Type Here to Get Search Results !

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్) లో 542 కొలువులు

 బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్) లో 542 కొలువులు



భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్) 542 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి.

మొత్తం 542 ఉద్యోగాల్లో అన్ రిజర్వుడ్కు 269, ఓబీసీలకు 136, ఈడబ్ల్యూ ఎస్లకు 27, ఎస్సీలకు 72, ఎస్టీలకు 38 కేటాయించారు.

వెహికల్ మెకానిక్ 324, ఎంఎస్ డబ్ల్యూ (పెయింటర్) 13, ఎంఎస్ డబ్ల్యూ (డీఈఎస్) 205 ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఫిజి కల్ ఎఫిషియన్సీ టెస్ట్, ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్ట్, వైద్య పరీక్షలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. ట్రేడును బట్టి పరీక్ష వ్యవధి గంట నుంచి మూడు గంటలు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్/ సబ్జెక్టివ్ విధానంలో ఇస్తారు. అయితే దరఖాస్తుల సంఖ్యను బట్టి రాత పరీక్షను ఏ విధానంలో నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు ఓఎంఆర్ విధా నంలో, సబ్జెక్టివ్ ప్రశ్నలకు కాగితంపై సమాధానాలు రాయాలి. రాత పరీక్షలో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం కనీసా ర్హత మార్కులు సాధించాలి.

రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 125 ప్రశ్నలతో ఉంటుంది. ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు ఉండవు. నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు. ఇస్తారు. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్, ఎబిటీల నుంచి 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ట్రేడ్- సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు 50 అడుగుతారు.

ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుకు ఎంపిక చేస్తారు. ఇందులో పరుగు, లాంగ్ జంప్, పుషప్స్ ఉంటాయి. అర్హత సాధించినవారికి ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్ట్ నిర్వహి స్తారు. విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి కేట గిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు. ప్రాథమికంగా ఎంపికైనవారి వివరాలను వెబ్సైట్లో ప్రకటిస్తారు. వారు తర్వాతి దశలకు పుణెలోని జీఆర్ఎఫ్ సెంటర్ హాజరుకావాలి.

సన్నద్ధత

• ట్రేడ్ సెక్షను ఎక్కువ మార్కులు కేటాయించారు. సబ్జె క్టుల్లోని అంశాలను చదువుకుని పునశ్చ రణ చేసుకోవాలి.

• రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్లకు వివిధ పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.

• రుణాత్మక మార్కులు లేవు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని ప్రశ్నల న్నింటికీ సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి.

• ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ను నిర్లక్ష్యం చేయకూడదు. దీంట్లో ప్రతిభ కనబరచక పోతే తదుపరి దశకు ఎంపిక చేయరు. కాబట్టి రన్నింగ్, లాంగ్ జంప్, పుషప్ లకు సమయం కేటాయించి, సాధన చేయాలి.

ముఖ్యాంశాలు

అర్హతలు: మూడు పోస్టులకు మెట్రిక్యులేషన్ పూర్తి చేయాలి. వెహికల్ మెకానిక్కు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్/ బ్రిక్స్ మేసన్ ఐటీఐ/ ఐటీసీ/ ఒకేషనల్ ట్రేడ్స్ సర్టిఫికెట్ ఉండాలి.

వయసు: వెహికల్ మెకానిక్ కు 18-27 సంవత్సరాలు, ఎంఎస్ డబ్ల్యూ (పెయింటర్), డీఈఎస్లకు 18-25 ఏళ్లు ఉండాలి. ప్రత్యేక వర్గాలకు చెందినవారికి ప్రభుత్వ నిబంధన లకు అనుగుణంగా గరిష్ట వయసులో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.50, ఎస్సీ/ఎస్టీలకు ఫీజు లేదు.

వేతన శ్రేణి: వెహికల్ మెకానిక్కు నెలకు రూ.19,900-63,2,00 ఎమ్ ఎస్ డబల్యూ లకు 18,000-56,900. హెచ్ ఆర్ ఏ, డిఏ టీఏ, ఇతర అలవెన్సులూ ఉంటాయి.

చిరునామా: దరఖాస్తులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తిచేసిన వాటికి సంబంధిత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, కమాండెంట్, జీఆర్ ఈఎఫ్ సెంటర్, దిఘి క్యాంప్, పుణె-411 015 చిరునామాకు రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి.

ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 24. 11. 2025 

వెబ్ సైట్: https://bro.gov.in/

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area