బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన పరిపాలనా పనులకు దోహదపడే అవకాశం వస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 8 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PWD, మాజీ సైనికులకు, ఉత్తీర్ణత మాత్రమే చాలు. డెవలప్‌మెంట్ అసిస్టెంట్(హిందీ) పోస్టులకు అభ్యర్థులు హిందీ, ఇంగ్లీష్‌ను ప్రాథమిక సబ్జెక్టులుగా లేదా గ్రాడ్యుయేషన్‌లో బోధనా మాధ్యమంగా కలిగి ఉండాలి. ఇంగ్లీష్- హిందీ ట్రాన్సలేషన్ చేయగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 21 నుండి 35 సంవత్సరాలుగా ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి రూ.550, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల, మాజీ సైనికులకు రూ.100గా అప్లికేషన్ ఫీజు నిర్ణయించారు.
జీతం: నెలకు రూ.46,500.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష(ఆన్‌లైన్), లాంగ్వేజ్ ప్రొఫిషఇయన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 17.01.2026.
దరఖాస్తు చివరి తేదీ: 03-02-2026
ప్రిలిమినరీ పరీక్ష: 21.02.2026
మెయిన్ పరీక్ష: 12.04.2026
వెబ్‌సైట్: https://www.nabard.org
