హోంశాఖ నివేదికపోలీసు శాఖలో భారీగా ఖాళీలు. ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు 13 కేటగిరీల్లో 11,639 ఖాళీలు
రాష్ట్రంలో పోలీసు శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయి. అధికారులు సిబ్బంది కొరత పోలీసు శాఖను వేధిస్తోంది. 11,639 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని హోం శాఖ ప్రభుత్వానికి ఇటీ వల నివేదిక సమర్పించింది. ఎస్సై నుంచి కానిస్టే బుల్ వరకు 13 కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టు లను భర్తీ చేయాల్సి ఉందని ఆ నివేదికలో పేర్కొంది. కాగా దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు నియామక మండలి పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. 411 ఎస్సై పోస్టులకు 2022లో నోటిఫికేషన్ జారీ చేసి రాతపరీక్షలు నిర్వహించి భర్తీ చేసింది. 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీచేసి రాతపరీక్ష నిర్వహించింది. కాగా న్యాయపరమైన వివాదాలతో పోస్టుల భర్తీకి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ నోటిఫికే షన్, రాత పరీక్ష ఆధారంగానే ఆ కానిస్టేబుల్ పోస్టులకు ప్రభుత్వం నియామక ఉత్తర్వులు ఇచ్చింది. కాగా కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పోలీసు శాఖలో ఖాళీల భర్తీపై ఇంకా దృష్టి సారించ లేదు.
హోం శాఖ నివేదిక ప్రకారం పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు.
పోస్టు - ఖాళీలు
• ఎస్సై(సివిల్) - 182
• రిజర్వ్ ఎస్సై (ఏఆర్) - 116
• రిజర్వ్ ఎస్సై (ఎస్ఏఆర్ సీపీఎల్) - 18
• రిజర్వ్ ఎస్సై (ఏపీఎస్పీ) - 53
• ఎస్సై (కమ్యూనికేషన్) - 61
• ఎస్సై (పీటీవో) - 14
• పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) - 3,622
• పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) - 2,000
• పోలీస్ కానిస్టేబుల్ (ఏపీఎస్పీ) - 4,587
• పోలీస్ కానిస్టేబుల్(ఎస్ఏఆర్ సీపీఎల్) - 475
• పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) - 15
• పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) - 198
• పోలీస్ కానిస్టేబుల్ (కమ్యూనికేషన్) - 298
మొత్తం ఖాళీలు - 11,639
