ఎం.డిజైన్ కోర్సుల్లో చేరుతారా... సీఈఈడీ 2026కు ఐఐటీ బాంబే నోటిఫికేషన్.
సీడ్ (సీఈఈడీ) కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినే షన్ ఫర్ డిజైన్! ప్రముఖ ఐఐటీలతోపాటు బెం గళూరులోని ఐఐఎస్సీలో మాస్టర్ ఆఫ్ డిజైన్, పీహెచ్ఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష!! ఐఐటీ బాంబే ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఒక ఏడాది పాటు సీడ్ స్కోర్ పరిగణనలో ఉంటుంది. సీడ్ స్కోర్ ఆధారంగా దరఖాస్తున్న చేసుకున్న అభ్యర్థులకు ఆయా ఇన్స్టిట్యూట్స్ తను అడ్మి షన్ విధానాలకు అనుగుణంగా ప్రత్యేక ఎంపిక ప్రక్రియ నిర్వహించి ప్రవేశం కల్పిస్తాయి. సీడ్ 2026 పూర్తి వివరాలు.
ప్రవేశం కల్పించే ఇన్స్టిట్యూట్స్
ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-గువహటి, ఐఐటీ- హైదరాబాద్, బఐటీ-జోధ్పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ-రూర్కీ, ఐఐఐటీడీఎం- జబల్ పూర్, ఐఐఐటీడీఎం-కాంచీపురం, ఐఐఎస్సీ-బెం గళూరుల్లో ఎం.డిజైన్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. అదే విధంగా డిజైన్ విభాగంలో పలు ఐఐటీలు, డిజైన్ స్కూల్స్లో సీడ్ స్కోర్ ఆధారంగా పీహెచ్ఎలో అడ్మిషన్లో లభిస్తుంది.
అర్హతలు
◾సీడ్ దరఖాస్తు చేసుకునేందుకు గ్రాడ్యుయేట్ డిగ్రీ /డిప్లొమా/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీ ర్థులై ఉండాలి. 10-2 తర్వాత కనీసం మూడేళ్ల కోర్సు తప్పనిసరిగా చదివి ఉండాలని పేర్కొ న్నారు. ఆయా కోర్సుల ఫైనల్ పరీక్షలను 2026 జూలైలోపు పూర్తి చేసుకోవాలి.
◾అదే విధంగా పదో తరగతి తర్వాత 10-5 విధా నంలో గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ కోర్సులు 2028 జూలైలోపు పూర్తి చేసు కునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
◾సీడ్ పరీక్షకు హాజరయ్యేందుకు ఎలాంటి వయో పరిమితి నిబంధన లేదు. ఎన్నిసార్లయినా పరీ క్షకు హాజరుకావచ్చు.
◾ఆయా ఇన్స్టిట్యూట్స్లో అర్హత ప్రమాణాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి సీడ్ స్కోర్ ఆధా రంగా దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అర్హతలు పరిశీలించుకోవాలి.
◾సంబంధిత ఇన్స్టిట్యూట్ల అడ్మిషన్ నోటిఫికేష న కు అనుగుణంగా ప్రత్యేకంగా దరఖాస్తు చేసు కోవాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం
◾సీడ్ పరీక్షను రెండు పార్ట్లు(పార్ట్-ఎ,పార్ట్-బి) గా నిర్వహిస్తారు. పార్ట్ ఏ 150 మార్కులకు, పార్ట్ బీ 100 మార్కులకు ఉంటుంది.
పార్ట్-ఏలో మూడు సెక్షన్లు
◾పార్ట్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరు గుతుంది. ఈ పరీక్ష సమయం ఒక గంట. ఇం దులో మూడు సెక్షన్లు (సెక్షన్ 1,2,3) ఉం టాయి. సెక్షన్ 1లో 8 న్యూమరికల్ ఆన్సర్ టైప్. (ఎన్ఏటీ) ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తాయి. ఎలాం టి నెగిటివ్ మార్కుల నిబంధన లేదు. దీనికి సమాధానాన్ని వర్చువల్ కీ బోర్డు ద్వారా కం' ప్యూటర్ స్క్రీన్పై ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు ఎలాంటి ఛాయిస్ ఉండదు.
◾సెక్షన్ 2లో 10 మల్టిపుల్ సెలక్ట్ (ఎంఎస్యూ) ప్రశ్నలు అడుగుతారు. వీటికి ఒకటి కంటే ఎక్కు వ సరైన సమాధానాలు ఉంటాయి. ప్రతి పూర్తి సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తాయి. నెగిటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి పొర పాటు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. * సెక్షన్ 3లో 28 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (ఎంసీ క్యూ) అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు లభిస్తాయి. నెగిటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి పొరపాటు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు.
వంద మార్కులకు పార్ట్-బి
◾పార్ట్-ఎ పరీక్ష పూర్తి కాగానే పార్ట్-బి పరీక్ష వం ద మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షకు కేటా యించిన సమయం రెండు గంటలు.
◾పార్ట్-బిలో డిజైన్, డ్రాయింగ్, రైటింగ్ స్కిల్స్కు సంబంధించి అయిదు ప్రశ్నలు అడుగుతారు. స్కెచింగ్, క్రియేటివిటీ, పార్మ్ సెన్సిటివిటీ, విజు వల్ సెన్సిటివిటీ, ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ల నుంచి ఒక్కో ప్రశ్న చొప్పున అడుగుతారు. అభ్యర్థి డ్రాయింగ్ నైపుణ్యాలు పరిశీలించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం
• దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
• ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.10.2025
• ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.10.2025
• ఆలస్య రుసుముతో చివరి తేది: 07.11.2025
• సీడ్ 2026 పరీక్ష తేదీ: 18.01.2026
• వెబ్ సైట్: www.ceed.iitb.ac.in
.png)