అనాథల చదువుకు చుక్కాని... హీల్. 2026-27 ప్రవేశాలకు వేళాయె
• ఇక్కడ ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలు
• హీల్ ప్యారడైజ్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
• ఆఖరు తేదీ 2026 ఫిబ్రవరి 15
ఈ విద్యా సంవత్సరం ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు, 11వ తరగతి (ఇంటర్మీడియట్ మొదటి సంవ త్సరం) ఎంపీసీ, బైపీసీ, ఎంఈఏ కోర్సులకు, హీల్ అంధుల పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
చదువుకునే వయసులో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని.. లేదా ఇద్దరినీ కోల్పోవడం భరించలేని విషాదం. అలాంటి సందర్భాల్లో చదువు ఆపేయా ల్సిన దుస్థితి కూడా చాలామందికి ఏర్ప డుతుంది. ఇలాంటి నిరుపేద చిన్నా రులు చదువుకు దూరం కాకూడదన్న ఉన్నత లక్ష్యంతో డాక్టర్ కోనేరు సత్య ప్రసాద్ ఏర్పాటుచేసిన విద్యా సంస్థే.. హేల్ ప్యారడైజ్, ఏలూరు జిల్లా ఆగిరి పల్లి మండలం తోటపల్లిలో 90 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న ఈ పాఠశా లలో ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందిస్తారు. ఒకటో తరగతి నుంచి ఇంట ర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో సీబీఎస్ఈ పాఠ్య ప్రణాళికతో కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ఇక్కడ బోధిస్తున్నారు. ఇది గన్నవరం విమానాశ్రయానికి 12 కి.మీ. దూరంలో ఉంది.
15 వేల పుస్తకాలతో గ్రంథాలయం
పాఠశాలలో 15 వేల పుస్తకాలతో అతి పెద్ద గ్రంథాలయం అందుబాటులో ఉంది. విద్యార్థుల ఆసక్తి మేరకు కళల్లోనూ ప్రోత్సహిస్తున్నారు. త్రీడీ చిత్రలేఖనం, క్రాఫ్ట్, సంగీతం, నృత్యం, తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 400 మీటర్ల ట్రాక్, బాస్కెట్బాల్ , కబడ్డీ, బో-ఖో, వాలీబాల్, హ్యాండ్బాల్ కోర్టులూ ఉన్నాయి
అద్భుతమైన వసతులు
బాలబాలికలకు వేర్వేరుగా ఆధునిక హంగులతో వసతి గృహాలు ఉన్నాయి. విద్యార్థులకు అందించే భోజనానికి సేంద్రియ పద్ధతిలో పండిం చిన కూరగాయలను వినియోగిస్తు న్నారు. విశాలమైన భోజనశాల, సోలార్ వంటగది, విద్యార్థులు తాగేందుకు ఆర్వో శుద్ధ జలం, వేడినీరు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ గదుల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు. కెమిస్ట్రీ, పిజిర్స్, మ్యాథ్స్ బయాలజీ, ఆర్ట్స్, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. అద్భుత మైన క్రీడా సౌకర్యాలు, ఇండోర్ స్టేడియం ఉన్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్షిప్ కేంద్రం, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎక్స్టెన్స్, సైబర్ సెక్యూరిటీ కేంద్రం, 3డీ ప్రింటింగ్, డిజైన్ థింకింగ్ ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మెడికల్, ఇంజినీరింగ్ ఇతర కోర్సుల్లో ఉన్నత చదువులకూ హీల్ సంస్థే సహకరిస్తుంది. విద్యార్థుల కోసం పాఠశాల ప్రాంగ ణంలోనే ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అత్యుత్తమ అర్హత పొందిన ఉపాధ్యాయులు, అంతర్జాతీయ దూర విద్యా ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ అందిస్తారు.
తల్లిదండ్రులను కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే...
నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారు. లకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాం. హీల్ ద్వారా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే మా ధ్యేయం. దేశంలోని ప్రాంతం వారైనా ఇక్కడ చేరవచ్చు' అని హీల్ సంస్థ వ్యవస్థాపక అధ్య క్షుడు డా. కోనేరు సత్యప్రసాద్, కార్య దర్శి తాతినేని లక్ష్మి, సీఈవో కె. అజయ్ కుమార్ తెలిపారు.
ప్రవేశాలకు ఇవీ అర్హతలు
1 నుండి, 9 తరగతులకు
• తల్లిదండ్రులు ఇద్దరినీ, లేదా ఎవరినైనా ఒక రిని కోల్పోయి ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభా వంతులైన 6 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న విద్యార్థులు.
• మరణ ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి.
• హీల్ ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత తప్పనిసరి.
11వ తరగతి (ఎంపీసీ, బైపీసీ, ఎంఈఏ)లో
• ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు పదో తరగతిలో 480 మార్కులు, సీబీఎస్ఈ (లేదా) ఐసీఎస్ఈలో 400 పైన మార్కులు సాధించిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
• తెల్లరేషన్ కార్డు, ఆదాయ ధ్రువ పత్రం తప్పనిసరి.
అంధ పాఠశాలకు అర్హత ఇలా...
• 1-8 తరగతుల విద్యార్థులు ప్రవేశాలకు ఆర్హులు
• ఆర్ధికంగా వెనుకబడి, 40 శాతం కంటే ఎక్కువ అంధత్వ ధ్రువపత్రం ఉన్నవారు అర్హులు
దరఖాస్తు చేయడం ఇలా...
దరఖాస్తుకు ఆఖరి తేది: 2026 ఫిబ్రవరి15
దరఖాస్తు విధానం:
క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు లింక్:
.jpeg)
.jpeg)