హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్సీఎల్), రాజస్థాన్ 18 చార్జ్ మ్యాన్ (ఎలక్ట్రికల్), ఎలక్ట్రిషియన్ పోస్టుల భర్తీ
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్సీఎల్), రాజస్థాన్ 18 చార్జ్ మ్యాన్ (ఎలక్ట్రికల్), ఎలక్ట్రిషియన్ పోస్టులను భర్తీచేయనుంది. డిప్లొమా/ ఐటీఐ/ డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్టు, రైటింగ్ ఎబిలిటీ టెస్ట్లతో నియామకాలు ఉంటాయి.
విద్యార్హతలు, ఖాళీల వివరాలు
పోస్టు: చార్జ్మ్యన్ (ఎలక్ట్రికల్)
ఖాళీలు: 4
అర్హత: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా, మైనింగ్ సూపర్వైజర్ గా ఏడాది అనుభవం, సూపర్వైజరీ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉండాలి/ఐటీఐ (ఎలక్ట్రికల్), మూడేళ్ల అనుభవం లేదా పదోతరగతి, ఐదేళ్ల అనుభవం, సూపర్వైజరీ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉండాలి.
వేతన శ్రేణి: నెలకు రూ.28,740 - 72,110
పోస్టు: ఎలక్ట్రిషియన్ 'ఏ'
ఖాళీలు: 2
అర్హత: ఐటీఐ (ఎలక్ట్రికల్), నాలుగేళ్ల అనుభవం/పదోతరగతి, ఏడేళ్ల అనుభవం, వైర్మెన్ పర్మిట్ ఉండాలి.
వేతన శ్రేణి: నెలకు రూ. 28,430 - 59,700
పోస్టు: ఎలక్ట్రిషియన్ 'బీ'
ఖాళీలు: 3
అర్హత: ఐటీఐ (ఎలక్ట్రికల్), మూడేళ్ల అనుభవం/ పదోతరగతి, ఏడేళ్ల అనుభవం, వైర్మెన్ పర్మిట్ ఉండాలి.
వేతన శ్రేణి: నెలకు రూ. 28,280 - 57,640
పోస్టు: డబ్ల్యూఈడీ 'బీ'
ఖాళీలు: 4
అర్హత: డిప్లొమా, ఏడాది అనుభవం, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్స్ సర్టిఫికెట్/ ఏదైనా డిగ్రీ, ఏడాది అనుభవం/ ఐటీఐ, మూడేళ్ల అనుభవం/ పదోతరగతి, ఆరేళ్ల అనుభవం ఉండాలి.
వేతన శ్రేణి: నెలకు రూ. 28,280 - 57,640
పోస్టు: డబ్ల్యూఈడీ 'సీ
ఖాళీలు: 5
అర్హత: డిప్లొమా, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్స్ సర్టిఫికెట్/ఏదైనా డిగ్రీ, ఆరు నెలల అనుభవం/ ఐటీఐ, రెండేళ్ల అనుభవం/ పదోతరగతి, నాలుగేళ్ల అనుభవం.
వేతన శ్రేణి: నెలకు రూ. 28,120 - 55,620
ఎంపిక:
▪️రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలోని రాత పరీక్షకు 100 మార్కులు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీల్లో మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రశ్నలకు 80 మార్కులు, జనరల్ నాలెడ్జ్కు 20 మార్కులు.
▪️ఇందులో జనరల్ అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ/ ఎస్టీ 35 శాతం, ఓబీసీ-ఎన్సీఎల్ 38 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.
▪️వీరిని 1:3 నిష్పత్తిలో రెండో దశలోని ట్రేడ్ టెస్ట్కు ఎంపిక చేస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. రాత పరీక్షలో పొందిన మార్కులతో తుది ఎంపిక చేస్తారు.
వివరాలు:
వయసు: 01.01.2026 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీకి ఐదేళ్లు, ఓబీసీ-ఎన్సీఎల్ కి మూడేళ్లు, క్రీడాకారులకు ఐదు నుంచి పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ అర్రిజర్వుడ్, ఓబీసీ-ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్లకు రూ.500, ప్రత్యేక వర్గాలకు చెందినవారికి ఫీజు లేదు.
వేతనం: పోస్టులను బట్టి మారుతుంది. మూలవేతనానికి అదనంగా డీఏ, పెర్క్స్, అలవెన్స్, ఎక్స్ గ్రేషియా, సెలవులు, పీఎఫ్, గ్రాట్యుటీ, ఎన్పీఎస్, వైద్య సదుపాయాలు ఉంటాయి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.02.2026
వెబ్ సైట్: https://www.hindustancopper.com
.jpeg)