Type Here to Get Search Results !

జేఈఈ అడ్వాన్స్డ్ లో జయం ఇలా..!

 జేఈఈ అడ్వాన్స్డ్ లో జయం ఇలా..!



జేఈఈ అడ్వాన్స్డ్... దేశంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) క్యాంప సీలలో.. బీటెక్/బీఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వ హించే పరీక్ష. ఐఐటీల్లో సీటు సొంతం చేసుకో వాలని, భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవా లని లక్షల మంది కలలు కంటారు. ఇందుకోసం రెండుమూడేళ్లుగా తదేక దీక్షతో ప్రిపరేషన్ సాగి స్తున్నారు. తాజాగా జేఈఈ అడ్వాన్స్డ్ 2026కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో... జేఈఈ అడ్వాన్స్డ్ నోటిఫికేషన్ వివరాలు, అర్హ తలు, పరీక్ష ప్యాట్రన్, సిలబస్ అంశాలు, విజేతగా నిలిచేందుకు ప్రిపరేషన్ తదితర వివరాలు...

» జేఈఈ అడ్వాన్స్డ్ 2026 నోటిఫికేషన్ విడుదల

» 2026 మే 17న పరీక్ష 

» మెయిన్ స్కోర్ ఆధారంగా అడ్వాన్స్కు అర్హత

» అడ్వాన్స్డ్ ర్యాంకుతో 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశం


• మే 17న అడ్వాన్స్డ్

అడ్వాన్స్డ్ పరీక్షను మే 27న జాతీయ స్థాయిలో నిర్వహించనున్నారు. ఒకే రోజు రెండు పేపర్లు ఉం టాయి. పేపర్-1 ఉదయం, పేపర్-2 మధ్యాహ్నం ఉంటుంది.

• సిలబస్ యథాతథం

జేఈఈ అడ్వాన్స్డ్ 2028 సిలబస్ గత ఏడాది మాదిరిగానే యథాతథంగా ఉంటుందని పేర్కొ న్నారు. దీనివల్ల విద్యార్థులకు ప్రిపరేషన్ పరంగా కొంత ఒత్తిడి తగ్గుతుందని చెప్పాచ్చు. గత ఏడాది సిలబస్ ను పరిశీలిస్తూ.. మోడల్ కొశ్చనన్ను సాధన చేస్తే.. పరీక్ష నాటికి పూర్తి సన్నద్ధత పాండే అవ కాశం ఉంటుంది.

• అర్హతలు

• 2025లో 10+2/ఇంటర్మీడియెట్ (ఎంపీసీ ఉత్తీ ర్థులు) లేదా 2028లో ద్వితీయ సంవత్సరం పరీ క్షలకు హాజరవుతున్న అభ్యర్థులు జేఈఈ అడ్వా న్స్ డ్కు అర్హులు.

• వయసు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు అక్టోబర్ 1, 2001 తర్వాత, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్య ర్థులు అక్టోబర్ 1, 1996 తర్వాత జన్మించి ఉండాలి.

• వరుసగా రెండుసార్లు మాత్రమే జేఈఈ అడ్వా న్స్డ్కు హాజరయ్యే అవకాశం ఉంటుంది.

• మెయిన్ నుంచి 2.5 లక్షల మంది

ఐఐటీల్లో ప్రవేశానికి ప్రత్యేకంగా నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్షకు.... జేఈఈ మెయిన్ ఉత్తీర్ణు లైన టాప్ 2.5 లక్షల మందిని ఎంపిక చేస్తారు. అదే విధంగా సీట్ల కేటాయింపులో అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణ తతో పాటు బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్లో నిలవాలనే నిబంధనను కూడా కొనసాగించను న్నారు.

• రెండు పేపర్లుగా పరీక్ష

• అడ్వాన్స్డ్ -2026 పరీక్షను రెండు పేపర్లుగా(పే పర్-1, పేపర్-2)గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు.

• పేపర్-1, 2లలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్త్రీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పేప ర్లో మూడు సెక్షన్లు (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉంటాయి.

• రెండు పేవర్ల(పేపర్1, 2)కు హాజరవడం తప్ప

• ప్రతి పేపరు పరీక్ష సమయం మూడు గంటలు.

• గత ఏడాది ప్రతి పేపర్కు 180 మార్కులు చొప్పున మొత్తం 360 మార్కులకు ఈ పరీక్ష జరి గింది. ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా ఉం టుందని అంచనా,

• మరికొన్ని ఇన్స్టిట్యూట్స్లో

జేఈఈ అడ్వాన్స్ ర్యాంకుతో ఐఐటీలతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగ ళూరు ఐఐఎస్ఈఆర్ క్యాంపస్లు (బెర్హంపూర్, భోపాల్, కోల్కతా, మొహాలీ, పుణె, తిరువనంత పురం, తిరుపతి), ఐఐఎస్టి టీ తిరువనంతపురం, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ(రాయ్బరేలీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(విశాఖపట్నం)ల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది.

ప్రిపరేషన్ పక్కాగా

అడ్వాన్స్డ్ అభ్యర్థులు.. బోర్డ్ పరీక్షలు ముగిసిన తర్వాత మెయిన్ కు అదనంగా ఉన్న అంశాల రివిజ న కు సమయం కేటాయించాలి. ముందు నుంచే ని ర్దిష్ట వ్యూహంతో ప్రిపరేషన్ సాగించాలి. తద్వారా మెయిన్ తర్వాత లభించే సమయంలో ప్రిపరేషన్ ఒత్తిడిని సులువుగా అధిగమించొచ్చు. ఆడ్వాన్స్డ్ సిలబస్ ను ఆధారంగా చేసుకుని ప్రిపరేషన్ సాగిస్తే.. ఒకే సమయంలో ఆటు మెయిన్, ఇటు అడ్వాన్స్డ్.. ఇలా రెండు పరీక్షలకు సన్నద్ధత పూర్తవుతుంది.

