జేఈఈ మెయిన్ 2026 - ప్రాక్టీస్ తోనే మెయిన్లో విజయం
» జేఈఈ-మెయిన్ 2026 షెడ్యూల్ విడుదల
» జనవరి 21 నుంచి తొలి సెషన్
» ఏప్రిల్ నుంచి రెండో సెషన్.
» త్వరలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
జేఈఈ-మెయిన్ లక్షల మంది విద్యార్థులు పోటీ పడే పరీక్ష. ఈ పరీక్షలో ర్యాంకుతో అటు ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్ ఐల్లో బీటెక్ ప్రవేశాలు పొందే అవకాశంతోపాటు.. ప్రతిష్టాత్మక ఇంజనీరిం గ్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్కు కూడా అర్హత పొందొచ్చు. విద్యార్థులు జేఈఈ-మెయిన్ మంచి స్కోర్ కోసం ఇంటర్లో చేరిన తొలి రోజు నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తున్నారు. తాజాగా జేఈఈ మెయిన్-2026కు సంబంధించిన షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్-2026 పరీక్ష విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలు.
పది లక్షలకు పైగా పోటీ
జేఈఈ మెయిన్ కు దేశవ్యాప్తంగా ఏటా 12 లక్షల నుంచి 13 లక్షల మంది వరకూ పోటీపడుతుం చారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 లక్షలకు పైగా అభ్యర్థులు ఉంటారని అంచనా. తీవ్ర పోటీ దృష్ట్యా సాధ్యమైనంత ముందుగా ప్రిపరేషన్ ప్రారంభించాలని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నా రు. సిలబస్ను పరిశీలిస్తూ. అప్లికేషన్ ఆధారిత అధ్యయనం సాగించాలని సూచిస్తున్నారు.
అర్హత
ఎంపీసీ గ్రూప్ ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సులో 2024, 2025లో ఉత్తీర్ణత సాదించిన వారు, అదేవిధంగా 2028లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జేఈఈ-మెయిన్ పేపర్లు ఇలా
జేఈఈ-మెయిన్ పేవర్ల తీరు తెన్నులను పరిశీలిస్తే.. బీటెక్ అభ్యర్ధులకు పేపర్-1, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అభ్యర్థులకు పేపర్-2ఎ బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల అభ్యర్థులకు పేపర్-20 నిర్వహిస్తారు.
బీఈ/బీటెక్ లో ప్రవేశానికి పేపర్-1
బీటెక్, బీఈ ప్రోగ్రామ్ల లకు నిర్దేశించిన పేపర్-1ను మొత్తం మూడు సబ్జెక్ట్స్లో రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 75 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటాయి. సెక్షన్-ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహులైచ్చిక ప్రశ్నలతో (ఎంసీక్యూలతో) ఉంటుంది. సెక్షన్-బి లో న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలుం టాయి. గత ఏడాది నుంచి సెక్షన్-బిలో ఛాయిస్ విధానం తొలగించారు. అభ్యర్థులు అయిదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. సెక్షన్-ఏలో 0.25 శాతం నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది.
బీఆర్క్ పరీక్ష - 400 మార్కులు
నిట్లు, ట్రిపుల్ ఐటీలు, ఇతర ఇన్ స్టిట్యూట్ లలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు పేపర్-2ఎకు హాజరవ్వాల్సి ఉంటుం ది. ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్ట్, డ్రాయింగ్ బెస్ట్లపై 77 ప్రశ్నలు మొత్తం 400 మార్కులకు ఉంటాయి. డ్రాయింగ్ బెస్ట్లో రెండు అంశాలను ఇచ్చి డ్రాయింగ్ వేయమంటారు. ఒక్కో టాపిక్కు 50 మార్కులు.
పేపర్-2 ఇలా
బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా నిర్వహించే పేపర్-2బి... మూడు విభాగాల నుంచి 400 మార్కులకు పరీక్ష ఉంటుం ది. ఇందులో మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ బెస్ట్. ప్లానింగ్ ఆధారిత ప్రశ్నలు 100 ఉంటాయి.
అప్లికేషన్ ఆధారిత ప్రిపరేషన్
జేఈఈ- మెయిన్ విద్యార్థులు ఆయా సబ్జెక్ట్లను అప్లికేషన్ ఓరియెంటేషన్తో ప్రిపరేషన్ సాగించడం. మేలు చేస్తుంది. ప్రధానంగా ఆయా సబ్జెక్ట్ బేసిక్ కాన్సెప్ట్ పై పట్టు సాధించాలి. వాటిని వాస్తవ పరిస్థితులతో అన్వయం చేసుకుంటూ చదవాలి. అదే విధంగా చదివే సమయంలోనే ముఖ్యమైన ఫార్ములాలు, కీ పాయింట్స్ను షార్ట్ నోట్స్ గా రూపొందించుకుంటే.. ఇంటర్, జేఈఈ-మెయిన్ రెండు పరీక్షల రివిజన్ పరంగా ఎంతో కలిసొస్తుం ది. జేఈఈ-మెయిన్ జనవరి సెషన్ కు హాజరై ఆశించిన స్థాయిలో మార్కులు సాధిందని విద్యార్థులు.. ఏప్రిల్ సెషన్కు హాజరవుతుంటారు. వీరు జనవరి సెషన్ 'కీ' ఆధారంగా, తమ ఆన్సర్ షీట్లను పరిశీలించుకోవడం ద్వారా తాము ఇంకా పట్టు సాధించాల్సిన అంశాలను గుర్తించి.. వాటిపై దృష్టి పెట్టాలి..
