Type Here to Get Search Results !
🔥 Latest Jobs

సివిల్స్ ప్రిలిమ్స్- 2026 సన్నద్ధతతో సక్సెస్ దిశగా

  సివిల్స్ ప్రిలిమ్స్- 2026 సన్నద్ధతతో సక్సెస్ దిశగా



» మరికొద్ది రోజుల్లో సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్

» ఈ నెల 14నే విడుదల కావల్సిన నోటిఫికేషన్ వాయిదా

» పరీక్ష తేదీ కూడా వాయిదా పడే అవకాశం

» సుదీర్ఘ, స్పష్టమైన ప్రణాళికతోనే సత్ఫలితం

సివిల్స్ ప్రిలిమ్స్-2026 నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్. ఐఎఫ్ఎస్ సహా దాదాపు 20 కేంద్ర సర్వీసుల్లోకి అభ్యర్థుల ఎంపికకు నిర్వహించే ప్రక్రియ ఇది. సాధారణంగా సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ వాయిదా పడదు. కాని ఈసారి ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వాయిదా పడింది. ఈ నెల 14నే విడుదల కావల్సిన నోటిఫికేషన్ పరిపాలన కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు నిర్వాహక సంస్థ.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటించింది. మరికొద్ది రోజు ల్లోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. సివిల్స్-2026 ప్రిలిమ్స్ పరీక్ష విధానం, ఇందులో రాణించేందుకు ప్రిపరేషన్ తదితర వివరాలు...

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. దాదాపు ఏడాది కిపైగా సాగే మూడంచెల ఎంపిక ప్రక్రియ. ఇం దులో విజయానికి మూడు నుంచి ఐదేళ్లపాటు తదేక దీక్షతో ప్రిపరేషన్ సాగిస్తుంటారు. అయితే స్పష్టమైన ప్రణాళికతో, పరీక్ష తీరుపై అవగాహ నతో తొలిదశలోనే విజయం సాధించొచ్చనేది నీవు ణులు, గత విజేతల అభిప్రాయం.

సామర్థ్య స్థాయిపై అంచనా

సివిల్స్ అభ్యర్ధులు ముందుగా తమ వ్యక్తిగత సామర్థ్య స్థాయిని అంచనా వేసుకోవాలి. అకడమి క్ గా తమకున్న నైపుణ్యాలు, బలాలు, బలహీనత లు, సివిల్స్ ప్రిపరేషన్ పరంగా అనుసరించాల్సిన టైం మేనేజ్మెంట్ తదితర అంశాలపై స్పష్టత ఏర్ప రచుకోవాలి, వ్యక్తిగత సామర్థ్యంపై అవగాహనతో ప్రిపరేషను ఉపక్రమించాలి. పరీక్ష విధానానికి సం బంధించి.. సిలబస్ విశ్లేషణ, వాటిపై పట్టు సాధిం చేందుకు అందుబాటులో ఉన్న వనరులు (మెటీరి యల్, ఇతర అభ్యసన సదుపాయాలు) సేకరించు కోవాలి.

ఆప్షనల్ పై అవగాహన

ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్రారంభించే ముందే.. మెయిన్స్ ఎంపిక చేసుకోవాల్సిన ఆప్షనల్పైనా స్పష్టత ఏర్పరచుకోవాలి. ఫలితంగా ఇది ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమయంలో కలిసొస్తుంది. కొన్ని అప్షనల్ పేపర్ల విషయంలో(పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రే షన్, ఎకనామిక్స్, సోషియాలజీ) ప్రిలిమ్స్, మెయి న్స్ ఉమ్మడి ప్రిపరేషన్కు అవకాశం ఉంటుంది.

నిర్దిష్ట ప్రణాళిక

సివిల్స్ ప్రిపరేషన్లో నిర్దిష్ట ప్రణాళికను అనుస రించాలి. పటిష్టమైన సమయ ప్రణాళిక రూపాం దించుకోవాలి. ఉద్యోగం చేస్తూ ప్రిపేరవ్వాలనుకునే వారు తమ పని వేళలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. రోజుకు కనీసం ఆరు నుంచి 8 గంటలు ప్రిపరేషన్కు కేటాయించగలగాలి.

