Type Here to Get Search Results !

త్రివిధ దళాలకు 'స్కూల్' బాట : ఏఐఎస్ఎస్ఈఈ 2026

 త్రివిధ దళాలకు 'స్కూల్' బాట : ఏఐఎస్ఎస్ఈఈ 2026



» సైనిక్ స్కూల్ 2026-27 ప్రవేశాలకు నోటిఫికేషన్

» ఏఐఎస్ఎస్ఈఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక

» ఆరు, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలు

త్రివిధ దళాలలో పనిచేయాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది. పాఠశాల స్థాయి నుంచే సాయుధ బలగాలకు అవసరమైన అధికారులను సిద్ధంచేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలను ఏర్పాటు చేసింది. ఈ సైనిక స్కూళ్లల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశా లకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఏఐఎస్ఎస్ఈఈ) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను ఎన్డీఏ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యం లో.. సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష పూర్తి వివరాలు.

మొత్తం 33 సైనిక్ స్కూల్స్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. వీటితోపాటు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో మరికొన్ని(ఆరో తరగతికి 69 స్కూల్స్, తొమ్మిదో తరగతికి 19 స్కూళ్లకు) సైనిక్ స్కూల్స్ ఏర్పాటకు కేంద్ర రక్షణ శాఖ అనుమతిచ్చింది. కేం ద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతి పత్తి కలిగిన సంస్థ సైనిక్ స్కూల్ సొసైటీ.. దేశవ్యా ప్తంగా ఉన్న సైనిక్ స్కూల్స్ను పర్యవేక్షిస్తుంది. సైనిక్ స్కూల్స్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉం టుంది. వీటిని పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఇవి సీబీఎస్ఈ బోర్డు అనుబం ధంగా పనిచేస్తాయి. ఖడక్వాస్లా (పుణె)లోని నేష నల్ డిఫెన్స్ అకాడెమీ, ఎజిమలలాలోని ఇండియన్ నేవల్ అకాడెమీతోపాటు ఇతర శిక్షణ అకాడెమీలకు క్యాడెట్లను ఇక్కడ సిద్దం చేస్తారు.

అర్హత

ఆరో తరగతికి దరఖాస్తు చేసుకొనే విద్యార్థులు 31.03.2026 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉం డాలి. తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి. ఎనిమిదో తరగతి పాసై ఉండాలి.

ఎంపిక విధానం

ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. రాత పరీ క్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. బాలిక లకు సైతం అడ్మిషన్ లభిస్తుంది. సీట్ల లభ్యత, వయసు, ప్రమాణాలు బాల బాలికలకు ఒకేలా ఉం టాయి. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఈ కౌన్సె లింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు,

పరీక్ష విధానం

ఏఐఎస్ఎస్ఈ పరీక్ష పెన్-పేపర్ (ఓఎంఆర్) విధానంలో ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలో లాంగ్వేజ్ 25 ప్రశ్నలు - 50 మార్కులకు, మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలు-150 మార్కులకు, ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులకు, జన రల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు-50 మార్కులకు ఉం టాయి. మొత్తం 125 ప్రశ్నలు-300 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు. ఈ పరీక్షను ఇంగ్లిష్ తోపాటు స్థానిక భాషల్లోనూ నిర్వహిస్తారు.

తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలో.. ఇంగ్లిష్ 25 ప్రశ్నలు-50 మార్కులకు, మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలు-200 మార్కులకు, ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులకు, జన రల్ సైన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులకు, సోషల్ సైన్స్ 25 ప్రశ్నలు- 50 మార్కులకు ఉంటాయి. మొత్తం 150 ప్రశ్నలు-400 మార్కులకు ఉం టుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు. పరీక్ష ఇంగ్లిష్ మీడియంలో జరుగుతుంది..

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షకేంద్రాలు

ఆంధ్రప్రదేశ్: అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్ర వరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశా ఖపట్నం, విజయనగరం.

తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్.

దరఖాస్తు ఫీజు: జనరల్/రక్షణ రంగంలో పనిచేస్తున్న వారి పిల్లలు, ఓబీసీలు(నాన్ క్రిమీలేయర్), ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకు రూ.850, ఎస్సీ/ఎస్టీలకు రూ.700.

ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 10.10.202

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.10.202.

దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 31.10.2025.

దరఖాస్తు సవరణ తేదీలు: 02.11.2025 నుండి 04.11.2025 

సైనిక్ స్కూల్ పరీక్ష తేదీ: జనవరి-2026.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area