Type Here to Get Search Results !

ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్

 ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్



ఇండియన్ ఆర్మీలోని 10 ప్లస్ 2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (టీఈఎస్) కోర్సులో ప్రవేశాల కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను కోరుతున్నారు. ఇందులో ఎంపికైన వారికి బీటెక్ డిగ్రీతోపాటు, సైన్యంలో లెఫ్టినెంట్ ఉద్యోగంలో చేరవచ్చు.

కోర్సు: టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 55 కోర్సు (టీఈఎస్) -2025 జులై 2026

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. అయితే ఇంటర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి. దీనితోపాటు జేఈఈ మెయిన్ 2025 స్కోరు సాధించాలి.

వయస్సు: 2025 జూలై 1 నాటికి పదహారున్నర సంవత్స రాల నుంచి పంతొమ్మిదిన్నర సంవత్సరాల మధ్యలో ఉండాలి.

వేతనం: మిలిటరీ సర్వీస్ పే కింద చదువుకునే కాలంలో స్టైయి పెండ్ నెలకు 15,500/- రూపాయలు లభిస్తుంది. తర్వాత 56,000/- వేతనంతో పాటు డీఏ, హెచ్ఎర్ఎ ఇతర ప్రోత్సాహకాలు అందుతాయి.

ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్) స్కోరు, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదిత రాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

కోర్సు శిక్షణ: కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు. ఇందులో బేసిక్ మిలిటరీ ట్రైనింగ్, బీటెక్ టెక్నికల్ శిక్షణ ఇస్తారు. మొదటి మూడేళ్లు పుణె, సికింద్రాబాద్, మావ్ ల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఈ శిక్షణ ఉంటుంది. తరువాత డెహ్రాడూన్ లోని 'ఇండియన్ మిలిటరీ అకాడమీ'లో శిక్షణ కొనసాగు తుంది. ఆపై డిగ్రీతోపాటు, లెఫ్టి నెంట్ హోదాలో సైన్యంలో విధుల్లోకి తీసుకుంటారు.

చివరి తేదీ: 2025 నవంబర్ 13

వెబ్సైటు: joinindianarmy.nic.in


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area