మ్యాథమెటిక్స్

పరీక్షలో ఎంతో కీలకంగా భావించే ఈ సబ్జెక్ట్ రాణించడానికి కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అం డ్ డిటర్మినెంట్స్పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. దీంతో పాటు 3డి జామెట్రీ, కో ఆర్డినేట్ జామెట్రీ. వెక్టార్ ఆల్జీబ్రా, ఇంటిగ్రేషన్, కాంప్లెక్స్ నెంబర్స్, పారా బోలా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వే షన్స్, పెర్యుటేషన్ అండ్ కాంబినేషన్, బైనామి యల్ థీరమ్, లోకస్ అంశాలపై పూర్తి స్థాయి పట్టు సాధించాలి. ఆయా టాపిక్స్ ను ప్రాక్టీస్ చేస్తూ ప్రిప రేషన్ సాగించాలి.

ఫిజిక్స్

న్యూమరికల్ టైప్ కొశ్చన్స్ కూడా ఉండే ఈ విభాగంలో స్కోర్ కోసం ఎలక్ట్రో డైనమిక్స్, మెకా నిక్స్, హీట్ అండ్ థర్మో డైనమిక్కు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటితోపాటు మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎన్హెచ్ఎం అండ్ వేవ్స్్స్పనా దృష్టిపెట్టాలి. అదే విధంగా సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్, సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ప్రింగ్ వేల్స్లో లోతైన అవగాహన పెంచుకో వాలి. ఇందులో ప్రశ్నలు క్లిష్టంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనన్ని గత ప్రశ్నలు, మోడల్ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.

కెమిస్ట్రీ

అభ్యర్థులు కొంత సులభంగా భావించే సబ్జెక్ట్ కెమిస్ట్రీ. ఇందులో మంచి మార్కుల కోసం కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్, ఆల్కహారల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌడ్స్, ఆటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, దర్మొడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటితోపాటు మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్ ఎలిమెం ట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డి హైడ్స్ అండ్ కీబోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ పై పట్టు సాధించాలి.

అన్వయ దృక్పథం

అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో అప్లికేషన్ ఓరియెంటేషన్ను అనుసరించాలి. కాన్సెప్ట్ లపై పట్టుపెంచుకోవాలి. వాస్తవ పరిస్థితుల్లో అన్వయం చేసే దృక్పథం అలవరచుకోవాలి. ఇలా చేయడం ద్వారా పరీక్షలో అడిగే మల్టిపుల్ సెలక్డ్ కొశ్చన్స్, మ్యాచింగ్ టైప్ కొశ్చన్స్ వంటి వాటికి సులభంగా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.

బోర్డ్ పరీక్షలు, మెయిన్తో సమన్వయం

• విద్యార్థులు బోర్డ్ పరీక్షలు, జేఈఈ- మెయిన్ పరీ క్షతో సమన్వయం చేసుకుంటూ ఆడ్వాన్స్డ్ దిశ గా అడుగులు వేయాలి. మెయిన్ తొలి సెషన్కు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా మెయిన్ ఎగ్జామ్ అంశాలపైనే పూర్తిగా దృష్టి పెట్టాలి. ఆ తర్వాత బోర్డ్ పరీక్షలకు సమయం కేటాయిం చాలి. బోర్డ్ పరీక్షలు ముగిసిన తర్వాత అడ్వాన్స్ డ్ కు పూర్తి స్థాయి సమయం కేటాయించాలి.

• జేఈఈ-మెయిన్ రెండో సెషన్కు హాజరయ్యే అభ్యర్థులు అడ్వాన్స్డ్ సిలబస్ ను పరిగణనలోకి తీసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి.

• జేఈఈ-మెయిన్ రెండో సెషన్, బోర్డ్ పరీక్షలు పూర్తయిన తర్వాత అధిక శాతం సమయాన్ని ఆడ్వాన్స్డ్ రివిజన్కు కేటాయించాలి.

• అప్పటికే తాము పూర్తి చేసుకున్న అంశాలను పునశ్చరణ చేసుకుంటూ వాటికి సంబంధించి ప్రాక్టీస్ కొశ్చన్స్, ప్రీవియస్ కొశ్చన్సు సాధన చేయాలి.

• ప్రతి వారం వీక్లీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లకు హాజ రవుతూ లోటుపాట్లు సరిచూసుకుని వాటిని సరి దిద్దుకోవాలి.

• మెయిన్ రెండో సెషన్ తర్వాత ఆడ్వాన్స్డ్ ప్రిపరే షన్ సమయంలో కొత్త అంశాలను చదవడం కం టే అప్పటికే పట్టు సాధించిన వాటిపై మరింత లోతైన అవగాహన పొందేలా వ్యవహరించాలి.

• ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రాసుకునే విధానం అలవర్చుకోవాలి. ఫలితంగా రివిజన్ విషయంలో సమయం ఆదా చేసుకోవచ్చు.

ముఖ్య సమాచారం

• దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

• దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2026, ఏప్రిల్ 23

• దరఖాస్తులకు చివరి తేది: 2028, మే 12

• అడ్మిట్కార్డుల డౌన్లోడ్: 2028, మే 11-17

• సీబీటీ పరీక్ష తేది: 17.05.2026.

• వెబ్ సైట్: https://jeeadv.ac.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area