ప్రాక్టీస్.. ప్రాక్టీస్:
జేఈఈ-మెయిన్ పరీక్షకు ప్రిపరేషన్లో ప్రాక్టీస్ ఎం తో కీలకంగా నిలుస్తోంది. విద్యార్థులు ప్రతిరోజు తాము చదివిన సబ్జెక్టు సంబంధింది. అందులో చి ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉన్న అంశాలను ప్రాక్టీస్ చేయాలి. వాస్తవానికి జేఈఈ- మెయిన్ సిలబస్ ను పరిగణనలోకి తీసుకుంటే అధిక శాతం అంశాలు ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సం వత్సరం సిలబస్ నుండి ఉన్నాయి. మొదటి సం వత్సరం అంకాలను, రెండో సంవత్సరం ఆం శాలతో అనుసంధానం చేసుకుంటూ రడవాలి. ఫలితంగా సంబంధిత అంశంపై పూర్తి స్థాయిలో అవగాహన లభిస్తుంది. ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత సొంతమవుతుంది.
న్యూమరికల్ ప్రశ్నలకు
జేఈఈ-మెయిన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమె టిర్స్ ఈ మూడు సబ్జెక్ట్ నుంచీ అయిదు ప్రశ్నలు చొప్పున న్యూమరికల్ ఆధారిత ప్రశ్నలు అడగను న్నారు. విద్యార్థులు ఆయా సబ్జెక్లలో న్యూమరిక్స్ ఆధారంగా సమాధానం సాదించాల్సిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మాక్ టెస్ట్లు ప్రీ-ఫైనల్ టెస్ట్లు
జేఈఈ- మెయిన్ విద్యార్థులు మాక్ టెస్ట్లకు హాజరవరం అదే విధంగా ఇంటర్ ఫ్రీ-ఫైనల్ టెన్లకు హాజరు కావడం.. వాటి ఫలితాలను విశ్లేషించుకోవడం ఎంతో అవసరం, ముఖ్యంగా ఏప్రిల్ సెషన్కు హాజరయ్యే అభ్యర్థులు ఈ వ్యూహాన్ని అమలు చేయాలి. జనవరి సెషన్కు హాజరయ్యే అభ్యర్థులకు ప్రస్తుతం దాదాపు నెలరోజుల సమయం అందుబాటులో ఉంది.
టైమ్ మేనేజ్ మెంట్
టైమ్ మేనేజ్ మెంట్ కూడా ఎంతో ముఖ్యమైన ఆం శమని విద్యార్థులు గుర్తించాలి. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్ చదివే విధంగా సమయం కేటాయించాలి. ప్రతి సబ్జెక్ట్స్ కు కనీసం రెండు గంటల సమయం కేటాయించేలా చూసుకోవాలి, తమకు బాగా సుల భమైన సబ్జెర్ల కు కొంత తక్కువ సమయం కేటా యించి.. క్లిష్టంగా భావించే సబ్జెక్టరు కొంత ఎక్కు వ సమయం కేటాయించడం మేలు.
ఏప్రిల్ సెషన్కు ఇలా
ఏప్రిల్లో నిర్వహించే రెండో సెషన్కు కూడా. అభ్యర్ధుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. జనవరి సెషన్లో సరైన స్కోర్ సాధించని వారు ఏప్రిల్. సెషన్కు హాజరవుతున్నారు. డిసెంబర్లో ఇంటర్ సిలబస్ పూర్తి చేసుకున్న విద్యార్థులు, ఆ తర్వాత:-సమయంలో జేఈఈ- మెయిన్ పరీక్ష సిలబస్ ను పరిశీలించి దానికి అనుగుణంగా ఫిబ్రవరి చివరి వారం వరకు ప్రిపరేషన్ సాగించాలి. ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత జేఈఈ-మెయిన్ ఏప్రిల్ సెషన్ తేదీకి మధ్య ఉన్న వ్యవధిని పూర్తిగా రివిజన్, మాక్ టెస్ట్ల ప్రాక్టీస్కు కేటాయించాలి. ఫలితంగా జేఈఈ-మెయిన్ లో మంచి స్కోర్ సాదించే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
సబ్జెక్ల వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలు:
జేఈఈ-మెయిన్ పరీక్షల ప్రిపరేషన్లో విద్యార్థులు సబ్జెక్ట్ వారీగా దృష్టి సారిం వాల్సిన ప్రధానాంశాలు.
మ్యాథమెటిక్స్: మ్యాథమెటిక్స్లో కో ఆర్డినేట్ జామెట్రీ, వెక్టార్ ఆల్జీబ్రా ఇం టిగ్రేషన్, కాంప్లెక్స్ నెంబర్స్, పాఠాబోలా, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, వీటివల్ల కొంత ఎక్కువ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది.
ఫిజిక్స్: ఫిజిక్స్లో ఎలక్ట్రో డైనమిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్ హెచ్ఎం అండ్ వేవ్స్కు ప్రాధాన్యమివ్వాలి. సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కాలిజన్. సింపుల్: హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వెప్పే అవగాహన ఏర్పరచుకుంటే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.
కెమిస్ట్రీ: ఇందులో కెమికల్ బాండింగ్, పిరియాడిక్ టేబుల్, కింగ్ మూలాలపై అవగాహనను తెలుసుకునేలా ప్రశ్నలు ఆడు గుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తాజా మార్పులకు అనుగుణంగా తొలగించిన బాపీ క్స్. బాప్టర్లు గుర్తించాలి. మోల్ కాన్సెప్ట్. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియన్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ పై పట్టు సాదించాలి.
జేఈఈ మెయిన్-2026 ముఖ్యాంశాలు:
• జనవరి 21 నుంచి 30 వరకు తొలి సెషన్
• ఏప్రిల్ 1 నుంచి 10 వరకు రెండో సెషన్
