డా.రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డీఆర్ఆర్ఎంఎస్ఐఎంఎస్), లక్నోలో 422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు
లక్నోలోని డా.రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డీఆర్ఆర్ఎంఎస్ఐఎంఎస్) లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 422.
» అర్హత: ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్శిటీ నుంచి బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్, స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్స్, మిడ్వైఫ్ గా నమోదు చేసుకోవాలి. జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
» వేతనం: బేసిక్ పే నెలకు రూ.44,900.
» వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్క్రీనింగ్, మెయిన్స్), ఉద్యోగానుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తులకు చివరితేది: 15.12.2025.
» వెబ్ సైట్: https://drrmlims.ac.in/
