ఇండియన్ మిలిటరీ అకాడమి (ఐఎంఏ)లో టీజీసీ-143 కోర్సులో ప్రవేశాలు
డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమి (ఐఎంఏ)లో జూలై-2026లో ప్రారంభమయ్యే 143వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 30.
» ఇంజనీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇతర ఇంజనీరింగ్ స్ట్రీమ్లు.
» అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి లేదా ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
» వయసు: 01.07.2025 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
» స్టైపెండ్: ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.56,400.
» ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, స్టేజ్-1/స్టేజ్-2 టెస్ట్లు, ఎస్ఎస్బీ ఇం టర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 08.10.2025.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.11.2025.
» వెబ్ సైట్: https://joinindianarmy.nic.in
.jpeg)