నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) - సీమ్యాట్-2026
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మేనేజ్మెంట్ కళాశాలల్లో ప్రవేశా లకు కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యా ట్) నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
» అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణుల వ్వాలి. ప్రస్తుతం ఆఖరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
» ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికచే స్తారు.
» పరీక్ష విధానం: మొత్తం 100 ప్రశ్నలకు, 400 మార్కులతో ప్రశ్నాపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రైటేషన్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్, జనరల్ అవేర్నెస్, ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. నెగి టివ్ మార్కులు ఉంటాయి. ఆంగ్ల మాధ్యమం లో ప్రశ్నాపత్రం ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 17.10.2025.
» దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 18.11.2025.
» దరఖాస్తు సవరణ తేదీలు: 20.11.2025 ລ້໖ 22.11.2025 2
» తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
» వెబ్ సైట్: https://cmat.nta.nic.in