సిలబస్ పరిశీలన

సివిల్స్ లక్ష్యాన్ని గట్టిగా నిర్దేశించుకున్న అభ్య ర్థులు ముందుగా సిలబస్ ఆసాంతం పరిశీలిం చాలి. దానికి అనుగుణంగా తమకు అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్న అంశాలు/ పేపర్లను వేర్వేరుగా ఒక జాబితాలో రూపొందించుకోవాలి. ప్రతికూలం గా భావిస్తున్న అంశాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. వీలైతే శిక్షణ తీసుకోవడం కొంతమేలు చేస్తుంది. అదే సమయంలో వ్యక్తిగతంగానూ సదరు పేపర్/సబ్జెక్ట్ల రాణించేందుకు అవసర మైన, అందుబాటులో ఉన్న సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్న వినియోగించుకోవాలి. ప్రస్తుత నెట్ యుగంలో ప్రతి అంశానికి సంబం ధించిన సమాచారం ఒక్క క్లిక్తో కళ్ల ముందు ప్రత్య క్షమవుతోంది.

గత పరీక్షల విశ్లేషణ

ప్రిపరేషన్ పరంగా గత ప్రశ్న పత్రాల విశ్లేషణ ఎంతో మేలు చేస్తుంది. కనీసం నాలుగైదు ప్రీవి యస్ కొశ్చన్ పేపర్లను పరిశీలించాలి. దీని ఆధారం గా పరీక్షలో ఆడుగుతున్న ప్రశ్నల తీరు, ఆయా ఆం శాలకు లభిస్తున్న వెయిటేజీపై అవగాహన ఏర్పడు తుంది. దీనికి అనుగుణంగా తాము ప్రత్యేకంగా దృ ష్టి పెట్టాల్సిన అంశాలను గుర్తించొచ్చు.

మెటీరియల్ సేకరణ

సిలబస్, గత ప్రశ్న పత్రాల ఆధారంగా పరీక్ష తీరుతెన్నులపై అవగాహన పొందిన తర్వాత మెటీ రియల్ సేకరణపై దృష్టి పెట్టాలి. ఆయా పేపర్లు/స బ్జెక్ట్లకు సంబంధించి ప్రామాణిక మెటీరియల్ను సేకరించుకోవాలి. ఒక్కో సబ్జెక్ట్కు కనీసం రెండు పుస్తకాలు చదివే ప్రయత్నం చేయాలి. ఈ విషయం లో చాలా మంది అభ్యర్థులు చేసే పొరపాటు.. ఒకే సబ్జెక్ట్/పేపరకు సంబంధించి నాలుగైదు పుస్తకాలు సేకరించుకోవడం. కానీ ఇది సరైంది కాదనేది నిపు ణుల అభిప్రాయం. సిలబస్ పరంగా అన్ని అం శాలు పొందుపర్చిన ఒకట్రెండు ప్రామాణిక పుస్త కాలు చదివితే సరిపోతుందని నిపుణులు, గత టాపర్స్ చెబుతున్నారు.

ముఖ్యమైన అంశాలు

పూర్తి స్థాయి ప్రిపరేషన్ ప్రారంభించిన అభ్య ర్థులు ముందుగా పరీక్ష కోణంలో ముఖ్యమైన, అదే విధంగా తమకు క్లిష్టమైన అంశాలపై పట్టు సాధిం చేలా కృషి చేయాలి. అయితే ఇతర సబ్జెక్ట్లు/పేప ర్లను విస్మరించకుండా.. ఇదే సమయంలో వాటి ప్రిపరేషన్కు కూడా సమయం వెచ్చించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి, క్లిష్టమైన, ముఖ్య మైన అంశాల కోసం కొంత ఎక్కువ సమయం కేటాయించాలి. అంతేకాని మిగతా సబ్జెక్ట్లను విస్టు రించి వీటి కోసమే పూర్తి సమయం వెచ్చించడం సరికాదు.

అనుసంధానంతో ముందుకు

ప్రిలిమ్స్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు ఆను సంధాన దృక్పథాన్ని అనుసరించాలి. సిలబస్లో పోలిక ఉన్న సబ్జెక్లను అనుసంధానం చేసుకుం టూ ముందుకు సాగాలి. జాగ్రఫీ- ఎకానమీ, పాలి టీ-ఎకానమీ, కరెంట్ అఫైర్స్-ఎకానమీ, పాలిటీ అంశాల విషయంలో ఈ అప్రోచ్ ఎంతో కలిసొస్తుం ది. ఫలితంగా సమయం కూడా ఆదా అవుతుంది. ఒకే సమయంలో రెండు సబ్జెక్ట్లపై అవగాహన పొందే అవకాశం లభిస్తుంది.

కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యంగా

ఇటీవల కాలంలో ప్రిలిమ్స్ ప్రశ్న పత్రాలను పరి శీలిస్తే కరెంట్ అఫైర్స్కు ప్రాధాన్యం పెరుగుతోంది. కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్ ను నిరంతరం ఫాలో అవ్వాలి.

విశ్లేషణాత్మక అధ్యయనం

ప్రిలిమ్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహిస్తు న్నప్పటికీ.. అభ్యర్ధులు మాత్రం విశ్లేషణాత్మక దృ క్పథంతో అధ్యయనం సాగించాలి. ఫలితంగా అభ్యర్ధులకు మెయిన్స్ పరీక్ష కోణంలో అవసరమైన డిస్క్రిప్టివ్ అప్రోచ్ అలవడుతుంది.

ప్రాక్టీస్ చేసుకుంటూ

సివిల్స్ ప్రిపరేషన్లో.. ఆధ్యయనంతోపాటు ప్రాక్టీస్ కూడా ముఖ్యమే అని గుర్తించాలి. సదరు సబ్జెక్ట్లోని ముఖ్యాంశాలను నోట్స్ రూపంలో పాం దుపరచుకోవాలి. ఇది రివిజన్ సమయంలో ఎంతో ఉపకరిస్తుంది.

ప్రిలిమ్స్+మెయిన్స్

సివిల్స్ అభ్యర్ధులు ప్రిలిమ్స్, మెయిన్స్ సిలబస్ అంశాలను ఒకే సమయంలో చదివే వ్యూహం అను సరించాలి. దాదాపు 70 శాతం సిలబస్ అంశాలు సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ ఉమ్మ డిగా ఉన్నాయి. వీటిని ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమయంలోనే విశ్లేషణాత్మక దృక్పథంతో చదివితే.. మెయిన్స్కు కూడా సన్నద్ధత లభిస్తుంది. అయితే ప్రిలిమ్స్ క్స నెల రోజుల ముందు నుంచి మాత్రం పూర్తిగా ప్రిలిమ్స్్స్క సమయం కేటాయించాలి.

చివరి నెల రోజులు రివిజన్

ప్రిలిమ్స్ పరీక్షకు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్కే సమయం కేటాయించాలి. ఈ వ్యవధిలో కొత్త అంశాలను చదవాలనుకోవడం, అందుకోసం కసరత్తు చేయడం వల్ల లభించే అద నపు ప్రయోజనం అంతంతమాత్రమే. దీనికి బదు లుగా రివిజన్కు సమయం కేటాయించడం వల్ల అప్పటి వరకు తాము చదివిన అంశాల్లో మరింత పట్టు సాధించే అవకాశం ఉంటుంది.

సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష విధానం (UPSC Civil Services Preliminary Exam):

పేపర్–1: జనరల్ స్టడీస్ (GS)

ప్రశ్నలు: 100

మార్కులు: 200

ప్రతి ప్రశ్న: 2 మార్కులు

నెగటివ్ మార్కింగ్: ⅓ (0.66)

పేపర్–2: CSAT / ఆప్టిట్యూడ్ టెస్ట్

ప్రశ్నలు: 80

మార్కులు: 200

ప్రతి ప్రశ్న: 2.5 మార్కులు

నెగటివ్ మార్కింగ్: ⅓ (0.83)

క్వాలిఫైయింగ్ పేపర్: (కనీసం 33% అవసరం)

మొత్తం మార్కులు: 400

ఒక్కో పేపర్కు లభించే సమయం: రెండు గంటలు

కనీస అర్హత మార్కులు: పేపర్-2లో 33 శాతం మార్కులతో ఉత్తీర్ణత. పేపర్-1 కనీస అర్హత మార్కులను యూపీఎస్ సీ నిర్దేశిస్తుంది. వీటి ఆధారంగా అభ్యర్థులను మెయిన్ ఎగ్జామినేషన్ కు ఎంపిక చేస్తారు. అయితే తుది ఫలితాల్లో మా త్రం ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.

సివిల్స్ ప్రిలిమ్స్-2026 సమాచారం

నోటిఫికేషన్ విడుదల: జనవరి చివరి వారం/ఫిబ్రవరి మొదటి వారం

ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 2026, మే 24

అకడమిక్ అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: జనరల్ కేటగిరీకి గరిష్ట వయోపరి మితి 32 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అయి దేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమి తిలో సడలింపు లభిస్తుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area